T20 World Cup 2022 Semi Finals Schedule : టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022 అంతిమ ఘట్టానికి చేరుకుంది. ఈసారి టి20 ప్రపంచకప్ విజేత ఎవరో తేలడానికి మరో మూడు మ్యాచ్ లు మాత్రమే అడ్డంకిగా ఉన్నాయి. గ్రూప్ 1 నుంచి న్యూజిలాండ్ (New Zealand), ఇంగ్లండ్ (England) జట్లు సెమీస్ చేరితే.. గ్రూప్ 2 నుంచి భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) జట్లు చేరాయి. నవంబర్ 9, 10వ తేదీల్లో సిడ్నీ, అడిలైడ్ వేదికల్లో సెమీఫైనల్స్ మ్యాచ్ లు జరగనున్నాయి. నవంబర్ 9న సిడ్నీ వేదికగా జరిగే తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ తో న్యూజిలాండ్ తలపడనుంది. నవంబర్ 10న అడిలైడ్ వేదికగా జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ తో పాకిస్తాన్ ఆడనుంది. అయితే ఈ టి20 ప్రపంచకప్ లో వరుణుడి పాత్ర ఎంతో ఉంది. వర్షంతో సూపర్ 12లో కొన్ని మ్యాచ్ లు రద్దు కూడా అయ్యాయి. దాని కారణంగానే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి జట్లు ఇంటి దారి పట్టాయి. జింబాబ్వేతో గెలిచే స్థితిలో ఉన్న సమయంలో వర్షంతో సౌతాఫ్రికాకు విజయాన్ని దూరం చేసింది. ఒకవేళ సెమీఫైనల్స్ రోజు వర్షం పడి మ్యాచ్ రద్దయితే అప్పుడు ఏంటి పరిస్థితి అనే డౌట్ అందరిలోనూ కలగక మానదు. ఒకవేళ వర్షంతో సెమీఫైనల్ రోజు మ్యాచ్ లను నిర్వహించలేకపోతే అప్పుడేం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి : జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట.. అలాగే ఉంది ఈ ఇద్దరి యవ్వారం
వర్షంతో మ్యాచ్ జరగకపోతే
టి20 ప్రపంచకప్ 2022 సెమీఫైనల్స్ తో పాటు ఫైనల్ కు రిజర్వ్ డేలు ఉన్నాయి. దాంతో మ్యాచ్ రోజు వర్షంతో ఆట సాధ్యం కాకపోతే మరుసటి రోజు అంటే రిజర్వ్ డే రోజు మ్యాచ్ ను పూర్తి చేస్తారు. ఉదాహరణకు నవంబర్ 9న న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. వర్షంతో ఆ రోజు మ్యాచ్ జరగకపోతే.. రిజర్వ్ డే రోజున నిర్వహిస్తారు. అయితే దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవేంటంటే.. మ్యాచ్ ఎక్కడైతే నిలిచిపోయిందో అక్కడి నుంచే రిజర్వ్ డే రోజు ఆట మొదలవుతుంది. ఉదాహరణకు తొలి సెమీస్ లో కివీస్ తొలుత బ్యాటింగ్ చేస్తూ 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసిందనుకుందాం. పాకిస్తాన్ ఛేదనలో 5 ఓవర్లకు వికెట్ నష్టపోయి 30 పరుగులు చేసిందనకుందాం. ఈ సమయంలో వర్షంతో ఆడ సాధ్యపడలేదు. దాంతో మ్యాచ్ రిజర్వ్ డేకు వాయిదా పడిందనుకుందాం. రిజర్వ్ డే రోజు మ్యాచ్ పాకిస్తాన్ ఇన్నింగ్స్ ఎక్కడైతే ఆగిపోయిందో (50/1 (5 ఓవర్లు) అక్కడి నుంచే జరుగుతుంది. అయితే మ్యాచ్ ను ఎట్టి పరిస్థితిలోనూ షెడ్యూల్ రోజే పూర్తయ్యేలా అంపైర్లు చూస్తారు. ఒకవేళ కుదరకపోతేనే రిజర్వ్ డేకు వెళ్తారు.
రిజర్వ్ డే రోజు కూడా వర్షం పడితే
షెడ్యూల్, రిజర్వ్ డే రెండు రోజుల్లోనూ వర్షం పడిన సందర్భంలో కనీసం 5 ఓవర్ల చొప్పున ఆటను కొనసాగించేందుకు అంపైర్లు చూస్తారు. అలా జరగకపోతే గ్రూేప్స్ లో టాపర్స్ గా నిలిచిన జట్లు ఫైనల్స్ కు చేరతాయి. కివీస్ వర్సెస్ పాక్ సెమీస్ మ్యాచ్ వర్షంతో రిజర్వ్ డే రోజు కూడా జరగకపోతే అప్పుడు కివీస్ ను విజేతగా నిర్ణయిస్తారు. ఎందుకంటే కివీస్ గ్రూప్ 1 టాపర్ గా నిలిచింది. భారత్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో సెమీస్ లో కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. రెండో సెమీస్ వర్షం కారణంగా రిజర్వ్ డే రోజు కూడా నిర్వహించలేకపోతే భారత్ విజేతగా నిలిచి ఫైనల్స్ కు చేరుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dinesh Karthik, England, India vs england, New Zealand, Pakistan, Rishabh Pant, Rohit sharma, Surya Kumar Yadav, T20 World Cup 2022, Virat kohli