హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs PAK : పాక్ తో ప్రతీకార మ్యాచ్.. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ కి నో ఛాన్స్.. టీమిండియా తుది జట్టు ఇదే

IND vs PAK : పాక్ తో ప్రతీకార మ్యాచ్.. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ కి నో ఛాన్స్.. టీమిండియా తుది జట్టు ఇదే

PC : TWITTER

PC : TWITTER

IND vs PAK : టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022కి ఊపు తెచ్చే మ్యాచ్ అక్టోబర్ 23 (ఆదివారం) జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) జట్లు విఖ్యాత ఎంసీజీ వేదికగా తలపడనున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs PAK : టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022కి ఊపు తెచ్చే మ్యాచ్ అక్టోబర్ 23 (ఆదివారం) జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) జట్లు విఖ్యాత ఎంసీజీ వేదికగా తలపడనున్నాయి. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. దానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంలో రోహిత్ శర్మ (Rohit Sharma) నాయకత్వంలోని టీమిండియా (Team India) పట్టుదలగా ఉంది. అంతేాకాకుండా ఈ మ్యాచ్ లో నెగ్గి టి20 ప్రపంచకప్ టైటిల్ వేటను ఘనంగా ఆరంభించాలనే ఉద్దేశంతో కూడా టీమిండియా ఉంది. ఇక ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ తో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.

ఇది కూాాడా చదవండి : కివీస్ సూపర్ మ్యాన్.. కళ్లు చెదిరే క్యాచ్ తో కేక పెట్టించిన ఫిలిప్స్.. చూస్తే వావ్ అనాల్సిందే

బ్యాటింగ్ వర్సెస్ బౌలింగ్

ఇక ఈ మ్యాచ్ భారత్ బ్యాటింగ్ కు పాకిస్తాన్ బౌలింగ్ కు మధ్య జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. రోహిత్, కోహ్లీ, రాహుల్, సూర్యకుమార్ యాదవ్ లతో టీమిండియా బ్యాటింగ్ బలంగా ఉంది. ఇక చివర్లో హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ లు మ్యాచ్ ను ఫినిష్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో పాకిస్తాన్ పేస్ త్రయం షాహీన్ అఫ్రిది, నసీం షా, హారీస్ రవూఫ్ భారత బ్యాటర్లకు సవాల్ విసిరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో భారత బ్యాటర్లకు పాకిస్తాన్ బౌలింగ్ కు మధ్య జరిగే సమరం క్రికెట్ అభిమానులను అలరించడం ఖాయం.

తుది జట్టు ఎలా ఉంటందంటే?

పాకిస్తాన్ తో మ్యాచ్ కు ఫలాన జట్టుతో ఆడితే మంచిదంటూ ఇప్పటికే చాలా మంది క్రికెట్ పండితులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. అయితే ద్రవిడ్, రోహిత్ ఇప్పటికే జట్టు విషయంలో క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తుంది. రెండు స్థానాలు మినహా మిగిలిన 9 స్థానాల్లో ఎవరు ఆడతారనే విషయంపై క్లారిటీ ఉంది. అయితే ఆ రెండు స్థానాల్లో ఎవరు ఆడాలనే విషయంపై కాస్త చర్చ జరుగుతుంది. మూడో పేసర్ గా హర్షల్ పటేల్ ను కాదని అర్ష్ దీప్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక రెండో స్పిన్నర్ ను ఆడించాలా లేక అతడి స్థానంలో మరో బ్యాటర్ ను తుది జట్టులోకి తీసుకోవాలా అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది. ఒకే స్పిన్నర్ తో ఆడాలనుకుంటే మాత్రం రిషభ్ పంత్ కు తుది జట్టులో అవకాశం ఉంటుంది. లేదంటే అశ్విన్ లేదా చహల్ లలో ఒకరికి ప్లేయింగ్ ఎలెవెన్ లో చోటు దక్కనుంది.

టీమిండియా తుది జట్టు (అంచనా)

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, అశ్విన్/చహల్, షమీ, భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్.

First published:

Tags: Babar Azam, Dinesh Karthik, Hardik Pandya, IND vs PAK, India VS Pakistan, Mohammed Shami, Rohit sharma, T20 World Cup 2022, Virat kohli

ఉత్తమ కథలు