ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ 2022 (T20 World Cup 2022) టోర్నమెంట్ రసవత్తరంగా సాగుతోంది. తొలిరోజు నుంచే సంచలనాలు నమోదయ్యాయి. నమీబియా చేతిలో శ్రీలంక మట్టి దారుణ పరాజయాన్ని చవి చూసింది. ఆ తర్వాత స్కాట్లాండ్ చేతిలో రెండు సార్లు ఛాంపియన్ విండీస్ టీం ఖంగుతింది. సూపర్ -12కు క్వాలిఫై అవ్వడం కోసం ప్రతి జట్టు నువ్వా-నేనా అన్నట్టు పోరాడుతున్నాయి. సూపర్-12 దశకు చేరుకునేందుకు జట్లన్నీ చాలా కష్టపడుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం నాడు జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో జింబాబ్వేపై వెస్టిండీస్ గ్రాండ్ విక్టరీ సాధించింది. 154 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన విండీస్.. 18.2 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో.. విండీస్ 31 పరుగులతో ఘన విజయం సాధించి సూపర్-12 ఆశల్ని సజీవంగా ఉంచుకుంది.
జింబాబ్వే బ్యాటర్లలో రెగీస్ చకాబ్వా (13), టోనీ మున్యోంగా (2), సీన్ విలియమ్స్ (1), సికందర్ రజా (14), మిల్టన్ షూంబా (2), ర్యాన్ బర్ల్ (17), రిచర్డ్ ఎన్గార్వా (2), టెండాయ్ చతారా (3) ఎవరూ పెద్దగా రాణించలేదు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 4, హోల్డర్ 3 వికెట్లతో చెలరేగారు. అకీల్ హొస్సేన్, ఓబెడ్ మెకాయ్, ఒడియన్ స్మిత్ తలో వికెట్ తీసుకున్నారు.
అంతకుముందు ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కరేబీయన్ జట్టు 153 పరుగులు చేసింది. జాన్సెన్ ఛార్లెస్ (36 బంతుల్లో 45 పరుగులు ; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఇన్నింగ్స్ ఆరంభంలో అదరగొట్టగా.. ఆఖర్లో, రావెమెన్ పొవెల్ ( 21 బంతుల్లో 28 పరుగులు) అఖిల్ హెస్సేన్ ( 18 బంతుల్లో 23 పరుగులు నాటౌట్) తో మెరుపులు మెరిపించారు. దీంతో.. విండీస్ జట్టు ఫైటింగ్ టోటల్ సాధించింది. జింబాబ్వే బౌలర్లలో సికిందర్ రాజా మూడు వికెట్లతో దుమ్మురేపగా.. సీన్ విలియమ్స్, ముజార్బానీ చెరో వికెట్ తో సత్తా చాటారు.
View this post on Instagram
టీ20 వరల్డ్ కప్‌లో ప్రస్తుతం తొలి రౌండ్ పోటీలు జరుగబోతున్నాయి. ఇందులో 8 జట్లు పాల్గొంటాయి. జీలాంగ్, హోబర్ట్‌లో ఈ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. సూపర్-12లో ప్రస్తుతం 8 జట్లున్నాయి. మిగిలిన నాలుగు జట్ల కోసమే ఈ అర్హత మ్యాచ్‌లు. గ్రూప్-ఎలో నమీబియా, నెదర్లాండ్స్, శ్రీలంక, యూఏఈ ఉండగా.. గ్రూప్-బిలో స్కాట్లాండ్, ఐర్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వే పోటీపడుతున్నాయి. గ్రూప్‌లో ప్రతీ జట్టు ప్రత్యర్థులతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. రెండు గ్రూప్‌ల్లో నుంచి టాప్-2 జట్లు ఈనెల 22 నుంచి జరిగే సూపర్-12లో ప్రవేశిస్తాయి. నవంబరు 13న ఫైనల్ జరుగుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, T20 World Cup 2022, West Indies, Zimbabwe