టీ20 ప్రపంచకప్ కౌంట్ డౌన్ షురూ అయింది. ఐదు రోజుల కంటే తక్కువ వ్యవధిలో టి20 ప్రపంచకప్2022 (T20 World Cup 2022) మహా సంగ్రామం ఆరంభం కానుంది. ఆస్ట్రేలియా (Australia) వేదికగా అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. సొంత గడ్డపై కంగారూ టీం డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అడుగపెడుతున్నారు. ఇక 15 ఏళ్ల తర్వాత అయినా టి20 ప్రపంచకప్ ను సొంతం చేసుకోవాలని భారత్ (India) పట్టుదలగా ఉంది. వీటితో పాటు ఇంగ్లండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లు కూడా తమ లక్ ను పరీక్షించుకోనున్నాయి. ఇప్పటికే చాలా జట్లు తమ ప్రపంచకప్ జట్లను ప్రకటించాయి.
ఐసీసీ నిబంధనల ప్రకారం గతేడాది నవంబర్ 10వ తేదీ నాటికి ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ 8లో ఉన్న జట్లు సూపర్ 12 దశకు నేరుగా చేరుకున్నాయి. వీటిలో భారత్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. ఇక మరో నాలుగు జట్ల కోసం గ్రూప్ దశను నిర్వహించనున్నారు. అక్టోబర్ 16 నుంచి 21 వరకు ఈ గ్రూప్ దశ జరగనుంది.
గ్రూప్ ‘ఎ’లో శ్రీలంక, నమీబియా, నెదర్లాండ్స్, యూఏఈ జట్లు.. గ్రూప్ ‘బి’లో ఐర్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వే, స్కాట్లాండ్ దేశాలు ఉన్నాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2లో నిలిచిన మొత్తం నాలుగు జట్లు సూపర్ 12కు అర్హత సాధిస్తాయి. అక్కడ మరోసారి రౌండ్ రాబిన్ పద్దతిన మ్యాచ్ లు జరుగుతాయి. ప్రతి గ్రూప్ నుంచి రెండు జట్ల చొప్పున మొత్తం నాలుగు జట్లు సెమీఫైనల్ కు అర్హత సాధిస్తాయి. ఇక, మొయిన్ మ్యాచులకు ముందు టీమిండియా రెండు ప్రాక్టీస్ మ్యాచుల్లో తలపడనుంది. అవి కూడా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి కఠిన ప్రత్యర్థులతో. ఇది టీమిండియాకు లాభించే విషయం.
టీమిండియా ప్రాక్టీస్ మ్యాచుల షెడ్యూల్ :
మ్యాచ్ నెం | డేట్ | మ్యాచ్ | వెన్యూ | టైం |
1 | అక్టోబర్ 17 | భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా | బ్రిస్బేన్ | 9.30 AM |
2 | అక్టోబర్ 19 | భారత్ వర్సెస్ న్యూజిలాండ్ | బ్రిస్బేన్ | 1.30 PM |
టీమిండియా టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ :
మ్యాచ్ నెం | డేట్ | మ్యాచ్ | వెన్యూ | టైం |
1 | అక్టోబర్ 23 | భారత్ వర్సెస్ పాకిస్థాన్ | మెల్బోర్న్ | 1.30 PM |
2 | అక్టోబర్ 27 | భారత్ వర్సెస్ క్వాలిఫయర్ గ్రూప్ A రన్నరప్ | సిడ్నీ | 12.30 PM |
3 | అక్టోబర్ 30 | భారత్ వర్సెస్ సౌతాఫ్రికా | పెర్త్ | 4.30 PM |
4 | నవంబర్ 2 | భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ | అడిలైట్ ఓవల్ | 1.30 PM |
5 | నవంబర్ 6 | భారత్ వర్సెస్ క్వాలిఫైయర్ గ్రూప్ B విజేత | మెల్బోర్న్ | 1.30 PM |
( నోట్ : మ్యాచులన్నీ భారత కాలమానం ప్రకారమే)
భారత బలగం :
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, అశ్విన్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్, చహల్, దీపక్ హుడా
స్టాండ్ బై :
షమీ, దీపక్ చహర్, రవి బిష్ణోయ్, శ్రేయస్ అయ్యర్
(నోట్ : గాయపడ్డ బుమ్రా స్థానంలో షమీ లేదా సిరాజ్ 15 మంది జట్టు సభ్యులతో చేరే అవకాశం ఉంది)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Rohit sharma, T20 World Cup 2022, Team India, Virat kohli