హోమ్ /వార్తలు /క్రీడలు /

WI vs IRE : కిందా మీదా పడుతూ ప్రత్యర్థికి టార్గెట్ సెట్ చేసిన విండీస్.. ఎంతంటే?

WI vs IRE : కిందా మీదా పడుతూ ప్రత్యర్థికి టార్గెట్ సెట్ చేసిన విండీస్.. ఎంతంటే?

PC : TWITTER

PC : TWITTER

WI vs IRE : టి20 ప్రపంచకప్ (T20 World Cup) ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో వెస్టిండీస్ (West Indies) బ్యాటర్లు కిందా మీద పడ్డారు. గ్రూప్ ‘బి’లో భాగంగా ఐర్లాండ్ (Ireland)తో జరగుతున్న పోరులో విండీస్ టాపార్డర్ మరోసారి విఫలం అయ్యింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

WI vs IRE : టి20 ప్రపంచకప్ (T20 World Cup) ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో వెస్టిండీస్ (West Indies) బ్యాటర్లు కిందా మీద పడ్డారు. గ్రూప్ ‘బి’లో భాగంగా ఐర్లాండ్ (Ireland)తో జరగుతున్న పోరులో విండీస్ టాపార్డర్ మరోసారి విఫలం అయ్యింది. బ్రాండన్ కింగ్ (48 బంతుల్లో 62 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో ఆదుకున్నాడు. చివర్లో ఒడెన్ స్మిత్ (12 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. దాంతో వెస్టిండీస్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో గ్యారెత్ గెలానీ 3 వికెట్లతో సత్తా చాటాడు. బ్యారీ మెక్ కార్తి, సిమి సింగ్ చెరో వికెట్ సాధించారు.

ఇది కూడా చదవండి : సింహాసనం కోసం కోహ్లీ, రోహిత్ మధ్య టఫ్ ఫైట్.. విజేత ఎవరో మరీ?

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ కు మరోసారి శుభారంభం దక్కలేదు. ఫామ్ లో లేని కైల్ మేయర్స్ (1) మరోసారి నిరాశ పరిచాడు. ఇక వన్ డౌన్ లో వచ్చిన ఎవిన్ లూయిస్ (13) క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడ్డాడు. జాన్సన్ చార్లెస్ (24) ఉన్నంతసేపు బాగానే ఆడినా భారీ స్కోరును చేయలేకపోయాడు. కెప్టెన్ పూరన్ (13) మరోసారి నిరాశ పరిచాడు. గత మ్యాచ్ హీరో పావెల్ (6) ఈసారి ఆ మ్యాజిక్ ను చూపించలేకపోయాడు. ఒక దశలో విండీస్ 112 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. 130 పరుగులు సాధించేలా కనిపించింది. అయితే చివర్లో కింగ్, స్మిత్ భారీ షాట్లు ఆడటంతో జట్టు స్కోరు 150కు చేరువగా వచ్చింది.

గ్రూప్ ‘ఎ’ నుంచి శ్రీలంకతో పాటు నెదర్లాండ్స్ సూపర్ 12కు చేరుకుంది. ఇక ఈ రోజు గ్రూప్ ‘బి’నుంచి ఏ జట్లు సూపర్ 12కు చేరుకుంటాయో తెలుస్తుంది. వెస్టిండీస్, ఐర్లాండ్, జింబాబ్వే, స్కాట్లాండ్.. ఈ నాలుగు జట్లు కూడా రెండు మ్యాచ్ లు ఆడి ఒక దాంట్లో గెలిచి మరొక దాంట్లో ఓడింది. ఇక నేడు రెండు మ్యాచ్ ల్లోనూ నెగ్గిన జట్లు సూపర్ 12కు అర్హత సాధిస్తాయి. ఒక వేళ వర్షం కారణంగా రెండు మ్యాచ్ లు రద్దయితే అప్పుడు మెరుగైన రన్ రేట్ ఉన్న జింబాబ్వే, స్కాట్లాండ్ జట్లు సూపర్ 12 కు చేరుకుంటాయి. అదే జరిగితే రెండు సార్లు చాంపియన్ వెస్టిండీస్ తో పాటు ఐర్లాండ్ కు నిరాశ తప్పదు.

తుది జట్లు

వెస్టిండీస్

కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, ఎవిన్ లూయిస్, బ్రాండన్ కింగ్, పూరన్ (కెప్టెన్), రావ్ మన్ పావెల్, హోల్డర్, అకీల్ హోసెన్, ఒడెన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, ఒబెద్ మెకాయ్

ఐర్లాండ్

ఆండీ బాల్ బ్రైన్ (కెప్టెన్), పాల్ స్టిర్లింగ్, టక్కర్, హ్యారీ టెక్టార్, కర్టీస్ క్యాంపర్, జార్డ్ డాక్ రెల్, గ్యారెల్ డెలానీ, మార్క్, సిమి సింగ్, బ్యారీ, జాష్ లిటిల్

First published:

Tags: Australia, T20 World Cup 2022, West Indies

ఉత్తమ కథలు