హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs AUS : ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్ కు టీమిండియా రెడీ.. మ్యాచ్ టైమ్ ఎప్పుడంటే?

IND vs AUS : ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్ కు టీమిండియా రెడీ.. మ్యాచ్ టైమ్ ఎప్పుడంటే?

PC : TWITTER

PC : TWITTER

IND vs AUS Warm Up Match : టి20 ప్రపంచకప్ (T20 World Cup) వేటను సన్నాహక మ్యాచ్ తో భారత్ (India) సోమవారం నాడు ఆరంభించనుంది. బ్రిస్బేన్ 17న జరిగే పోరులో ఆతిథ్య ఆస్ట్రేలియా (Australia)తో భారత్ తలపడనుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs AUS Warm Up Match : టి20 ప్రపంచకప్ (T20 World Cup) వేటను సన్నాహక మ్యాచ్ తో భారత్ (India) సోమవారం నాడు ఆరంభించనుంది. బ్రిస్బేన్ 17న జరిగే పోరులో ఆతిథ్య ఆస్ట్రేలియా (Australia)తో భారత్ తలపడనుంది. సూపర్ 12 దశ  ఈ నెల 22 నుంచి ఆరంభం కానుండగా.. అందుకు సన్నాహకాల్ల ో భాగంగా భారత్ రెండు ప్రాక్టీస్ మ్యాచ్ లను ఆడనుంది. తొలి పోరు అక్టోబర్ 17న ఆస్ట్రేలియాతో.. రెండో పోరు 19న న్యూజిలాండ్ తో ఆడనుంది. అనంతరం అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో జరిగే పోరుతో టైటిల్ వేటను ఆరంభించనుంది. ఇక ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 9.30 గంటలకు ఆరంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్ తెలుగు, 1లతో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ఇది కూడా చదవండి : అన్నీ ఉన్నా ఆ జట్టు నోట్లో శని.. అదృష్టం లేక మెగా టోర్నీల్లో విఫలం.. ఈసారి ఏం చేస్తుందో?

చివరి సన్నాహకం

అసలైన టోర్నీ ముందు భారత్ ఆడనున్న చివరి రెండు వార్మప్ మ్యాచ్ లు ఇవే కావడంతో వీటిని చక్కగా ఉపయోగించుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్ కంటే కూడా ముందు వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో భారత్ రెండు వార్మప్ మ్యాచ్ లను ఆడింది. అయితే ఒక దాంట్లో గెలిచి మరో దాంట్లో ఓడిపోయింది. ఇప్పుడు మరో రెండు వార్మప్ మ్యాచ్ లను ఆడనుంది. ఈ రెండింటిలోనూ ప్లేయర్లందరికీ చక్కటి ప్రాక్టీస్ కల్పించాలనే ఉద్దేశంతో టీం ఉంది. ఇక ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో మొత్తం 15 మంది జట్టు సభ్యులకు కూడా బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం ఉంది. అయితే కోచ్ ద్రవిడ్ అందరికీ అవకాశం ఇస్తాడా? లేక పక్కా ప్లేయింగ్ ఎలెవన్ తో ప్రాక్టీస్ చేస్తాడా? అనేది తేలాల్సి ఉంది.

షమీకి కీలకం

ఇంగ్లండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో మొహ్మద్ షమీ తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ను ఆడాాడు. అనంతరం అతడు మళ్లీ ఒక్కటంటే ఒక్క మ్యాచ్ ను ఆడలేదు. ఇతర బౌలర్లు గాయపడటం.. అవేశ్ ఖాన్ పూర్ ఫామ్ వంటి కారణాలతో స్టాండ్ బై ప్లేయర్ల జాబితాలో షమీ చేరాడు. ఇక బుమ్రా గాయంతో టోర్నీకి దూరం కావడంతో అతడి స్థానంలో చివరి నిమిషంలో షమీ ప్రపంచకప్ జట్టులోకి వచ్చాడు. అతడు గత మూడు నెలలుగా ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. దాంతో అతడికి ఈ రెండు వార్మప్ మ్యాచ్ లు కీలకం కానున్నాయి. అదే సమయంలో హర్షల్ పటేల్, చహల్, భువనేశ్వర్ కుమార్ లకు కూడా ఈ వార్మప్ మ్యాచ్ లు కీలకం. సమస్యలు ఏవైనా ఉంటే ఇక్కడే సరి చేసుకోవాల్సి ఉంది.

భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, అశ్విన్, హర్షల్ పటేల్, షమీ, భువనేశ్వర్ కుమార్, చహల్, అర్ష్ దీప్ సింగ్.

First published:

Tags: Dinesh Karthik, Hardik Pandya, India vs australia, KL Rahul, Mohammed Shami, Rohit sharma, T20 World Cup 2022, Team India, Virat kohli

ఉత్తమ కథలు