WI vs IRE : స్కాట్లాండ్ (Scotland)తో జరిగిన గ్రూప్ ‘బి’ తొలి మ్యాచ్ లో రెండు సార్లు చాంపియన్ వెస్టిండీస్ (West Indies) అనూహ్యంగా ఓడింది. అనంతరం జింబాబ్వే (Zimbabwe)తో జరిగిన పోరులో నెగ్గింది. దాంతో సూపర్ 12 ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఇక శుక్రవారం జరిగే డూ ఆర్ డై మ్యాచ్ లో ఐర్లాండ్ (Ireland)తో పోటీ పడనుంది. రెండు జట్లకు కూడా ఈ మ్యాచ్ కీలకమే. గెలిచిన జట్టు సూపర్ 12కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు మరో మాటకు తావు లేకుండా ఇంటి దారి పడుతుంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం విండీస్ ఒక మార్పు చేసింది. గాయం నుంచి కోలుకున్న బ్రాండన్ కింగ్ తుది జట్టులోకి వచ్చాడు. అతడు బ్రూక్స్ స్థానంలో జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఎటువంటి మార్పులు లేకుండానే ఐర్లాండ్ బరిలోకి దిగుతుంది.
వెస్టిండీస్ ను నిలకడలేని బ్యాటింగ్ సమస్యగా మారింది. పూరన్ తో పాటు లూయిస్, మేయర్స్, హోల్డర్ ఫామ్ లో లేరు. ముఖ్యంగా పూరన్ బౌలర్లను ఎదుర్కొవడంలో చాలా ఇబ్బందులు పడుతున్నాడు. జింబాబ్వేపై కూడా తడబడుతూ నెగ్గింది. ఇక మరోవైపు స్కాట్లాండ్ తో జరిగిన పోరులో ఓడిపోయే స్థితి నుంచి ఐర్లాండ్ గెలిచింది. కర్టీస్ సూపర్ బ్యాటింగ్ తో ఆ మ్యాచ్ లో హీరో అయ్యాడు. దాంతో ఐర్లాండ్ ఆత్మవిశ్వాసంతో ఉంది.
గ్రూప్ ‘ఎ’ నుంచి శ్రీలంకతో పాటు నెదర్లాండ్స్ సూపర్ 12కు చేరుకుంది. ఇక ఈ రోజు గ్రూప్ ‘బి’నుంచి ఏ జట్లు సూపర్ 12కు చేరుకుంటాయో తెలుస్తుంది. వెస్టిండీస్, ఐర్లాండ్, జింబాబ్వే, స్కాట్లాండ్.. ఈ నాలుగు జట్లు కూడా రెండు మ్యాచ్ లు ఆడి ఒక దాంట్లో గెలిచి మరొక దాంట్లో ఓడింది. ఇక నేడు రెండు మ్యాచ్ ల్లోనూ నెగ్గిన జట్లు సూపర్ 12కు అర్హత సాధిస్తాయి. ఒక వేళ వర్షం కారణంగా రెండు మ్యాచ్ లు రద్దయితే అప్పుడు మెరుగైన రన్ రేట్ ఉన్న జింబాబ్వే, స్కాట్లాండ్ జట్లు సూపర్ 12 కు చేరుకుంటాయి. అదే జరిగితే రెండు సార్లు చాంపియన్ వెస్టిండీస్ తో పాటు ఐర్లాండ్ కు నిరాశ తప్పదు.
తుది జట్లు
వెస్టిండీస్
కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, ఎవిన్ లూయిస్, బ్రాండన్ కింగ్, పూరన్ (కెప్టెన్), రావ్ మన్ పావెల్, హోల్డర్, అకీల్ హోసెన్, ఒడెన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, ఒబెద్ మెకాయ్
ఐర్లాండ్
ఆండీ బాల్ బ్రైన్ (కెప్టెన్), పాల్ స్టిర్లింగ్, టక్కర్, హ్యారీ టెక్టార్, కర్టీస్ క్యాంపర్, జార్డ్ డాక్ రెల్, గ్యారెల్ డెలానీ, మార్క్, సిమి సింగ్, బ్యారీ, జాష్ లిటిల్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, T20 World Cup 2022, West Indies