Home /News /sports /

T20 WORLD CUP UPDATE WEST INDIES LOSS BY 20 RUNS THEY MISS SEMI FINAL CHANCE NGS

T20 World Cup 2021 : హెట్‌మైర్‌ పోరాటం వృథా.. 20 రన్స్ తేడాతో విండీస్ పై లంక గెలుపు.. రెండు జట్లు అవుట్

సెమీస్ అవకాశాలు మిస్ చేసుకున్న విండీస్

సెమీస్ అవకాశాలు మిస్ చేసుకున్న విండీస్

T20 World Cup 2021: డూ ఆర్ డై తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో విండీస్ ఓడింది. టోర్నీలో ముందుకు వెళ్లాలి అంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో పోరాడి ఓడింది. హెట్ మైర్ చేసిన ఒంటరి పోరాటం వృథా అయ్యింది. ఇప్పటికే శ్రీలంక సెమీస్ ఆశలు గల్లంతు కాగా.. ఇప్పుడు వీండీస్ కి కూడా సెమీస్ దారులు మూసుకుపోయాయి..

ఇంకా చదవండి ...
    Sri Lanka won by west indies: టీ 20 వరల్డ్ కప్ (T20 world cupa) పై భారీగా ఆశలు పెట్టుకున్న జట్టు అన్నీ ఒక్కొక్కటిగా తేలిపోతున్నాయి. ముఖ్యంగా టీ 20 స్పెషలలిస్టులుగా చెప్పుకునే వెస్టిండీస్ (west indies) కథ కూడా ముగిసినట్టే.. టోర్నీలో ముందుకు వెళ్లాలి అంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ ఓడి.. ట్రోఫీ ఆశలు చేజార్చుకుంది. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా వెస్టిండీస్, శ్రీలంక (Sri Lanka)తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ పై శ్రీలంక 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన భారీ టార్గెట్ ను విండీస్ చేజ్ చేయలేకపోయింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో నికోలస్ వూరన్ (Nicholas Pooran) 46 పరుగులు చేయగా, హెట్ మెయిర్ (Shimron Hetmyer) వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 54 బంతుల్లో 81 పరుగులతో నాటౌట్ గా నిలిచిన జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. కానీ అతడికి మిగిలిన బ్యాట్స్ మెన్ నుంచి సరైన సహకారం లేకపోవడంతో విండీస్ కు ఓటమి తప్పలేదు. ఇక లంక బౌలర్లలో ఫెర్నాండో, చమిక కరుణరత్నే, హసరంగ తలో రెండు వికెట్లు తీశారు. చమీరా, శనక చెరో వికెట్ తీశారు. శ్రీలంక ఈ మ్యాచ్ లో గెలవడమే కాదు.. తమతో పాటు విండీస్ ను కూడా టోర్నీపై ఆశలు వదులుకునేలా చేసింది..

    టీ20 వరల్డ్ కప్ సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ కు ఆ నిర్ణయం బెడిసికొట్టింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక… భారీ స్కోరు నమోదు చేసింది. టాపార్డర్ వీరవిహారం చేసిన ఈ మ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 189 పరుగులు సాధించింది.

    ఇదీ చదవండి : సీనియర్ మంత్రి సుబ్రతా ముఖర్జీ ఇక లేరు.. అనారోగ్యంతో ఆస్పత్రిలో కన్నుమూత

    అసలంక 41 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ తో 68 పరుగులు చేయగా… ఓపెనర్ పత్తుమ్ నిస్సాంక 41 బంతుల్లో 5 ఫోర్లతో 51 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ కుశాల్ పెరెరా 29, కెప్టెన్ దసున్ షనక 14 బంతుల్లో 25 పరుగులు చేశారు. ఇక లక్ష్యఛేదనలో వెస్టిండీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలింది. ఆ జట్టు 10 పరుగులకే ఓపెనర్ల వికెట్లు చేజార్చుకుంది. లంక బౌలర్ బినుర ఫెర్నాండో అద్భుతమైన స్పెల్ తో క్రిస్ గేల్ (1), ఎవిన్ లూయిస్ (8)లను పెవిలియన్ కు పంపాడు. ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన శ్రీలంక ఈ మ్యాచ్ లో గెలిచి వెస్టిండీస్ సెమీస్ అవకాశాలను పూర్తిగా దెబ్బతీసింది.

    ఇదీ చదవండి : కార్తీక మాసంలో వన భోజనాలు ఎందుకు..? ఉసిరి చెట్టుకింద భోజనం విశిష్టత ఏంటి..?

    గ్రూపు ఏ నుంచి ఇప్పటికే ఇంగ్లండ్ సెమీ ఫైనల్ కు చేరింది. ఆడిన నాలుగు మ్యాచుల్లో నెగ్గి 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి సెమీస్ కు అర్హత సాధించింది. ఇక దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలో ఒక్కో ఓటమితో ఆరు పాయింట్లు సాధించి రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇంక ఆస్ట్రేలియా విండీస్ తో.. దక్షిణాప్రికా ఇంగ్లండ్ తో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఆయా మ్యాచ్ లో గెలిచిన జట్టుకు సెమీ ఫైనల్ చేరుకునే అవకాశం ఉంది. రెండు జట్లు నెగ్గినా.. ఓడినా నెట్ రన్ రేట్ కీలకం అవుతుంది. ఒక జట్టు ఓడి.. ఓ జట్టు గెలిస్తే ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా నెగ్గిన జట్టు నేరుగా సెమీస్ కు అర్హత సాధిస్తుంది.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Cricket, Sports, Srilanka, T20 World Cup 2021, West Indies

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు