T20 WORLD CUP IN A MUST WIN SITUATION BANGLADESH WON THE TOSS AND ELECTED TO FIELD FIRST WET INDIES MADE 2 CHANGES JNK
T20 World Cup: వెస్టిండీస్‌తో చావో రేవో మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. తుది జట్లు ఇవే
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
T20 World Cup: టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా ఇవాళ వెస్టిండీస్ - బంగ్లాదేశ్ మధ్య కీలక మ్యాచ్ జరుగనున్నది. సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు తప్పక గెలవాల్సి ఉన్నది.
టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) గ్రూప్ 1లో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన వెస్టిండీస్ (West Indies) - బంగ్లాదేశ్ (Bangladesh) జట్లు శుక్రవారం షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా తలపడుతున్నాయి. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి. ఈ మ్యాచ్‌లో కనుక ఓడిపోతే ఆ జట్టు ఇంటి దారి పట్టాల్సిందే. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్ముదుల్లా ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. వెస్టిండీస్ జట్టులో లాంగ్ బ్యాటింగ్ ఆర్డర్ ఉన్నది. కాబట్టి వాళ్లను తక్కువ స్కోరుకే కట్టడి చేయాలని భావిస్తున్నాము. నారుల్, నాసుమ్ ఇవాళ మ్యాచ్‌లో లేరు. వారి బదులుగా సౌమ్య సర్కార్, టాస్కిన్లను తుది జట్టులోకి తీసుకున్నామని కెప్టెన్ మహ్ముదుల్లా చెప్పాడు. ఈ రోజు మాకు ఎక్కువ మంది పేసర్లు అవసరం పడుతున్నారు. వెస్టిండీస్ జట్టులో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉన్నందువల్లే నాసుమ్ను ఇవాళ ఆడించడం లేదని చెప్పాడు.
ఇక టాస్ ఓడిన వెస్టిండీస్ కెప్టెన్ కిరాన్ పొలార్డ్ (Kieron Pollard) మాట్లాడుతూ.. గత రెండు ఓటములకు ఎవరినీ బాధ్యులను చేయాలని అనుకోవడం లేదు. మేం మరింత బలంగా ఆడాల్సి ఉన్నది. మా జట్టు గత రెండు మ్యాచ్‌లలో సరిగా బ్యాటింగ్ చేయలేదు. ఇది మాకొక మంచి అవకాశం. ఈ సారి జట్టులో రెండు మార్పులు చేశాము. సిమ్మన్స్ బదులుగా రోస్టన్ ఛేజ్ జట్టులోకి వచ్చాడు. అతడికి ఇదే తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్. మరోవైపు హేడెన్ వాల్ష్ బదులుగా జేసన్ హోల్డర్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ (Chris Gayle) ఓపెనింగ్ చేయనున్నట్లు పొలార్డ్ తెలిపాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.