ఆస్ట్రేలియావేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2022) క్వాలిఫయర్ మ్యాచులు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా గ్రూప్ -ఏలోని జట్లు నువ్వా-నేనా అన్నట్టు తలపడతున్నాయి. ఇక, క్వాలిఫయర్స్ లో పెద్ద జట్లకు షాకిస్తున్నాయి చిన్న టీమ్స్. ఇక, లేటెస్ట్ గా జీలాంగ్ వేదికగా శ్రీలంక- యూఏఈ (SL vs UAE) మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఆసియా కప్ విజేతకు చుక్కలు చూపించాడు యూఏఈ బౌలర్. యూఏఈ బౌలర్ కార్తీక్ మెయ్యప్పన్ హ్యాట్రిక్ తీసి సంచలనం సృష్టించాడు. శ్రీలంక మొదట బ్యాటింగ్ చేయగా.. 15వ ఓవర్ లో కార్తీక్ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. ఆ ఓవర్ లో 4,5,6 బంతుల్లో వరుసగా భానుక రాజపక్స, చరిత్ అసలంక, దసున్ షనక వికెట్లు తీసి ఈ వరల్డ్ కప్ లో తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఇక, కార్తీక్ మొత్తం 4 ఓవర్లలో 19 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
ఇక, యూఏఈ బౌలర్ల దెబ్బకి శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. పాతుమ్ నిశ్శంక (60 బంతుల్లో 74 పరుగులు ; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడి తన జట్టుకు ఫైటింగ్ టోటల్ అందించాడు. ధనంజయ డిసిల్వా 21 బంతుల్లో 33 పరుగులతో ఆకట్టుకున్నాడు. మిగతా శ్రీలంక బ్యాటర్లు తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. కార్తీక్ మూడు వికెట్లు తీయగా, జహుర్ ఖాన్ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు.
ఈ ప్రపంచకప్‌లో ఇదే తొలి హ్యాట్రిక్. అదే సమయంలో, ఓవరాల్ టీ20 ప్రపంచకప్‌లో ఇది ఐదో హ్యాట్రిక్‌గా నిలిచింది. కార్తీక్ కన్నా ముందు బ్రెట్ లీ, కర్టిస్ కాంప్ఫెర్, హసరంగా, కగిసో రబాడాలు హ్యాట్రిక్ సాధించారు. ఇక, శ్రీలంక ఓ దశలో భారీ స్కోరు చేసే దిశగా సాగింది. అయితే, మెయ్యప్పన్ దెబ్బకి తక్కువ స్కోరుకే పరిమితమైంది. శ్రీలంక ఇప్పటికే ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచులో నమీబియా చేతిలో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే.
View this post on Instagram
HAT-TRICK ALERT ???? Karthik Meiyappan has picked up the first hat-trick of #T20WorldCup 2022 ???? ???? Scorecard: https://t.co/fIoUF5AvN4 Head to our app and website to follow the action ???? https://t.co/76r3b7l2N0 pic.twitter.com/gjSIhsr9rD
— ICC (@ICC) October 18, 2022
టీ20 వరల్డ్ కప్‌లో ప్రస్తుతం తొలి రౌండ్ పోటీలు జరుగబోతున్నాయి. ఇందులో 8 జట్లు పాల్గొంటాయి. జీలాంగ్, హోబర్ట్‌లో ఈ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. సూపర్-12లో ప్రస్తుతం 8 జట్లున్నాయి. మిగిలిన నాలుగు జట్ల కోసమే ఈ అర్హత మ్యాచ్‌లు. గ్రూప్-ఎలో నమీబియా, నెదర్లాండ్స్, శ్రీలంక, యూఏఈ ఉండగా.. గ్రూప్-బిలో స్కాట్లాండ్, ఐర్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వే పోటీపడుతున్నాయి. గ్రూప్‌లో ప్రతీ జట్టు ప్రత్యర్థులతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. రెండు గ్రూప్‌ల్లో నుంచి టాప్-2 జట్లు ఈనెల 22 నుంచి జరిగే సూపర్-12లో ప్రవేశిస్తాయి. నవంబరు 13న ఫైనల్ జరుగుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Sri Lanka, T20 World Cup 2022, UAE