హోమ్ /వార్తలు /క్రీడలు /

SL vs NED : డూ ఆర్ డై పోరులో శ్రీలంక విజయం.. సూపర్ 12లో ప్రవేశం.. డౌడ్ పోరాటం వృధా

SL vs NED : డూ ఆర్ డై పోరులో శ్రీలంక విజయం.. సూపర్ 12లో ప్రవేశం.. డౌడ్ పోరాటం వృధా

Pc : TWITTER

Pc : TWITTER

T20 World Cup 2022 - SL vs NED : ఆసియా కప్ (Asia Cup) 2022 చాంపియన్ శ్రీలంక (Sri Lanka) జట్టు ఊపిరిపీల్చుకుంది. గురువారం నెదర్లాండ్స్ (Netherlands)తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో గెలుపొందిన శ్రీలంక సూపర్ 12లోకి ప్రవేశించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

T20 World Cup 2022 - SL vs NED : ఆసియా కప్ (Asia Cup) 2022 చాంపియన్ శ్రీలంక (Sri Lanka) జట్టు ఊపిరిపీల్చుకుంది. గురువారం నెదర్లాండ్స్ (Netherlands)తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో గెలుపొందిన శ్రీలంక సూపర్ 12లోకి ప్రవేశించింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరిగిన పోరులో శ్రీలంక 16 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ పై నెగ్గింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసింది. మ్యాక్స్ ఓ డౌడ్ (53 బంతుల్లో 71 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) చివరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. అయితే అతడికి ఇతర బ్యాటర్ల నుంచి సహకారం అందలేదు. దాంతో నెదర్లాండ్స్ ఓటమి వైపు నిలిచింది. శ్రీలంక బౌలర్లలో హసరంగ 3 వికెట్లు తీశాడు. తీక్షణ 2 వికెట్లు సాధించాడు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ ను శ్రీలంక బౌలర్లు కట్టడి చేశారు. విక్రమ్ జిత్ సింగ్ (7), డి లీడ్ (14), కోలిన్ (0), అలా వచ్చి ఇలా వెళ్లారు. టాప్ కూపర్ (16), కెప్టెన్ ఎడ్వర్డ్స్ (21) కాసేపు ఆడినా భాగస్వామ్యాన్ని మాత్రం నెలకొల్పలేకపోయారు. హసరంగ కీలక సమయాల్లో వికెట్లు తీయడంతో పాటు తీక్షణ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నెదర్లాండ్స్ ఓటమి ఖాయమైంది. చివర్లో డౌడ్ భారీ షాట్లు ఆడినా అది శ్రీలంక విజయాన్ని అడ్డుకోలేకపోయింది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసింది. కుశాల్ మెండీస్ (44 బంతుల్లో 79; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధ శతకంతో జట్టు భారీ స్కోరు సాధించడంలో ముఖ్య పాత్ర పోషించాడు. చరిత్ అసలంక (30 బంతుల్లో 31; 3 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాల్ వాన్ మెకరీన్, బాస్ డీ లీడ్ చెరో రెండు వికెట్లు తీశారు. గగ్ టన్, ఫ్రెడ్ క్లాసెన్ లకు చెరో వికెట్ లభించింది.

నెదర్లాండ్ పరిస్థితి ఏంటి?

తొలి మ్యాచ్ లో నమీబియా చేతిలో ఓడిన తర్వాత పుంజుకున్న శ్రీలంక వరుసగా రెండు మ్యాచ్ ల్లోనూ నెగ్గి సూపర్ 12కు చేరుకుంది. అయితే సూపర్ 12లో గ్రూప్ 1లోకి చేరుతుందా లేక గ్రూప్ 2లోకి చేరుతుందా అని తేలాలంటే మాత్రం నమీబియా, యూఏఈ మ్యాచ్ పూర్తి కావాల్సిందే. నమీబియా యూఏఈపై గెలిస్తే అప్పుడు శ్రీలంక గ్రూప్ 2కు చేరుకుంటుంది. అదే ఓడితే మాత్రం గ్రూప్ 1లోకి చేరుకుంటుంది. ఇక నెదర్లాండ్స్ పరిస్థితే ఇప్పుడు దారుణంగా మారింది. తొలి రెండు మ్యాచ్ ల్లోనూ నెగ్గినా నెట్ రన్ రేట్ నెగెటివ్ లో ఉండటంతో సూపర్ 12కు చేరే అంశం యూఏఈ విజయంపై ఆధారపడి ఉంది. నమీబియాపై యూఏఈ విజయం సాధిస్తే అప్పుడు శ్రీలంక గ్రూప్ టాపర్ గా.. నెదర్లాండ్స్ గ్రూప్ రన్నరప్ గా సూపర్ 12కు చేరుకుంటుంది. ఒక వేళ నమీబియా నెగ్గితే మాత్రం నెదర్లాండ్స్ ఇంటి దారి పడుతుంది. అప్పుడు నమీబియా గ్రూప్ టాపర్ గా.. శ్రీలంక గ్రూప్ రన్నరప్ గా సూపర్ 12కు చేరుకుంటాయి.

First published:

Tags: Australia, Netherlands, Sri Lanka, T20 World Cup 2022