T20 WC 2021 Final: టీ20 వరల్డ్ కప్ 2021 (t20 world cup ) విజేతగా ఆస్ట్రేలియా (Australia) అవతరించింది. న్యూజిలాండ్ (Newzeland) సెట్ చేసిన టార్గెట్ ను ఆస్ట్రేలియా 18.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఫినిష్ చేసింది. 8 వికెట్ల తేడాతో మెడిన్ ధనాధన్ టోర్నీని తమ ఖాతాలో వేసుకుంది ఆస్ట్రేలియా. దీంతో పొట్టి కప్ లేని లోటును తీర్చుకుంది కంగారూల టీమ్. మిచెల్ మార్ష్ ( 50 బంతుల్లో 77 పరుగులు.. 6 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (38 బంతుల్లో 53 పరుగులు.. 4 ఫోర్లు, 3 సిక్సర్లు) తో ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించారు. ఈ రోజుల్లోనూ చాలామందికి చాలా సెంటిమెంట్లు ఉంటాయి. ఇక క్రికెట్ విషయానికి వస్తే చాలామంది ప్లేయర్లు సెంటిమెంట్ ను నమ్ముతారు.. ఇక క్రికెట్ ఫ్యాన్స్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఎవరికి వారు తమ జట్టు గెలవడానికి సెంటిమెంట్ల లెక్కలు వేసుకుంటారు.. వారి అంచనాలే నిజమయ్యాయి. ఊిహించినట్టే సెంటిమెంట్ మరోసారి రిపీట్ అయ్యింది.
T20 ప్రపంచకప్ 2021 (T20 world cup)లో భాగంగా ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ (Aus vs NZ) మధ్య జరిగిన ఫైనల్లో విజయం ఎవరిని వరిస్తుందనేది ముందే తెలిసిపోయిందా..? ఫైనల్లో తలపడిన జట్ల కెప్టెన్లలో ఎవరైతే ట్రోఫీకి ఎడమ పక్కన నిల్చుంటారో వారిదే విజయం అని జోస్యం చెబుతున్నారు నెటిజన్లు. ఇది వినడానికి సిల్లీగా ఉన్నా చరిత్ర మాత్రం ఇదే చెబుతుంది. వన్డే వరల్డ్‌కప్, టీ20 ప్రపంచకప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలాంటి మేజర్ ఐసీసీ టోర్నీల్లో చాలా సందర్భాల్లో ఇది చోటుచేసుకుంది. ఒకసారి వాటిని పరీశిలిద్దాం.
ఇదీ చదవండి: బిగ్ బాస్ 5లో టాప్ 5 ఎవరు..? వారికి లైఫ్ ఇచ్చి ఇంటిని వీడిన జెస్సీ
2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ టీమిండియా, శ్రీలంక మధ్య జరిగింది. అక్కడ ట్రోఫీకి ఎడమ పక్కన నిల్చున్న ధోనికి విజయం వరించింది.
2015 వన్డే ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడ్డాయి. ఇందులో ట్రోఫీకి ఎడమ పక్కన నిల్చును మైకెల్ క్లార్క్ విజయం అందుకున్నాడు. 2016 టి20 ప్రపంచకప్ ఫైనల్లో వెస్టిండీస్, ఇంగ్లండ్ తలపడ్డాయి. ట్రోఫీకి ఎడమ పక్కన నిల్చున్న డారెన్ సామి టైటిల్ అందుకున్నాడు. 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పాకిస్తాన్, టీమిండియా మధ్య జరిగింది. ట్రోఫీకి ఎడమపక్కన నిల్చున్న సర్ఫరాజ్ అహ్మద్ విజేతగా నిలిచాడు.
ఇదీ చదవండి: బాడీలో ఆ పార్ట్ కు 13 కోట్ల బీమా.. అదే ఇంత గుర్తింపు తెచ్చిందన్నమోడల్
2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ సందర్భంగా ట్రోఫీకి ఎడమ పక్కన నిల్చున్న ఇయాన్ మోర్గాన్‌ను విజయం వరించింది. 2021లో తొలిసారి నిర్వహించిన ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ట్రోఫీకి ఎడమ పక్కన నిల్చున్న కేన్ విలియమ్సన్ విజయం సాధించాడు. తాజాగా ఈ టీ 20 వరల్డ్ కప్ లో ఆసీస్ కెప్టెన్ కూడా ఎడవైపు నిలబడ్డాడు. దీంతో అప్పుడే నెటిజన్లు ఫిక్స్ అయ్యారు ఆసీస్ దే ట్రోఫీ అని అదే నిజమైంది..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, Cricket, Newzealand, Sports, T20 World Cup 2021