టీ-20 వరల్డ్ కప్ 2021 (T20 World Cup 2021) లీగ్ స్టేజీ ఆఖరి అంకానికి చేరుకుంది. దాదాపు సెమీస్ కు చేరే జట్టు ఖాయమయ్యాయ్. ఇక, అందరి దృష్టి వచ్చే ఏడాది మెగా టోర్నీపైన పడింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా (Australia)లో జరిగే టీ-20 వరల్డ్ కప్ 2022 (T20 World Cup 2022) సూపర్-12 స్టేజ్ కోసం ఎనిమిది జట్లు ఎంపిక చేయబడ్డాయ్. గ్రూప్ -1 లో భాగంగా ఆస్ట్రేలియాతో విండీస్ ఓడిపోయిన తర్వాత ఈ జట్లపై క్లారిటీ వచ్చింది. టీ20 ప్రపంచకప్ 2022లో వెస్టిండీస్, శ్రీలంక క్వాలిఫైయింగ్ రౌండ్‌లో పోటీపడాల్సి ఉంది. వెస్టిండీస్, శ్రీలంకతో సహా నమీబియా, స్కాట్లాండ్ జట్లు కూడా వచ్చే ఏడాది టోర్నీని క్వాలిఫయింగ్ రౌండ్ నుంచి ప్రారంభించనున్నాయి. ఆస్ట్రేలియా మెగాటోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది కాబట్టి.. ఆ జట్టు నేరుగా క్వాలిఫై అయింది.
ఇక బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్ సూపర్ 12లలోకి నేరుగా ప్రవేశించనున్నాయి. సాధారణంగా టీ20 ప్రపంచకప్ 2021లో విన్నర్, రన్నరప్‌గా నిలిచిన రెండు టీమ్‌లతో పాటు ఐసీసీ టీ20 ర్యాక్సింగ్స్‌లో టాప్ 8 జట్లు వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తాయి. భారత్, ఇంగ్లండ్, పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లు సూపర్-12 దశకు అర్హత సాధించిన మిగతా ఏడు జట్లు.
ఆస్ట్రేలియాపై ఓటమి పాలైన వెస్టిండీస్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 10వ స్థానానికి పడిపోయింది. శ్రీలంక 9వ స్థానంలో ఉంది.ఈ టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ అన్ని మ్యాచ్‌లు ఓడిపోయినప్పటికీ ర్యాంకింగ్స్‌లో మాత్రం 8వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఆరంభంలో తమ సొంత గడ్డపై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ను ఓడించడమే ఇందుకు కారణం.
ఇది కూడా చదవండి : స్టార్ హీరో కూతురితో ప్రేమాయణం.. బయటపెట్టేసిన కేఎల్ రాహుల్.. ఆమె ఎవరంటే..
ఈసారి ప్రపంచకప్‌లో సూపర్-12 దశకు అర్హత సాధించడంలో విఫలమైన జట్లు వచ్చే ఏడాది తొలి రౌండ్‌లో తలపడనున్నాయి. అంటే తొలి రౌండ్‌లో వెస్టిండీస్, శ్రీలంక, నమీబియా, స్కాట్లాండ్ జట్లు తలపడనున్నాయి. అంతేకాకుండా, ప్రపంచ గ్రూప్ క్వాలిఫయర్స్ నుండి నాలుగు జట్లు మొదటి రౌండ్‌లో పాల్గొంటాయి. నవంబర్ 15న కొత్త టీ20 ప్రపంచ ర్యాంకింగ్‌ను విడుదల చేయనున్నారు. 2022 ప్రపంచకప్‌లో సూపర్-12 దశకు అర్హత సాధించిన ఎనిమిది జట్లలో ఎనిమిది జట్లు అధికారికంగా తర్వాత ప్రకటించబడతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, Cricket, Sports, T20 World Cup 2021, Team India, West Indies