T20 World Cup:సంపాదనలో భారత్, పాక్ క్రికెటర్ల మధ్య వ్యత్యాసం.. ఒక మ్యాచ్‌కి ఎంత ఇస్తారో తెలుసా!

India Vs Pakistan

పాక్,భారత్ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ఈ మ్యాచ్ ద్వారా ICCకి భారీగానే ఆదాయం సమకూరుతుంది. స్పాన్సర్‌ల నుండి టీవీ ప్రకటనల వరకు ధర వంద రెట్లు పెంచింది.

  • Share this:


    టీ 20 ప్రపంచకప్‌లో బిగ్ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. అక్టోబర్ 24 న భారత్, పాకిస్తాన్ జట్లు తొలి ఫైట్ సిద్దమవుతున్నాయి. దాదాపు 28 నెలల తర్వాత విరామం తర్వాత రెండు జట్లు తలపడబోతున్నాయి. 2019 ప్రపంచకప్‌లో చివరిసారిగా ఇరు జట్లు పోటిపడ్డాయి. మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ఈ మ్యాచ్ ద్వారా ICCకి భారీగానే ఆదాయం సమకూరుతుంది. స్పాన్సర్‌ల నుండి టీవీ ప్రకటనల వరకు ధర వంద రెట్లు పెంచింది. అంతేకాదు ఈ మ్యాచ్ ద్వారా ఆటగాళ్ళకు కూడా భారీగానే డబ్బు చెల్లించనున్నారు. ఇది ముఖ్యంగా పాక్ క్రికెటర్లకు బాగా లభించనుంది.





    సంక్షోభంలో పాక్ క్రికెట్ బోర్డ్.. క్రికెటర్ల తక్కువ వేతనాలు

    పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గతంలో శ్రీలంక జట్టుపై జరిగిన దాడిన దృష్టిలో పెట్టుకుని సుమారు 12 సంవత్సరాలుగా ఏ జట్టు పాక్ వెళ్ళి ఆడేందుకు సహాసం చేయడం లేదు. ఇటీవల న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్‌తో ఆడేందుకు సహాసం చేసినప్పటికి ఉగ్రవాద దాడికి భయపడి తిరిగి స్వదేశానికి వెళ్ళిపోయింది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఆశలన్ని అడియాశలయ్యాయి. పాక్ బోర్డ్ ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారుతుండడంతో ఆటగాళ్లకు కనీస వేతనాలు ఇవ్వలేని పరిస్థితి. దీంతో పాకిస్తానీ క్రికెటర్లు డబ్బు కోసం తమ క్రికెట్ బోర్డ్‌తో పదేపదే వేడుకోవలసి ఉంటుంది.

    భారత ఆటగాళ్ళ లాగే పాక్ ఆటగాళ్లకు కూడా కేంద్ర ఒప్పందాలు ఇవ్వబడ్డాయి. ఇక్కడ ఏ గ్రేడ్‌లో వచ్చే ఆటగాళ్లకు ప్రతి సంవత్సరం ఒక కోటి 20 లక్షల రూపాయలు ఇస్తారు. అంటే, వారికి భారతీయ కరెన్సీలో దాదాపు 52 లక్షల రూపాయలు లభిస్తాయి. అదే బీసీసీఐ అయితే ఏ గ్రేడ్ ప్లేయర్‌లకు ప్రతి సంవత్సరం రూ .7 కోట్లు ఇస్తుంది. ఇక మ్యాచ్ ఫీజు విషయానికి వస్తే టెస్ట్ మ్యాచ్‌కి 3.5 లక్షలు. వన్డేల్లో 2.2 లక్షల రూపాయలు మరియు టీ 20 ఆడటానికి 1 లక్ష 60 వేలు ఉంటుంది. 'సి' గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్ళకు ఇంకా తక్కువ ఫీజు పోందుతారు.
    Published by:Rekulapally Saichand
    First published: