T20 World Cup 2021 Final: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) 2021 చాంపియన్లుగా (Champions) ఆస్ట్రేలియా (Australia) నిలిచింది. వన్డే వరల్డ్ కప్‌లో 5 సార్లు చాంపియన్లుగా నిలిచి తిరుగు లేని రికార్డు కలిగిన ఆసీస్.. పొట్టి ప్రపంచ కప్ గెలవడానికి మాత్రం 14 ఏళ్ల సమయం పట్టింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా మొత్తం ఐసీసీ (ICC) కప్పుల సంఖ్య 8కి పెరిగింది. వన్డే వరల్డ్ కప్‌ను 1987, 1999, 2003, 2007, 2015లో గెలిచింది. ఇక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని 2006, 2009లో గెలవగా.. తాజాగా టీ20 వరల్డ్ కప్ తమ ఖాతాలో వేసుకుంది. కాగా ఆస్ట్రేలియా 2015 వన్డే వరల్డ్ కప్, 2009 చాంపియన్స్ ట్రోఫీ, 2021 టీ20 వరల్డ్ కప్‌ల ఫైనల్స్‌లో ప్రత్యర్థి న్యూజీలాండ్ జట్టే కావడం గమనార్హం. తాజాగా రోజు ఆస్ట్రేలియా గెలవడంతో మరికొన్ని అరుదైన రికార్డులు కూడా నమోదయ్యాయి.
ఈ వరల్డ్ కప్ లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగిన ఆసీస్ ఏకంగా కప్‌ను ఎగురేసుకుపోయింది. ఇక మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ మెరుపులతో సులువుగానే లక్ష్యం దిశగా నడిచింది. ఇక చివర్లో మ్యాక్స్‌వెల్ స్విచ్‌హిట్‌తో విన్నింగ్ షాట్ కొట్టి ఆస్ట్రేలియాను గెలిపించడం హైలెట్‌గా నిలిచింది.
ఇదీ చదవండి: వరల్డ్ కప్ విజేతగా ఆసీస్ ముందే డిసైడ్ అయ్యిందా? సోషల్ మీడియాలో ట్రోల్స్
ఫైనల్ లో ఆసీస్ ఓడినా.. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఒక అరుదైన రికార్డు సాధించాడు. కీలకమైన ఫైనల్లో హాఫ్ సెంచరీతో మెరిసిన విలియమ్సన్ టి20 ప్రపంచకప్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన రెండో కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంతకముందు శ్రీలంక కెప్టెన్‌గా కుమార సంగక్కర 2009 టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న తొలి కెప్టెన్‌గా నిలిచాడు.
ఇదీ చదవండి: బిగ్ బాస్ 5లో టాప్ 5 ఎవరు..? వారికి లైఫ్ ఇచ్చి ఇంటిని వీడిన జెస్సీ
విలియమ్సన్ మరో ఘనత కూడా అందుకున్నాడు. టి20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా విలియమ్సన్ నిలిచాడు. 33 బంతుల్లో 51 పరుగులు చేసిన కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్‌లో 2 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి.
ఇదీ చదవండి: బాడీలో ఆ పార్ట్ కు 13 కోట్ల బీమా.. అదే ఇంత గుర్తింపు తెచ్చిందన్నమోడల్
ఈ ఫైనల్ లో ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డులు క్రియేట్ చేశాడు. ఒక టి20 ప్రపంచకప్ ఎడిషన్‌లో ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే, ఈ ఫైనల్ లో ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డులు క్రియేట్ చేశాడు.
ఇదీ చదవండి: కుర్రకారుపై అమలా పాల్ అందాల దాడి.. ఎల్లోరా శిల్పం లాంటి ఫోటోలు వైరల్..
ఒక టి20 ప్రపంచకప్ ఎడిషన్‌లో ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.ఈ ప్రపంచకప్‌లో ఏడు మ్యాచ్‌ల్లో 289 పరుగులు సాధించాడు. 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ ఫీట్ ను సాధించాడు. ఇంతకముందు 2007 టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్ చేసిన 265 పరుగులే ఆ జట్టు తరపున అత్యధిక స్కోరుగా ఉంది.
ఇదీ చదవండి: ఆటోలో వెళ్తున్నారా..? అపరిచిత మహిళలు ఉంటే జాగ్రత్త
ఇక ఈ టి20 ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ గా వార్నర్ నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ లో మూడు సిక్సర్లు బాది.. షాహిద్ అఫ్రిదిని(15 సిక్సర్లు) దాటి తొలి స్థానంలో నిలిచాడు. ఈ టి20 ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ గా వార్నర్ నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ లో మూడు సిక్సర్లు బాది.. షాహిద్ అఫ్రిదిని(15 సిక్సర్లు) దాటి తొలి స్థానంలో నిలిచాడు.
ఇదీ చదవండి: కన్ను గీటి కుర్రకారుని రెచ్చగొడుతున్న కృతి శెట్టి.. ఇంత చిన్న వయసుకు అంత క్రేజా..?
ఈ మ్యాచులో కేన్ మామ కూడా కొన్ని రికార్డులు కొల్లగొట్టాడు. టి20 ప్రపంచకప్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన రెండో కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంతకముందు శ్రీలంక కెప్టెన్‌గా కుమార సంగక్కర 2009 టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న తొలి కెప్టెన్‌గా నిలిచాడు. టి20 ప్రపంచకప్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన రెండో కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు.ఇంతకముందు శ్రీలంక కెప్టెన్‌గా కుమార సంగక్కర 2009 టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న తొలి కెప్టెన్‌గా నిలిచాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, Cricket, Newzealand, T20 World Cup 2021