T20 World Cup: స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్తాన్.. తుది జట్లు ఇవే

స్కాట్లాండ్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్తాన్ (PC: ICC)

T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఇవాళ అఫ్గానిస్తాన్ - స్కాట్లాండ్ జట్లు షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా గ్రూప్ మ్యాచ్‌లో తలపడుతున్నాయి. గత రికార్డు పోలిస్తే ఆఫ్గానిస్తాన్‌దే పూర్తి ఆధిపత్యం కనిపిస్తున్నది. కానీ క్వాలిఫయర్స్‌లో మూడు మ్యాచ్‌లు గెలిచి స్కాట్లాండ్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నది.

 • Share this:
  ఐసీసీ (ICC)  పురుషుల టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) సూపర్ 12లో ఇవాళ షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా అఫ్గానిస్తాన్ (Afghanistan) - స్కాట్లాండ్ (Scotland) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ కెప్టెన్ మహ్మద్ నబీ (Mohammad Nabi) బ్యాటింగ్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఇతర టెస్టు హోదా కలిగిన జట్లతో పోలిస్తే అఫ్గానిస్తాన్ చిన్న జట్టే అయినా.. అందులో ప్రపంచ స్థాయి ఉత్తమ బౌలర్లు ఉన్నారు. ఐపీఎల్ (IPL) సహా మిగతా లీగ్స్‌లో రషీద్ ఖాన్, మహ్మద్ నబి, ముజీబుర్ రెహ్మాన్ చక్కని ప్రదర్శన చేస్తున్నారు. 'వికెట్ చాలా డ్రైగా కనపడుతున్నది. అందుకే ముందుగా బ్యాటింగ్ చేసి పరుగులు చేయాలని భావిస్తున్నాము. రాత్రి పూట మంచు ప్రభావం కనిపిస్తున్నది కాబట్టి తొలుత బ్యాటింగ్ చేయడమే ఉత్తమం.' అని అఫ్గాన్ కెప్టెన్ నబీ అన్నాడు.

  ఇక స్కాట్లాండ్ కెప్టెన్ కైల్ కోయెట్జర్ మాట్లాడుతూ.. మాకు బౌలింగ్ చేయడం సంతోషమే. టాస్ గెలిచినా మేం బౌలింగ్ తీసుకునే వాళ్లము. క్వాలిఫయర్ లెవల్‌లో అన్ని మ్యాచ్‌లు గెలిచి మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్నాము. జట్టులోని ఆటగాళ్లందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. అఫ్గానిస్తాన్‌లో మంచి బౌలర్లు ఉన్నారు. వారిని ఎదుర్కోవడం మాకు ఒక సాహసమనే చెప్పాలి. సూపర్ 12లో కూడా మంచి ప్రదర్శన చేయాలని భావిస్తున్నామని అన్నాడు.

  INDvsPAK: ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై ఇండియా ఓడిపోతుందని ముందే చెప్పిన ఎంఎస్ ధోనీ.. ఇంతకు ఏం చెప్పాడు?


  తుది జట్లు:
  అఫ్గానిస్తాన్: హజ్రతుల్లా జజాయ్, మహమ్మద్ షెహజాద్ (వికెట్ కీపర్), రహ్మతుల్లా గుర్బాజ్, అస్గర్ అఫ్గాన్, నజీబుల్లా జర్దాన్, మహమ్మద్ నబి (కెప్టెన్), గుల్బాదిన్ నయిబ్, రషీద్ ఖాన్, కరీం జనత్, నవీన్ ఉల్ హక్, ముజీబుర్ రెహ్మాన్

  స్కాట్లాండ్: జార్జ్ మున్సే, కైల్ కోయెట్జర్ (కెప్టెన్), మాథ్యూ క్రాస్ (వికెట్ కీపర్), రిచీ బెర్రింగ్టన్, కలమ్ మెక్‌లాయిడ్, మిచెల్ లీస్క్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్, జోష్ డావీ, షఫయన్ షరిఫ్, బ్రాడ్లీ వీల్
  Published by:John Naveen Kora
  First published: