Home /News /sports /

T20 World Cup: తుస్సుమనిపించిన టీ20 వరల్డ్ కప్.. ఇండియా నిష్క్రమణ తర్వాత ప్రేక్షకాదరణ కరువు

T20 World Cup: తుస్సుమనిపించిన టీ20 వరల్డ్ కప్.. ఇండియా నిష్క్రమణ తర్వాత ప్రేక్షకాదరణ కరువు

ఫ్లాప్ షోగా మారిన టీ20 వరల్డ్ కప్ (PC: BCCI)

ఫ్లాప్ షోగా మారిన టీ20 వరల్డ్ కప్ (PC: BCCI)

T20 World Cup: భారీ అంచనాలో ప్రారంభమైన టీ20 వరల్డ్ కప్ చివరకు ఒక ఫ్లాప్ షోగా ముగిసింది. టీమ్ ఇండియా వరుసగా రెండు మ్యాచ్‌లుఓడిపోవడంతో మ్యాచ్‌లకు ప్రేక్షకాదరణ కరువైంది.

  యూఏఈ వేదికగా దాదాపు నెల రోజుల పాటు జరిగిన పురుషుల టీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) ఆస్ట్రేలియా (Australia) చాంపియన్‌గా (Champion) నిలిచింది. షెడ్యూల్ ప్రకారం ఇండియాలో జరగాల్సిన ఈ మెగా టోర్నీ వేదికను కరోనా మహమ్మారి కారణంగా యూఏఈకి తరలించారు. ఈ సారి వరల్డ్ కప్ ఆతిథ్యపు హక్కులు బీసీసీఐ (BCCI) చేతిలో ఉండటంతో బోర్డు ఇష్ట ప్రకారమే వేదికను మార్చారు. ఐపీఎల్ 2021, టీ20 వరల్డ్ కప్‌ను ఒకే వేదికలో నిర్వహించడానికి బీసీసీఐ మొగ్గు చూపింది. ఐపీఎల్ వల్ల యూఏఈ పిచ్‌లు ఇండియన్ ప్లేయర్లకు అలవాటు అవుతాయని.. దాని వల్ల టీ20 వరల్డ్ కప్‌లోనూ టీమ్ ఇండియాకు అనుకూలంగా మారుతుందని భావించింది. తీరా వరల్డ్ కప్ ప్రారంభమయ్యాక పరిస్థితి అంతా తారుమారయ్యింది. టీమ్ ఇండియా అంచనాలను అందుకోకపోవడం.. మ్యాచ్‌ల ఫలితాలు ముందుగానే ఊహించేలా ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోయింది.

  యూఏఈ స్టేడియంలకు ఫ్యాన్స్ భారీగానే తరలి వచ్చినా.. టీవీల్లో మాత్రం వీక్షకుల సంఖ్య పడిపోయింది. దీంతో అటు బ్రాడ్‌కాస్టర్ కూడా నష్టపోవల్సి వచ్చింది. బీసీసీఐ, ఐసీసీ అనాలోచిత నిర్ణయం వల్లే టీ20 వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీ ఫ్లాప్ షోగా మారిపోయిందని విశ్లేషకులు సైతం విమర్శిస్తున్నారు. టీమ్ ఇండియా ఆడే మ్యాచ్‌లకు స్టేడియంలో భారీగా టికెట్లు అమ్ముడు కావడంతో పాటు టీవీల్లో కూడా మంచి రేటింగ్స్ వస్తుంటాయి. ఐసీసీ ఈవెంట్లలోనూ భారత్ మ్యాచ్‌లకే ఎక్కువ ఆదరణ ఉంటుంది. ఇక ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌కు వచ్చే స్పందన అందరికీ తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని నిర్వాహకులు ఇండియా మ్యాచ్ షెడ్యూల్ రూపొందించారు.

  IND vs NZ: వరల్డ్ కప్ ఫైనల్ ముగిసిన మూడు రోజులకే మరో టీ20 సమరం.. ఇండియా-కివీస్ మధ్య కీలక సిరీస్
  అయితే టీమ్ ఇండియా వరుసగా పాకిస్తాన్, న్యూజీలాండ్ జట్లపై ఓడిపోవడంతో సెమీఫైనల్ ఆశలకు గండిపడింది. ఇక అప్పటి నుంచి మెగా టోర్నీ చప్పగా సాగింది. ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌కు భారీ రేటింగ్స్ వచ్చాయి. హాట్‌స్టార్ వంటి ప్లాట్‌ఫామ్‌పై ఒకే సారి కోటి మందికి పైగా వీక్షించారు. సాధారణంగా 40 లక్షలు కూడా దాటని వీక్షకులు.. ఆ మ్యాచ్‌ను రెట్టింపు సంఖ్యలో చూశారు. ఇండియా ఓడిపోయిన తర్వాత మ్యాచ్‌లు చూసే వాళ్లే కరువయ్యారు. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌ సమయంలో స్టార్ స్పోర్ట్స్ 10 సెకెన్ల యాడ్‌కు రూ. 25 లక్షల వరకు వసూలు చేసింది. ఈ రెండు జట్లు ఫైనల్‌కు వెళ్లుంటే ఆ ధర రూ. 35 లక్షల వరకు పెరిగేది. కానీ టీమ్ ఇండియా పరాజయాలతో స్టార్ అంచనా వేసిన ఆదాయం కూడా రాలేదు. మొత్తం టోర్నీ ద్వారా రూ. 900 కోట్ల నుంచి రూ. 1200 కోట్ల వరకు ఆదాయం వస్తుందని భావించినా.. 15 శాతం కోల్పోయినట్లు మీడియా విశ్లేషకుడు మదన్ మహాపాత్ర అంచనా వేశాడు.

  యూఏఈ పిచ్‌లు కూడా మ్యాచ్‌లు ఆసక్తి కరంగా లేకుండా మార్చేశాయి. అక్కడ ఛేజింగ్ చేసిన జట్లకే అన్ని పిచ్‌లు అనుకూలంగా మారాయి. ముఖ్యంగా రాత్రి పూట మ్యాచ్‌లకు టాస్ కీలకం అయ్యింది. టాస్ గెలిచిన జట్టు మ్యాచ్ గెలిచింది. ప్రేక్షకులు కూడా టాస్ గెలవగానే ఈ జట్టు గెలుస్తుందని డిసైడ్ అయిపోయారు. టీమ్ ఇండియా అయితే పాకిస్తాన్, న్యూజీలాండ్‌ మీద టాస్ ఓడిపోయి మ్యాచ్‌లు కూడా పోగొట్టుకున్నది. సూపర్ 12 దశలో మొత్తం 23 మ్యాచ్‌లు జరిగితే 18 సార్లు ఛేజింగ్ గెలిచిన జట్లే విజయాలు సాధించాయి. బలమైన పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు సెమీస్‌లో టాస్ ఓడిపోవడంతో తొలుత బ్యాటింగ్ చేసి ఓడిపోయాయి.

  Maxwell-Vini Raman: గ్లెన్ మ్యాక్స్‌వెల్ పెళ్లి చేసుకోబోతున్న వినీ రామన్ ఎవరు? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి


  ఫైనల్‌లో కూడా అదే పరిస్థితి ఎదురైంది. రాత్రి పూట దుబాయ్ స్టేడియంలో మంచు ప్రభావం కారణంగా ఛేజింగ్ చేసే జట్టుకు అనుకూలంగా మారిపోతున్నాయి. భారీ లక్ష్యాలను కూడా అలవోకగా ఛేదించేశారు. రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లలో టార్గెట్ 19 ఓవర్లలోనే ఛేదించగా... ఫైనల్‌లోఅయితే 18.5 ఓవర్లలోనే టార్గెట్ రీచ్ అయ్యారు. దీంతో టాస్ ఓడిపోతే మ్యాచ్ ఓడిపోతామని ఆయా జట్లు కూడా మానసికంగా సిద్దమై పోయాయి. ఏదేమైనా ఈ మెగా టోర్నీ మొత్తానికి చప్పగా సాగి ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంలో విఫలమైంది.
  Published by:John Naveen Kora
  First published:

  Tags: Bcci, ICC, T20 World Cup 2021, Team india

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు