Home /News /sports /

T20 WORLD CUP FINAL CONWAY RULED OUT WITH BROKEN HAND BIG SHOCK FOR NEW ZEALAND JNK

T20 World Cup: ఆస్ట్రేలియాతో ఫైనల్స్ ముందు న్యూజీలాండ్‌కు భారీ షాక్.. సెమీస్ గెలిపించిన స్టార్ ప్లేయర్ దూరం

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ముందు న్యూజీలాండ్‌కు భారీ షాక్ (PC: ICC)

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ముందు న్యూజీలాండ్‌కు భారీ షాక్ (PC: ICC)

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ మరో రెండు రోజుల్లో జరుగనున్నది. ఆస్ట్రేలియా - న్యూజీలాండ్ జట్లు ఈ మ్యాచ్‌లో తలపడనుండగా.. కివీస్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ డెవాన్ కాన్వే గాయం కారణంగా ఫైనల్‌కు దూరమయ్యాడు.

    ఐసీసీ (ICC) టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) 2021 ఫైనల్ మ్యాచ్‌లో న్యూజీలాండ్ (New Zealand) - ఆస్ట్రేలియా (Australia) ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో తలపడనున్నాయి. కీలకమైన ఈ మ్యాచ్‌కు రెండు రోజుల ముందు కివీస్ జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు సెమీఫైనల్‌లో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన బ్యాటర్ డెవాన్ కాన్వే (Devon Convey) గాయం కారణంగా అందుబాటులో లేకుండా పోయాడు. బుధవారం ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో న్యూజీలాండ్ జట్టు అద్బుత విజయం సాధించిన విషయం తెలిసిందే. 167 పరుగుల ఛేదనలో న్యూజీలాండ్ జట్టు 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన సమయంలో ఓపెనర్ డారిల్ మిచెల్ (72)కు తోడుగా డెవాన్ కాన్వే (46) అండగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే 14వ ఓవర్‌లో లియామ్ లివింగ్‌స్టన్ బౌలింగ్‌లో కాన్వే అవుటైన తర్వాత తన బ్యాటును విసిరేశాడు. ఈ క్రమంలో అతడి చేతికి తీవ్ర గాయమైంది. మ్యాచ్ అనంతరం అతడికి స్కానింగ్ పరీక్షలు నిర్వహించగా అతడి కుడి చేతిలో ఫ్రాక్చర్ వచ్చినట్లు తేలింది. దీంతో ఫైనల్ మ్యాచ్‌కు అతడు దూరమవుతున్నట్లు న్యూజీలాండ్ క్రికెట్ తెలిపింది.

    డెవాన్ కాన్వే కేవలం ఆస్ట్రేలియాతో జరిగే టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు మాత్రమే కాకుండా.. ఆ తర్వాత ఇండియాతో జరిగే సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండబోడని కివీస్ క్రికెట్ బోర్డు పేర్కొన్నది. డెవాన్ కాన్వే లేకపోవడం కివీస్ జట్టుకు పెద్దలోటని చెప్పాలి. గత కొన్నాళ్లుగా నిలకడైన క్రికెట్ ఆడుతున్న కాన్వే.. టీ20ల్లోనే కాకుండా టెస్టుల్లో కూడా అంచనాలను మించి రాణించాడు. ఈ ఏడాది ఇంగ్లాండ్ పర్యటనలో టెస్టుల్లో అరంగేట్రం చేసిన కాన్వే.. తొలి టెస్టులోనే సెంచరీ సాధించి అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఆ తర్వాత ఇండియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్‌లో కూడా చెప్పుకోదగిన స్కోర్ చేశాడు. టీ20 జట్టులో స్థానం సంపాదించాడు.

    T20 World Cup: వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌కు టీమ్ ఇండియా కంటే అతి పెద్ద అడ్డు ఆస్ట్రేలియానే.. ఎన్ని సార్లు ఓడించిందో తెలుసా?






    డెవాన్ కాన్వే వరల్డ్ కప్ ఫైనల్ నుంచి ఔట్ అవుడంపై కివీస్ కోచ్ గారీ స్టీడ్ స్పందించాడు. 'కాన్వే ఫైనల్ మ్యాచ్ ఆడలేకపోవడంపై చాలా బాధపడుతున్నాడు. కివీస్ జట్టు తరపున ఆడటం అతడికి ఎంతో గర్వకారణం. ఫైనల్‌లో తన వంతు సాయం చేయాలని కాన్వే భావించాడు. కానీ అనుకోని కారణాల వల్ల జట్టును వీడాల్సి వచ్చింది. భారత పర్యటనలో కూడా కాన్వే సేవలు అందుబాటులో ఉండవు. అవుటైన తర్వాత కాన్వే అలా చేయడం అనుకోకుండా జరిగిందే. కానీ దానికి భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందని అతడు కూడా అనుకోలేదు. అతడు త్వరలో పూర్తిగా కోలుకోవాలని జట్టంతా కోరుకుంటున్నది.' అని చెప్పుకొచ్చాడు.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: T20 World Cup 2021

    తదుపరి వార్తలు