Srilanka Vs Bangladesh: అదరగొట్టిన శ్రీలంక.. చితక్కొట్టిన అసలంక, రాజపక్స.. బంగ్లాదేశ్‌పై లంకేయుల విజయం

బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో శ్రీలంక విజయం (PC: ICC)

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 172 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో మధ్యలోతడబడినా.. అసలంక, రాజపక్స అద్భుత హాఫ్ సెంచరీలతో మ్యాచ్‌ను గెలిపించారు.

  • Share this:
    ఐసీసీ (ICC) టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) సూపర్ 12 రౌండ్ (Super 12) మ్యాచ్‌లో శ్రీలంక (Srilanka) అద్బుత విజయం సాధించింది. క్వాలిఫయర్ రౌండ్‌లో వరుస విజయాలు సాధించి మంచి ఊపు మీద ఉన్న శ్రీలంక.. అదే జోరును కొనసాగించి బంగ్లాదేశ్‌పై (Bangladesh) 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. మొహమ్మద్ నయీం (62), ముష్ఫికర్ రహీం (57) అర్ద సెంచరీలతో మెరవడంతో శ్రీలంక ఎదుట బంగ్లాదేశ్ భారీ లక్ష్యాన్ని ఉంచింది. 172 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంకకు తొలి ఓవర్‌లోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ కుషాల్ పెరీర (1) నాసుమ్ అహ్మద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయి పెవీలియన్ చేరాడు. మరో ఓపెనర్ పాథుమ్ నిస్సాంక, చరిత్ అసలంక కలసి శ్రీలంక ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ కలసి బంగ్లా బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కున్నారు. ముఖ్యంగా అసలంక బౌండరీలు, సిక్సులతో విరుచుకపడ్డాడు.

    అసలంక, నిస్సాంక కలసి రెండో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. అయితే 9వ ఓవర్ వేసిన షకీబుల్ హసన్ రెండు వికెట్లు తీసి శ్రీలంకను ఎదురు దెబ్బ తీశాడు. ఓపెనర్ పాథుమ్ నిస్సాంక (24) షకీబుల్ హసన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అదే ఓవర్ 4వ బంతికి అవిష్క ఫెర్నాండో (0) కూడా బౌల్డ్ అయి వెనుదిరిగాడు. దీంతో శ్రీలంక బ్యాటర్లపై ఒత్తిడి పెరిగిపోయింది. ఈ క్రమంలో వానిందు హసరంగ (6) మహ్మద్ సైఫుద్దీన్ బౌలింగ్‌లో మొహమ్మద్ నయీంకు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు తీసి మ్యాచ్‌ను బంగ్లాదేశ్ తమవైపు తిప్పుకున్నది. అయితే చరిత్ అసలంక మాత్రం వికెట్లు పడుతున్నా తన దూకుడు కొనసాగించాడు. అతడికి భానుక రాజపక్స తోడయ్యాడు. వీరిద్దరూ ధాటిగా ఆడుతూ పరుగుల వేగం పెంచారు. ఈ క్రమంలో ఇద్దరు కూడా అర్దసెంచరీలు పూర్తి చేసుకున్నాడు.

    Ind Vs Pak : ఈ పాకిస్థాన్ క్రికెటర్ భార్య విరాట్ కోహ్లీకి డైహార్డ్ ఫ్యాన్..! ఆమెకు భారత్ తో లింకులు..!








    ఆఖర్లో భానుక రాజపక్స (53) నాసుమ్ అహ్మద్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి వెనుదిరిగాడు. కానీ చరిత్ అసలంక ఏ మాత్రం ఒత్తిడికి గురి కాకుండా మ్యాచ్‌ను పూర్తి చేశాడు. శ్రీలంక 18.5 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 172 పరుగులు చేసింది. దీంతో శ్రీలంక 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చరిత్ అసలంకకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
    Published by:John Naveen Kora
    First published: