హోమ్ /వార్తలు /క్రీడలు /

T20 World Cup 2022 Prize Money : ప్రపంచకప్ గెలిచే జట్టుకు భారీ ప్రైజ్ మనీ.. ఐపీఎల్ తో పోలిస్తే మాత్రం తక్కువే

T20 World Cup 2022 Prize Money : ప్రపంచకప్ గెలిచే జట్టుకు భారీ ప్రైజ్ మనీ.. ఐపీఎల్ తో పోలిస్తే మాత్రం తక్కువే

PC : ICC/TWITTER

PC : ICC/TWITTER

T20 World Cup 2022 Prize Money : టి20 ప్రపంచకప్ (T20 World Cup) ఆరంభం అయ్యేందుకు 20 రోజుల కంటే కూడా తక్కువ సమయమే ఉంది. ఇప్పటికే అన్ని జట్లు కూడా తమ ప్రపంచకప్ టీంలను ఎంపిక చేసింది. కొన్ని జట్లు సన్నాహక సిరీస్ లతో బిజీ బిజీగా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

T20 World Cup 2022 Prize Money : టి20 ప్రపంచకప్ (T20 World Cup) ఆరంభం అయ్యేందుకు 20 రోజుల కంటే కూడా తక్కువ సమయమే ఉంది. ఇప్పటికే అన్ని జట్లు కూడా తమ ప్రపంచకప్ టీంలను ఎంపిక చేసింది. కొన్ని జట్లు సన్నాహక సిరీస్ లతో బిజీ బిజీగా ఉన్నాయి. టి20 ప్రపంచకప్ జట్టును అక్టోబర్ 9వ తేదీలోపు మార్చుకునే వీలు కూడా ఉంది. ఇక తాజాగా ఐసీసీ (ICC).. టి20 ప్రపంచకప్ కు సంబంధించిన ప్రైజ్ మనీ వివరాలను విడుదల చేసింది. ఈ ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన జట్టుకు భారీ మొత్తంలో నగదు పారితోషికంగా లభించనుంది. టి20 ప్రపంచకప్ లో చాంపియన్ గా నిలిచే జట్టు 1.6 మిలియన్ల అమెరికన్ డాలర్లను గెలుచుకోనుంది. మన కరెన్సీలో ఈ మొత్తం దాదాపుగా రూ. 13.05 కోట్లు. ఐపీఎల్ తో పోలిస్తే ఇది తక్కువే. ఈ ఏడాది ఐపీఎల్ లో గెలిచిన జట్టుకు రూ. 20 కోట్లు ప్రైజ్ మనీగా దక్కింది.

ఇక రన్నరప్ గా నిలిచిన జట్టుకు 8 లక్షల అమెరికన్ డాలర్లు (మన కరెన్సీలో రూ. 6.52 కోట్లు) ప్రైజ్ మనీగా దక్కుతుంది. ఇక సెమీఫైనల్లో ఓడిపోయిన రెండు జట్లకు కూడా భారీ మొత్తంలో ప్రైజ్ మనీ దక్కనుంది. ఒక్కో జట్టు 4 లక్షల అమెరికన్ డాలర్లు (రూ. 3.26 కోట్లు) చొప్పున ప్రైజ్ మనీగా దక్కుతుంది.

ప్రైజ్ మనీ వివరాలు (మన కరెన్సీలో దాదాపుగా)

విజేత - రూ. 13. 05 కోట్లు

రన్నరప్ -  రూ. 6.52 కోట్లు

సెమీఫైనల్లో ఓడిన రెండు జట్లకు -  రూ. 3.26 కోట్ల చొప్పున రెండు జట్లకు అందుతుంది.

సూపర్ 12లో నిష్క్రమించే 8 జట్లు - ఒక్కో జట్టుకు రూ. 57 లక్షల చొప్పున 8 జట్లకు అందుతాయి.

గ్రూప్ దశలో నిష్క్రమించే 4 జట్లు - ఒక్కో జట్టుకు రూ. 32 లక్షల చొప్పున నాలుగు జట్లకు అందుతాయి.

వీటితో పాటు గ్రూప్, సూపర్ 12 దశలో జరిగే మ్యాచ్ ల్లో విజయం సాధించే ప్రతి జట్టుకు కూడా ప్రైజ్ మనీ దక్కనుంది. గ్రూప్ దశలో 12 మ్యాచ్ లు.. సూపర్ 12లో 30 మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ లెక్కన మొత్తం 42 మ్యాచ్ లు జరుగుతాయి. ప్రతి మ్యాచ్ లో విజయం సాధించిన జట్టుకు  రూ. 32.62 లక్షలు ప్రైజ్ మనీగా అందుతాయి. టోర్నమెంట్ మొత్తం ప్రైజ్ మనీ విలువ రూ. 45. 67 కోట్లు కావడం విశేషం.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Australia, ICC, India vs South Africa, T20 World Cup 2022, Team India

ఉత్తమ కథలు