T20 World Cup 2022 - SL vs NED : డూ ఆర్ డై మ్యాచ్ లో శ్రీలంక (Sri Lanka) జట్టు బ్యాటర్లు రాణించారు. నెదర్లాండ్స్ (Netherlands)తో జరుగుతున్న గ్రూప్ ‘ఎ’ కీలక పోరులో శ్రీలంక భారీ స్కోరును సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసింది. కుశాల్ మెండీస్ (44 బంతుల్లో 79; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధ శతకంతో జట్టు భారీ స్కోరు సాధించడంలో ముఖ్య పాత్ర పోషించాడు. చరిత్ అసలంక (30 బంతుల్లో 31; 3 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాల్ వాన్ మెకరీన్, బాస్ డీ లీడ్ చెరో రెండు వికెట్లు తీశారు. గగ్ టన్, ఫ్రెడ్ క్లాసెన్ లకు చెరో వికెట్ లభించింది.
టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక మరో మాటకు తావు లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్ లో అర్ధ సెంచరీ సాధించిన నిస్సంక (14) ఈ మ్యాచ్ లో నిరాశ పరిచాడు. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన ధనంజయ డిసిల్వా (0) గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. దాంతో శ్రీలంక 36 పరుగులకే 2 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో జతకలిసిన కుశాల్ మెండీస్, అసలంక జట్టు బాధ్యతను తీసుకన్నారు. గత కొంత కాలంగా ఫామ్ లో లేని అసలంక ఈ మ్యాచ్ లో రాణించాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు 94 పరుగులు జోడించారు. భానుక రాజపక్స (19) ఆరంభం లభించినా భారీ స్కోరుగా మలచలేకపోయాడు. అయితే చివర్లో కుశాల్ మెండీస్ భారీ షాట్లు ఆడటంతో శ్రీలంక 162 పరుగులకు చేరుకుంది.
Sri Lanka have set a competitive target for Netherlands in Geelong ????#NEDvSL | ????: https://t.co/l8AASqhwE6 Head to our app and website to follow the #T20WorldCup action ???? https://t.co/76r3b7l2N0 pic.twitter.com/79ZaoarKtl
— ICC (@ICC) October 20, 2022
ఈ మ్యాచ్ కోసం రెండు మార్పులు చేశాడు. యూఏఈ మ్యాచ్ లో గాయపడ్డ దుష్మంత చమీరతో పాటు మధుషాన్ లను పక్కన పెట్టిన శ్రీలంక.. వారి స్థానాల్లో బినురు ఫెర్నాండో, లహిరు కుమారలను తుది జట్టులోకి తీసుకుంది. ఇక నెదర్లాండ్స్ మార్పులు లేకుండానే బరిలోకి దిగనుంది.
శ్రీలంక సూపర్ 12కు వెళ్లాలంటే
నెదర్లాండ్స్ పై తప్పకుండా నెగ్గాల్సి ఉంది. ఓడితే మాత్రం దాదాపుగా టోర్నీ నుంచి శ్రీలంక తప్పుకుంటుంది. అయితే శ్రీలంక ఓడినా.. నమీబియాపై యూఏఈ భారీ తేడాతో నెగ్గితే అప్పుడు సూపర్ 12కు చేరేందుకు లంకేయులకు ఛాన్స్ ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, Netherlands, Sri Lanka, T20 World Cup 2022