టీ20 వరల్డ్ కప్ లో మరో పెద్ద జట్టకు భారీ షాక్ తగిలింది. నిన్న శ్రీలంక నమీబియా చేతిలో చిత్తవ్వగా.. ఇప్పుడు రెండు సార్లు ఛాంపియన్ విండీస్ స్కాట్లాండ్ చేతిలో చిత్తుగా ఓడింది. 161 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన విండీస్ 18.3 ఓవర్లలో కేవలం 118 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో.. స్కాటిష్ జట్టు 42 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. జాసన్ హోల్డర్ (33 బంతుల్లో 38 పరుగులు), కైల్ మేయర్స్ (13 బంతుల్లో 20 పరుగులు) రాణించారు. విండీస్ కెప్టెన్ పూరన్, పవర్ హిట్టర్ రావెమన్ పొవెల్ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. మిగతా బ్యాటర్లు కూడా చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. స్కాట్లాండ్ బౌలర్లలో మార్క్ వాట్ 4 ఓవర్లలో 12 పరుగులిచ్చి మూడు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించాడు. బ్లాడ్ వేల్, లీస్క్ రెండు వికెట్లతో సత్తా చాటారు.
ఇక, నిన్న గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరిగిన మెగా టోర్నీ ఆరంభ పోరులో ఆసియా చాంపియన్ (Asia Cup) శ్రీలంక (Sri Lanka)కు పసికూన నమీబియా (Namibia) భారీ షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్ లో శ్రీలంకపై నమీబియా 55 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 164 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక 19 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది.
ఇప్పుడు రెండు సార్లు ఛాంపియన్ విండీస్ కూడా చిత్తవ్వడంతో క్వాలిఫయర్ మ్యాచులు మరింత రంజుగా మారాయి. ఇక, అంతకుముందు.. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. బ్యాటింగ్ దిగిన స్కాట్లాండ్ మొదట్లో దాటిగా ఆడింది. స్కాట్లాండ్ 5.3 ఓవర్లో ఒక్క వికెటు కూడా కోల్పోకుండా 52 పరుగులు చేసింది. ఈ దశలో మ్యాచ్ కు వర్షం అంతరాయం కల్గించింది. వర్షం తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది.
What a performance ???? Scotland get their campaign underway with a commanding victory against West Indies ????#T20WorldCup | #WIvSCO | ???? https://t.co/zYWEnEHtif pic.twitter.com/rWZPmS9wyR
— T20 World Cup (@T20WorldCup) October 17, 2022
ఆ తర్వాత వెస్టిండీస్ బౌలర్లు కాస్త పుంజుకున్నారు. స్కాట్లాండ్ ఆటగాళ్లలో ఓపెనర్ జార్జ్ మున్సే 53 బంతుల్లో 9 ఫోర్లతో 66 పరుగులతో అజేయంగా నిలిచాడు. మున్సే వెస్టిండీస్ బౌలర్లను అలవోకగా ఎదుర్కోంటూ బౌండరీలు బాదాడు. కాలమ్ మాక్లియోడ్ 23, మైఖేల్ జోన్స్ 20 పరుగులు చేయగా మిగతా ఆటగాళ్లు తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, జాసన్ హోల్డర్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. ఒడియన్ స్మీత్ ఒక వికెట్ తీశాడు.
వరల్డ్ కప్ గ్రూప్ స్టేజీ మ్యాచ్‌ల్లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో టాప్ లో ఉన్న నాలుగు సూపర్ 12 దశకు అర్హత సాధిస్తాయి. గ్రూప్ స్టేజీలో శ్రీలంక, వెస్టిండీస్ ఫేవరెట్లుగా ఉన్నాయి. అయితే, చిన్న జట్లు రెచ్చిపోవడంతో ఇప్పుడు ఈ మ్యాచులు మరింత రసవత్తరంగా మారాయి. సూపర్ -12 స్టేజీకి ఏ జట్లు వెళతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Scotland, T20 World Cup 2022, West Indies