• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • T20 WORLD CUP WILL BE HELD IN INDIA BCCI TO DISCUSS ISSUE IN SGM 9 CITIES TO HOST MEGA EVENT JNK

ICC T20WC : ఇండియాలోనే టీ20 వరల్డ్ కప్.. 9 వేదికలు సిద్దం.. 29న బీసీసీఐ ప్రత్యేక సమావేశం..

ఇండియాలోనే టీ20 వరల్డ్ కప్ ? (PC: BCCI)

కరోనా నేపథ్యంలో ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ ఇండియాలోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నది. ఇప్పటికే 9 వేదికలను ఎంపిక చేసిన బీసీసీఐ.. సాధ్యాసాధ్యాలపై ఈ నెల 29న జరుగబోయే ఎస్జీఎంలో చర్చించనున్నది.

  • Share this:
    ఇండియాలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఐపీఎల్ 2021ని (IPL 2021) అర్దాంతరంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో జరగాల్సిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ పై (ICC T20 World cup) కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. కరోనా తీవ్రంగా ఉంటే ఇండియాలో మెగా టోర్నీ నిర్వహించడం కష్టం కావడంతో ఐసీసీ (ICC) కూడా పునరాలోచనలో పడింది. ఒకవేళ ఇండియాలో టీ20 ప్రపంచ కప్ నిర్వహించడం సాధ్యం కాకుంతే తమ వద్ద ప్లాన్ బి కూడా ఉందని ఐసీసీ గతంలోనే చెప్పింది. బీసీసీఐ కూడా టీ20 వరల్డ్ కప్ అవసరం అయితే యూఏఈలో నిర్వహిస్తామని వెల్లడించింది. అయితే ఇప్పుడు బీసీసీఐ తమ నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తున్నది. షెడ్యూల్ ప్రకారం ఇండియాలోనే టీ20 వరల్డ్ కప్ నిర్వహించాలని భావిస్తున్నది. ఇందు కోసం ఈ నెల 29న ప్రత్యేక సాధారణ సమావేశం (ఎస్జీఎం) (Special General Meeting) బీసీసీఐ నిర్వహిస్తున్నది. జూన్ 1న ఐసీసీ సమావేశం ఉండటంతో అంతకు ముందుగానే బీసీసీఐ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. 'ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్‌ ఇండియాలోనే షెడ్యూల్ ప్రకారం నిర్వహించడమే ముఖ్య అజెండాగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు' అని బీసీసీఐ వర్గాలు తెలిపినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    ఐసీసీ టీ30 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ తొమ్మది వేదికలను ఎన్నుకున్నది. అహ్మదాబాద్, ముంబై, కోల్‌కతా, న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ధర్మశాల, లక్నో వేదికల్లో వరల్డ్ కప్ నిర్వహించనున్నది. ప్రస్తుతం దేశంలో కోవిడ్ 19 పరిస్థితి ఎలా ఉన్నది? అక్టోబర్ కల్లా పరిస్థితుల్లో ఏమైనా మార్పులు వస్తాయా అనే విషయాలను ప్రత్యేక సాధారణ సమావేశంలో బీసీసీఐ సభ్యులు చర్చించనున్నారు. అంతే కాకుండా ఎంపిక చేసిన వేదికల్లో బయోబబుల్ ఏర్పాట్లు.. హోటల్స్ లభ్యత.. లాజిస్టిక్స్‌కు సంబంధించిన విషయాలు కూడా చర్చించనున్నట్లు తెలుస్తున్నది. గతంలో జరిగిన అపెక్స్ కమిటీ సమావేశంలో తెలిపిన విధంగానే ఆయా రాష్ట్రాల అసోసియేషన్లు టీ20 వరల్డ్ కప్ కోసం సిద్దపడాలని సమాచారం అందించినట్లు తెలుస్తున్నది.

    మరో వైపు భారత పురుషుల, మహిళల జట్లు భవిష్యత్ పర్యటనలు, ఐసీసీ ఎఫ్‌టీపీ, ఐసీసీ ఈవెంట్లు, ఇతర బిజినెస్ వ్యవహారాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా మహిళల క్రికెట్‌లో టెస్టుల సంఖ్యను పెంచడంతో పాటు జట్టులో ఇటీవల రాజకీయ విషయాలపై కూడా సమావేశం చర్చించనున్నట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. వర్చువల్ విధానంలో జరిగే ఈ సమావేశంలో అపెక్స్ కమిటీ సభ్యులతో పాటు రాష్ట్రాల అసోసియేషన్ల ప్రతినిధులు కూడా హాజరవనున్నారు.
    Published by:John Naveen Kora
    First published: