హోమ్ /వార్తలు /క్రీడలు /

T20 World Cup 2022 : గ్రూప్ ‘ఎ’లో డిసైడర్ మ్యాచ్ లు.. శ్రీలంక సూపర్ 12కు చేరే మార్గాలు ఇవే..

T20 World Cup 2022 : గ్రూప్ ‘ఎ’లో డిసైడర్ మ్యాచ్ లు.. శ్రీలంక సూపర్ 12కు చేరే మార్గాలు ఇవే..

PC : TWITTER

PC : TWITTER

T20 World Cup 2022 : టి20 ప్రపంచకప్ (T20 World Cup 2022) గ్రూప్ దశ మ్యాచ్ లు అంతిమ ఘట్టానికి చేరుకున్నాడు.  అక్టోబర్ 16న ఆరంభమైన ఈ మ్యాచ్ లు శుక్రవారంతో ముగుస్తాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

T20 World Cup 2022 : టి20 ప్రపంచకప్ (T20 World Cup 2022) గ్రూప్ దశ మ్యాచ్ లు అంతిమ ఘట్టానికి చేరుకున్నాడు.  అక్టోబర్ 16న ఆరంభమైన ఈ మ్యాచ్ లు శుక్రవారంతో ముగుస్తాయి. గురువారం గ్రూప్ ‘ఎ’లో ఆఖరి మ్యాచ్ లు జరగనున్నాయి. సూపర్ 12 దశ కోసం గ్రూప్ ‘ఎ‘ నుంచి యూఏఈ (UAE) మినహా మిగిలిన మూడు జట్లు కూడా పోటీ పడుతున్నాయి. ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ నెగ్గిన నెదర్లాండ్స్ (Netherlands) 4 పాయింట్లతో గ్రూప్ టాపర్ గా ఉంది. ఒక దాంట్లో గెలిచి మరో దాంట్లో ఓడిన నమీబియా (Namibia) 2 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నమీబియా చేతిలో ఓడి ఆ తర్వాత యూఏఈపై నెగ్గిన శ్రీలంక (Sri Lanka) 2 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిన యూఏఈ ఖాతా తెరవకుండా ఆఖరి స్థానంలో ఉంది.

శ్రీలంకకు చావో రేవో

భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 9.30 గంటలకు జరిగే తొలి పోరులో నెదర్లాండ్స్ తో శ్రీలంక తలపడనుంది. ఆసియా చాంపియన్ గా టోర్నీలో అడుగుపెట్టిన శ్రీలంకకు నమీబియా చేతిలో ఆరంభ పోరులో ఊహించని ఓటమి షాక్ తగిలింది. అయితే అనంతరం పుంజుకున్న శ్రీలంక యూఏఈపై నెగ్గి సూపర్ 12 రేసులోకి వచ్చింది. నెదర్లాండ్స్ తో జరిగే పోరులో శ్రీలంక విజయం సాధిస్తే ఇతర మ్యాచ్ లతో సంబంధం లేకుండా నేరుగా సూపర్ 12కు చేరుకుంటుంది. అదే సమయంలో నెదర్లాండ్స్ నెగ్గితే కూడా నేరుగా సూపర్ 12కు చేరుకుంటుంది. ఇక తర్వాత జరిగే పోరులో నమీబియా గెలిస్తే సూపర్ 12కు చేరుకుంటుంది. ఒక వేళ నెదర్లాండ్స్ పై శ్రీలంక నెగ్గి.. యూఏఈపై నమీబియా నెగ్గితే అప్పుడు నమీబియా గ్రూప్ టాపర్ గా.. శ్రీలంక రన్నరప్ గా సూపర్ 12కు చేరుకుంటుంది. నెదర్లాండ్స్ కు 4 పాయింట్లు ఉన్నా నెట్ రన్ రేట్ విషయంలో నమీబియా, శ్రీలంక జట్ల కంటే కూడా తక్కువగా ఉంది.

శ్రీలంక సూపర్ 12కు వెళ్లాలంటే

నెదర్లాండ్స్ పై తప్పకుండా నెగ్గాల్సి ఉంది. ఓడితే మాత్రం దాదాపుగా టోర్నీ నుంచి శ్రీలంక తప్పుకుంటుంది. అయితే శ్రీలంక ఓడినా.. నమీబియాపై యూఏఈ భారీ తేడాతో నెగ్గితే అప్పుడు సూపర్ 12కు చేరేందుకు లంకేయులకు ఛాన్స్ ఉంటుంది.

నెదర్లాండ్స్ చేరాలంటే

ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ నెగ్గిన నెదర్లాండ్స్ సూపర్ 12కు చేరాలంటే శ్రీలంకపై తప్పకుండా నెగ్గాల్సి ఉంది. ఒక వేళ ఓడితే మాత్రం అప్పుడు నమీబియా, యూఏఈ జట్ల ఫలితంపై ఆధారపడాల్సి వస్తుంది. నెదర్లాండ్స్ నెట్ రన్ రేట్ నమీబియా, శ్రీలంక జట్ల కంటే తక్కువగా ఉంది. ఈ క్రమంలో నెదర్లాండ్స్ చేరాలంటే మాత్రం శ్రీలంకను ఓడించక తప్పదు. ఒక వేళ ఓడితే మాత్రం.. యూఏఈ చేతిలో నమీబియా ఓడాల్సి ఉంటుంది.

నమీబియా చేరాలంటే

నమీబియా సూపర్ 12కు చేరాలంటే ఉన్న ఏకైక దారి యూఏఈపై నెగ్గడం. యూఏఈపై పరుగు తేడాతో నెగ్గినా కూడా నమీబియా సూపర్ 12కు చేరుకుంటుంది. ఒక వేళ నమీబియా యూఏఈ చేతిలో ఓడితే అప్పుడు నెదర్లాండ్స్ శ్రీలంకపై నెగ్గాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో నెదర్లాండ్స్ తో పాటు నమీబియా సూపర్ 12కు చేరుకుంటుంది. నమీబియా నెట్ రన్ రేట్ శ్రీలంక కంటే కూడా ఎక్కువగా ఉంది. నమీబియా, యూఏఈ మధ్య జరిగే పోరు భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభం కానుంది.

First published:

Tags: IND vs PAK, India VS Pakistan, Netherlands, Sri Lanka, T20 World Cup 2022, Team India, UAE

ఉత్తమ కథలు