Home /News /sports /

T20 WORLD CUP SOUTH AFRICA WON THE TOSS AND ELECTED TO BOWL FIRST HERE IS PLAYING XI OF WEST INDIES AND SOUTH AFRICA JNK

T20 World Cup: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా.. చావో రేవో మ్యాచ్‌లో వెస్టిండీస్ - దక్షిణాఫ్రికా ఢీ

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా.. వెస్టిండీస్ బ్యాటర్లు రాణించేనా?

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా.. వెస్టిండీస్ బ్యాటర్లు రాణించేనా?

T20 World Cup: గ్రూప్ 2లో తమ తొలి మ్యాచ్‌లలో ఓడిన దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు చావో రేవో మ్యాచ్‌లో తలపడనున్నాయి. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే తప్పకుండా ఈ మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది.

    ఐసీసీ (ICC) పురుషుల టీ20 వరల్డ్ కప్‌ (T20 World Cup) సూపర్ 12లో (Super 12) భాగంగా మంగళవారం మధ్యాహ్నం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికా (South Africa), వెస్టిండీస్ (West Indies) మధ్య మ్యాచ్ జరుగుతున్నది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా బౌలింగ్ చేయడానికి నిర్ణయించుకున్నది. దుబాయ్‌ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. అయితే ఇది మధ్యాహ్నం మ్యాచ్ కావడంతో మంచు ప్రభావం ఉండదనే ఆలోచనతోనే బవుమా బౌలింగ్ చేయడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. బౌలింగ్ చేయడం ద్వారా ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేసి ఛేదించాలని భావిస్తున్నట్లు బవుమా అన్నాడు. గ్రూప్ 1లో ఉన్న సౌతాఫ్రికా జట్టు తొలి మ్యాచ్ ఓడిపోయింది. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే తప్పకుండా మిగతా మ్యాచ్‌లలో సత్తా చాటాల్సి ఉన్నది.

    ఇక డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఘోర ఓటమిని మూటగట్టుకున్నది. మిగిలిన మ్యాచ్‌లలో గెలిస్తే కాని సెమీఫైనల్‌ బెర్త్ దొరకడం కష్టం అవుతుంది. జట్టులో టీ20 స్పెషలిస్టులు చాలా మందే ఉన్నా.. కలిసి రాణించలేకపోతున్నారు. టాస్ పెద్దగా తమపై ప్రభావం లేదని.. భారీ టార్గెట్ ఉంచుతామని కెప్టెన్ కిరాన్ పొలార్డ్ అంటున్నాడు. గత మ్యాచ్‌లో ఆడిన మెక్‌కాయ్ బదులు హేడెన్ వాల్ష్ జట్టులోకి వచ్చినట్లు పొలార్డ్ తెలిపారు.







    తుది జట్లు:

    వెస్టిండీస్: లెండిల్ సిమ్మన్స్, ఎవిన్ లూయీస్, క్రిస్ గేల్, షిమ్రోన్ హెట్‌మెయర్, నికొలస్ పూరన్ (వికెట్ కీపర్), కిరాన్ పొలార్డ్ (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, డ్వేన్ బ్రావో, అకీల్ హొస్సేన్, హేడెన్ వాల్ష్, రవి రాంపాల్

    సౌత్ ఆఫ్రికా: తెంబా బవుమా (కెప్టెన్), రీజా హెన్రిక్స్, రస్సీ వాన్ డెర్ డస్సెన్, ఏడెన్ మార్క్‌రమ్, హెన్రిక్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, డ్వేన్ ప్రెటోరిస్, కేషవ్ మహరాజ్, కగొసో రబాడ, ఎన్రిక్ నోర్జే, తబ్రిజ్ షంషీ
    Published by:John Naveen Kora
    First published:

    Tags: South Africa, T20 World Cup 2021, West Indies

    తదుపరి వార్తలు