Team India : ఊహాగానాలకు బీసీసీఐ (BCCI) తెర దించింది. జస్ ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) స్థానంలో టీమిండియా (Team India) తరఫున ప్రపంచకప్ ఆడే ప్లేయర్ ఎవరో అధికారికంగా ప్రకటించింది. సరిగ్గా టి20 ప్రపంచకప్ కు రెండు రోజుల ముంగిట భారత వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami)తో బుమ్రా స్థానాన్ని భర్తీ చేస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. షమీ ప్రస్తుతం ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు. రెండు రోజుల క్రితమే షమీ.. సిరాజ్, శార్దుల్ ఠాకూర్ లతో కలిసి ఆస్ట్రేలియాకు పయనం అయ్యాడు. అయితే షమీ ఫిట్ నెస్ పై సందేహాలు రావడంతో సిరాజ్ ను బుమ్రా స్థానంలో ఎంపిక చేస్తారేమో అని అంతా అనుకున్నారు. అయితే వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ అనుభవానికే బీసీసీఐ పెద్ధ పీఠ వేసింది. దాంతో సిరాజ్ తో పాటు దీపక్ చహర్ లకు నిరాశే ఎదురైంది.
రెండు వారాల సస్పెన్స్ తర్వాత
సెప్టెంబర్ 28న జరిగిన తొలి టి20 టాస్ సమయంలో రోహిత్ మాట్లాడుతూ బుమ్రా గాయంతో ఈ మ్యాచ్ లో ఆడటం లేదని ప్రకటించాడు. మరుసటి రోజు బుమ్రా గాయం తీవ్రత ఎక్కువగా ఉందని అతడిన సౌతాఫ్రికాతో టి20 సిరీస్ నుంచి బీసీసీఐ తప్పించింది. కొన్ని రోజుల తర్వాత బుమ్రా టి20 ప్రపంచకప్ నుంచి అవుటని ప్రకటించింది. దాంతో రిజర్వ్ ప్లేయర్ గా ఉన్న షమీ టి20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయంలా కనిపించింది. అయితే కరోనా నుంచి కోలుకున్నా సౌతాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్ కు అతడు దూరంగా ఉండటం.. ఫిట్ నెస్ పై సందేహాలు రావడంతో బుమ్రా స్థాానంలో షమీని తీసుకోవడంపై అనిశ్చితి నెలకొంది. ఇక అదే సమయంలో జట్టులోకి వచ్చిన సిరాజ్.. సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.
???? NEWS ????: Shami replaces Bumrah In India’s ICC Men’s T20 World Cup Squad. #TeamIndia | #T20WorldCup
Details ????https://t.co/nVovMwmWpI — BCCI (@BCCI) October 14, 2022
ఇక సిరాజ్, షమీ, శార్దుల్ ఠాకూర్ లు కలిసి ఆస్ట్రేలియాకు బయలు దేరడంతో బుమ్రా స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎందుకంత జాప్యం తీసుకుంటున్నారో అర్థం కాలేదు. షమీ ఫిట్ గా లేకపోవడంతోనే ఇదంతా జరుగుతుందని అంతా భావించారు. ఇక టి20 ప్రపంచకప్ లో మార్పులు చేర్పులు చేసేందుకు అక్టోబర్ 15 చివరి రోజు. అందుకు సరిగ్గా ఒక రోజు ముందు బుమ్రా స్థానంలో వెటరన్ ప్లేయర్ షమీని తీసుకుంటున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించి సస్పెన్స్ కు తెర దింపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, Bcci, Jasprit Bumrah, Mohammed Shami, Mohammed Siraj, T20 World Cup 2022, Team India