హోమ్ /వార్తలు /క్రీడలు /

T20 World Cup 2022 : మరో నెల రోజుల్లో క్రికెట్ మహా సంగ్రామం.. టి20 ప్రపంచకప్ జట్ల వివరాలు ఇవే

T20 World Cup 2022 : మరో నెల రోజుల్లో క్రికెట్ మహా సంగ్రామం.. టి20 ప్రపంచకప్ జట్ల వివరాలు ఇవే

PC : TWITTER

PC : TWITTER

T20 World Cup 2022 : నెల రోజుల కంటే తక్కువ వ్యవధిలో టి20 ప్రపంచకప్ (T20 World Cup) మహా సంగ్రామం ఆరంభం కానుంది. ఆస్ట్రేలియా (Australia) వేదికగా అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. సొంత గడ్డపై కంగారూ టీం డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అడుగపెడుతున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

T20 World Cup 2022 : నెల రోజుల కంటే తక్కువ వ్యవధిలో టి20 ప్రపంచకప్ (T20 World Cup) మహా సంగ్రామం ఆరంభం కానుంది. ఆస్ట్రేలియా (Australia) వేదికగా అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. సొంత గడ్డపై కంగారూ టీం డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అడుగపెడుతున్నారు. ఇక 15 ఏళ్ల తర్వాత అయినా టి20 ప్రపంచకప్ ను సొంతం చేసుకోవాలని భారత్ (India) పట్టుదలగా ఉంది. వీటితో పాటు ఇంగ్లండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లు కూడా తమ లక్ ను పరీక్షించుకోనున్నాయి. ఇప్పటికే చాలా జట్లు తమ ప్రపంచకప్ జట్లను ప్రకటించాయి. ఆ జట్ల వివరాలతో పాటు టోర్నీ ఫార్మాట్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐసీసీ నిబంధనల ప్రకారం గతేడాది నవంబర్ 10వ తేదీ నాటికి ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ 8లో ఉన్న జట్లు సూపర్ 12 దశకు నేరుగా చేరుకున్నాయి. వీటిలో భారత్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. ఇక మరో నాలుగు జట్ల కోసం గ్రూప్ దశను నిర్వహించనున్నారు. అక్టోబర్ 16 నుంచి 21 వరకు ఈ గ్రూప్ దశ జరగనుంది. గ్రూప్ ‘ఎ’లో శ్రీలంక, నమీబియా, నెదర్లాండ్స్, యూఏఈ జట్లు.. గ్రూప్ ‘బి’లో ఐర్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వే, స్కాట్లాండ్ దేశాలు ఉన్నాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2లో నిలిచిన మొత్తం నాలుగు జట్లు సూపర్ 12కు అర్హత సాధిస్తాయి. అక్కడ మరోసారి రౌండ్ రాబిన్ పద్దతిన మ్యాచ్ లు జరుగుతాయి. ప్రతి గ్రూప్ నుంచి రెండు జట్ల చొప్పున మొత్తం నాలుగు జట్లు సెమీఫైనల్ కు అర్హత సాధిస్తాయి.

జట్ల వివరాలు

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, అశ్విన్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, చహల్, దీపక్ హుడా

స్టాండ్ బై

షమీ, దీపక్ చహర్, రవి బిష్ణోయ్, శ్రేయస్ అయ్యర్

ఆస్ట్రేలియా

ఫించ్ (కెప్టెన్), వార్నర్, స్మిత్, మ్యాక్స్ వెల్, అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, ఇంగ్లిస్, మార్ష్, హేజల్ వుడ్, కేన్ రిచర్డ్ సన్, స్టార్క్, స్టొయినిస్, వేడ్, జంపా

స్టాండ్ బై

పాకిస్టాన్ టి20 ప్రపంచకప్ జట్టు : బాబర్ ఆజమ్ (కెప్టెన్), షాదబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), అసిఫ్ అలీ, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తికర్, ఖుష్దిల్, హస్నైన్, నవాజ్, రిజ్వాన్, మొహమ్మద్ వసీం జూనియర్, నసీం షా, షాహీన్ అఫ్రిది,  మసూద్, ఉస్మాన్ ఖాదిర్

స్టాండ్ బై

దహాని, ఫఖర్ జమాన్, హ్యారీస్

సౌతాఫ్రికా

తెంబా బవుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, క్లాసెన్, మార్కరమ్, మిల్లర్, స్టబ్స్, రొసౌ, నోకియా, కగిసో రబడ, షమ్సీ, ఎంగిడి, కేశవ్ మహరాజ్, పార్నెల్, ప్రిటోరియస్

స్టాండ్ బై

మార్కో యాన్సెన్, పెకుల్వాయో,  ఫోర్టున్

బంగ్లాదేశ్

షకీబుల్ హసన్ (కెప్టెన్), షబ్బీర్ రహ్మాన్, మెహదీ హసన్ మిరాజ్, అఫీఫ్, మొసదిక్, లిట్టన్ దాస్, యాసిర్ అలీ, నురుల్ హసన్, ముస్తఫిజుర్, సైఫుద్దీన్, టస్కిన్ అహ్మద్, ఎబాదత్, హసన్ మహ్ముద్, నజ్ముల్ హుస్సెన్, నసుమ్ అహ్మద్

స్టాండ్ బై

షోరిఫుల్ ఇస్లామ్, మెహదీ  హసన్, రషీద్, సౌమ్య సర్కార్

శ్రీలంక

షనక (కెప్టెన్), కుశాల్ మెండీస్, నిసాంక, అసలంక, గుణతిలక, రాజపక్స, ధనంజయ డిసిల్వా, హసరంగ, దుష్మంత చమీర, లహిరు కుమార, తీక్షణ, జెఫ్రీ, మదుశంక, మధుషాన్, కరుణ రత్నే

స్టాండ్ బై ప్లేయర్స్

దినేశ్ చండీమల్, యాషెన్ బండార, జయవిక్రమ, బినుర ఫెర్నాండో, నువనీదు ఫెర్నాండో

అఫ్గానిస్తాన్

మొహమ్మద్ నబీ (కెప్టెన్), జద్రాన్, గుర్బాజ్, ఒమర్జాయ్, రసూలి, అహ్మద్ మాలిక్, ఫరూఖీ, జజాయ్,  ఇబ్రహీం జద్రాన్. ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీన్ ఉల్ హక్, కాసీ అహ్మద్, రషీద్ ఖాన్, సఫీ, ఉస్మాన్ గనీ,

స్టాండ్ బై

అఫ్సర్ జజాయ్, అష్రఫ్, రహ్మత్ షా, గుల్బదీన్ నైబ్

ఇంగ్లండ్

బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్, స్యామ్ కరన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్ స్టోన్, డేవిడ్ మలాన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లే, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, అలెక్స్ హేల్స్

స్టాండ్ బై

లియామ్ డాసన్, రిచర్డ్ గ్లెసన్, తైమల్ మిల్స్

వెస్టిండీస్

నికోలస్ పూరన్ (కెప్టెన్), రోవ్‌ మన్ పావెల్ (వైస్ కెప్టెన్), యానిక్ కారియా, జాన్సన్ చార్లెస్, షెల్డన్ కాట్రెల్, షిమ్రాన్ హెట్ మైర్, జేసన్ హోల్డర్, అకీల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, కైల్ మేయర్స్, ఒబెడ్ మెక్‌కాయ్, రేమాన్ రీఫర్, ఓడిన్ స్మిత్

జింబాబ్వే

ఇర్విన్ (కెప్టెన్), రయాన్ బుర్ల్, రెగిస్ చకబ్వ, చతర, బ్రాడ్లీ, ల్యూక్, క్లైవ్, వెస్లీ, మసకద్జ, టోనీ, బ్లెస్సింగ్, రిచర్డ్, సికిందర్ రాజా, షుంబ, సీన్ విలియమ్స్

స్టాండ్ బై

చివాంగ, ఇన్నోసెంటి కియా, కెవిన్, మరుమాని, విక్టర్

నమీబియా

ఎరాస్మస్ (కెప్టెన్), స్మిత్, డివాన్, బార్డ్, నికోల్, జాన్, డేవిడ్ వీస్, రుబెన్, జానె గ్రీన్, బెర్నార్డ్, తంగెని, లుంగామెని, మైకెల్ వాన్, బెన్, కార్ల్, లోహాన్, ఫ్రాన్స్

నెదర్లాండ్స్

స్కాట్ (కెప్టెన్), కోలిన్, అహ్మద్, లోగాన్, టామ్ కూపర్, బ్రాండన్, టిమ్, ఫ్రెడ్, లీడె, పాల్, మెర్వె, స్టీఫెన్, తేజ నిడమనుర్, బైబుర్, మ్యాక్స్, టిమ్ ప్రింగెల్, విక్రమ్ సింగ్

యూఏఈ

రిజ్వాన్ (కెప్టెన్), అర్వింద్, చిరాగ్ సురి, వసీం, హమీద్, ఆర్యన్ లాక్రా, జవార్ పరీద్, కషీఫ్, కార్తిక్, అహ్మద్ రాజా, జహూర్ ఖాన్, జునైద్, సబీర్ అలీ, షరౌఫ్, ఆయాన్ ఖాన్

స్టాండ్ బై

సుల్తాన్ అహ్మద్, ఫహద్ నవాజ్, విష్ణు సుకుమార్, ఆధిత్య శెట్టి, సంచిత్ శర్మ

(నోట్ : న్యూజిలాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్లను ప్రకటించలేదు.)

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Hardik Pandya, ICC, India vs australia, India vs bangladesh, India VS Pakistan, India vs South Africa, Rishabh Pant, Rohit sharma, T20 World Cup 2022, Virat kohli

ఉత్తమ కథలు