హోమ్ /వార్తలు /క్రీడలు /

T20 World Cup 2022 : భారత్ కు బిగ్ షాక్.. టి20 ప్రపంచకప్ నుంచి స్టార్ పేసర్ బుమ్రా అవుట్!

T20 World Cup 2022 : భారత్ కు బిగ్ షాక్.. టి20 ప్రపంచకప్ నుంచి స్టార్ పేసర్ బుమ్రా అవుట్!

Jasprit Bumrah

Jasprit Bumrah

T20 World Cup 2022 : టి20 ప్రపంచకప్ (T20 World Cup)కు రెడీ అవుతున్న భారత్ (India)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) మరోసారి గాయపడ్డాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

T20 World Cup 2022 : టి20 ప్రపంచకప్ (T20 World Cup)కు రెడీ అవుతున్న భారత్ (India)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) మరోసారి గాయపడ్డాడు. బ్యాక్ ఇంజూరి కారణంగా సౌతాఫ్రికా (South Africa)తో జరిగిన తొలి టి20కి అతడు దూరంగా ఉన్నాడు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం బుమ్రా తాజా గాయం నుంచి కోలుకోవడానికి నాలుగు నుంచి 6 నెలల సమయం పడుతుందని తెలుస్తుంది. దాంతో అతడు టి20 ప్రపంచకప్ నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే  ఈ విషయంపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ప్రస్తుతానికైతే టి20 ప్రపంచకప్ కు దూరమైనట్లు అటు బీసీసీఐ కానీ, ఇటు అతడు కానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే టీమిండియాతో దగ్గరి సంబంధాలు ఉన్న పలువురు మాత్రం అతడు ప్రపంచకప్ నుంచి తప్పుకున్నట్లు ట్వీట్స్ చేస్తున్నారు.

అందుతున్న సమచారం ప్రకారం బుమ్రా వెన్ను భాగంలో ఫ్రాక్చర్ (బ్యాక్ స్ట్రెస్ ఫ్రాక్చర్) అయినట్లు తెలుస్తుంది. అయితే దీనికి సర్జరీ చేయాల్సిన అవసరం లేదని కూడా వార్తలు వస్తున్నాయి. పూర్తిగా కోలుకోవడానికి నాలుగు నుంచి 6 నెలల సమయం పడుతుందని సమాచారం. దాంతో అతడు టి20 ప్రపంచకప్ తో పాటు వచ్చే ఏడాది ఆరంభంలో కొన్ని నెలల పాటు క్రికెట్ కు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కన అతడు మళ్లీ ఐపీఎల్ నాటికి కోలుకునే అవకాశం ఉంది.

భారత్ కు పెద్ద ఎదురుదెబ్బే

అయితే బీసీసీఐ దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. ఇప్పటికే గాయంతో రవీంద్ర జడేజా టి20 ప్రపంచకప్ కు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా బుమ్రా కూడా దూరమైతే అది భారత్ కు భారీ దెబ్బ అనే చెప్పాలి. హర్షల్ పటేల్ కూడా పూర్తి ఫిట్ నెస్ తో లేనట్లు కనిపిస్తున్నాడు. గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసినా బౌలింగ్ చేసే సమయంలో అతడు ఇంకా ఇబ్బంది పడుతున్నట్లే కనిపిస్తుంది. హర్షల్ పటేల్ పక్కటెముకల గాయం కారణంగా ఆసియా కప్ కు దూరమయ్యాడు. బుమ్రా స్థానంలో షమీ, దీపక్ చహరల్ లలో ఒకరిని మెయిన్ టీంలోకి తీసుకునే అవకాశం ఉంది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: India vs South Africa, Jasprit Bumrah, Mohammed Shami, T20 World Cup 2022, Team India

ఉత్తమ కథలు