కరోనా ఎంతటి విలయాన్ని సృష్టిస్తోందో తాజా పరిస్థితులను చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా క్రీడా రంగంపై ఈ మహమ్మారి ప్రభావం అధికంగా ఉంటుంది. కరోనా విజృంభణ కారణంగా తాజా ఐపీఎల్ 2021ను నిరవధిక వాయిదా వేసిన విషయం తెలిసిందే. అలాగే ఈ ప్రభావం టి20 ప్రపంచకప్ మీద కూడా పడింది. అక్టోబర్–నవంబర్‌లలో భారత్ వేదికగా ఈ మెగా టోర్నీకి నిర్వహాణకు సన్నహాలు జరుగుతున్న నేపథ్యంలో తాజా పరిస్థితులు ఈవెంట్‌కు ఆటంకంగా మారాయి. భారత్‌లో కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా విదేశీ క్రికెటర్లు ఇక్కడికి రావడానికి వెనుకాడవచ్చు. టి20 వరల్డ్‌కప్‌లో దాదాపు 16 జట్లు పాల్గొనే అవకాశం ఉంది. ఆటగాళ్ళు భారత్ వచ్చే విషయంలో ప్రతీ దేశం తమవారికి ఆంక్షలు పెడుతోంది. ఇప్పటికే పలు దేశాలు భారత్ విమానాలపై నిషేధం విధించాయి. టీ20 వరల్డ్ కప్‌కు ఆరు నెలల సమయం ఉండడంతో అప్పటివరకు పరిస్థితులు కుదటపడుతాయి అనుకున్నప్పటికి క్రికెటర్లలో ఆందోళన పూర్తిగా తొలగివచ్చునని బీసీసీఐ భావిస్తోంది.
ఐపీఎల్ 2021లో కూడా చాలా మంది విదేశీ క్రికెటర్లు భయందోళన మధ్యే క్రికెట్ ఆడిన విషయం తెలిసిందే. కుటుంబాలు వారి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. చివరకు బయో బబుల్‌లో ఉన్నప్పటికి క్రికెటర్స్ కరోనా సోకడంతో ఐపీఎల్ వాయిదాకు కారణమైంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే టీ20 వరల్డ్ కప్ కూడా వాయిదా పడే పరిస్థితి కనిపిస్తుంది.
2020లో ఆస్ట్రేలియా గడ్డపై టి20 ప్రపంచకప్ జరగాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో వాయిదా వేశారు. అ సమయంలో కరోనా కేసుుల వేల సంఖ్యంలో మాత్రమే ఉండేవి. ఇప్పుడు భారత్‌లో లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. దాదాపు 3 లక్షల కేసులు నమోదవుతున్న భారత్‌లో వరల్డ్‌కప్ నిర్వహించడం అసాధ్యంగానే కనిపిస్తోంది. దీంతో ఇండియాలో ప్రపంచ కప్ సాధ్యం కాకపోతే యూఏఈను ప్రత్యామ్నాయ వేదికగా ఎంచుకునే అవకాశం ఉంది. యూఏఈలో ప్రపంచ కప్ నిర్వహణ బాధ్యతలకు బీసీసీఐనే చూస్తుంది. అయితే ఈవెంట్ వచ్చే ఆదాయం కూడా బీసీసీఐకే చెందుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: T20 World Cup 2020, UAE