T20 World Cup 2022 - SRI vs NED : టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో గ్రూప్ దశ మ్యాచ్ లు అంతిమ ఘట్టానికి చేరుకున్నాయి. గ్రూప్ ‘ఎ’లో భాగంగా మరికొద్ది సేపట్లో నెదర్లాండ్స్ (Netherlands)తో శ్రీలంక (Sri Lanka) తలపడనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు సూపర్ 12కు చేరుకుంటుంది. ఓడిన జట్టు యూఏఈ (UAE), నమీబియా (Namibia) జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఫలితం కోసం ఎదురు చూడాలి. ఈ మ్యాచ్ లో శ్రీలంక ఓడితే మాత్రం దాదాపుగా టోర్నీ నుంచి తప్పుకున్నట్లే. ఇక ఈ డూ ఆర్ డై మ్యాచ్ లో శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక (Dasun Shanaka) టాస్ నెగ్గాడు. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ కోసం రెండు మార్పులు చేశాడు. యూఏఈ మ్యాచ్ లో గాయపడ్డ దుష్మంత చమీరతో పాటు మధుషాన్ లను పక్కన పెట్టిన శ్రీలంక.. వారి స్థానాల్లో బినురు ఫెర్నాండో, లహిరు కుమారలను తుది జట్టులోకి తీసుకుంది. ఇక నెదర్లాండ్స్ మార్పులు లేకుండానే బరిలోకి దిగనుంది.
శ్రీలంక సూపర్ 12కు వెళ్లాలంటే
నెదర్లాండ్స్ పై తప్పకుండా నెగ్గాల్సి ఉంది. ఓడితే మాత్రం దాదాపుగా టోర్నీ నుంచి శ్రీలంక తప్పుకుంటుంది. అయితే శ్రీలంక ఓడినా.. నమీబియాపై యూఏఈ భారీ తేడాతో నెగ్గితే అప్పుడు సూపర్ 12కు చేరేందుకు లంకేయులకు ఛాన్స్ ఉంటుంది.
నెదర్లాండ్స్ చేరాలంటే
ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ నెగ్గిన నెదర్లాండ్స్ సూపర్ 12కు చేరాలంటే శ్రీలంకపై తప్పకుండా నెగ్గాల్సి ఉంది. ఒక వేళ ఓడితే మాత్రం అప్పుడు నమీబియా, యూఏఈ జట్ల ఫలితంపై ఆధారపడాల్సి వస్తుంది. నెదర్లాండ్స్ నెట్ రన్ రేట్ నమీబియా, శ్రీలంక జట్ల కంటే తక్కువగా ఉంది. ఈ క్రమంలో నెదర్లాండ్స్ చేరాలంటే మాత్రం శ్రీలంకను ఓడించక తప్పదు. ఒక వేళ ఓడితే మాత్రం.. యూఏఈ చేతిలో నమీబియా ఓడాల్సి ఉంటుంది.
నమీబియా చేరాలంటే
నమీబియా సూపర్ 12కు చేరాలంటే ఉన్న ఏకైక దారి యూఏఈపై నెగ్గడం. యూఏఈపై పరుగు తేడాతో నెగ్గినా కూడా నమీబియా సూపర్ 12కు చేరుకుంటుంది. ఒక వేళ నమీబియా యూఏఈ చేతిలో ఓడితే అప్పుడు నెదర్లాండ్స్ శ్రీలంకపై నెగ్గాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో నెదర్లాండ్స్ తో పాటు నమీబియా సూపర్ 12కు చేరుకుంటుంది. నమీబియా నెట్ రన్ రేట్ శ్రీలంక కంటే కూడా ఎక్కువగా ఉంది. నమీబియా, యూఏఈ మధ్య జరిగే పోరు భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభం కానుంది.
తుది జట్లు
శ్రీలంక
దాసున్ షనక (కెప్టెన్), నిస్సాంక, కుశాల్ మెండీస్, అసలంక, ధనంజయ డిసిల్వా, రాజపక్స, హసరంగ, కరుణరత్నే, లహిరు కుమార, బినురు ఫెర్నాండో, తీక్షణ.
నెదర్లాండ్స్
స్కాట్ ఎడ్వర్డ్స్, మ్యాక్స్ ఓ డౌడ్, విక్రమ్ జిత్ సింగ్, బాస్ డీ లీడె, కాలిన్ అకర్ మన్, టిమ్ ప్రింగెల్, వాన్ డెర్ మెర్వె, టిమ్ వాన్ డెర్, ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, Netherlands, Sri Lanka, T20 World Cup 2022