హోమ్ /వార్తలు /క్రీడలు /

T20 World Cup 2022 : మొన్న గెలిచారని ఏడ్చారు.. ఇప్పుడు ఓడారని ఏడుస్తున్నారు.. పాకిస్తాన్ అభిమానులూ.. మీరు మారరా?

T20 World Cup 2022 : మొన్న గెలిచారని ఏడ్చారు.. ఇప్పుడు ఓడారని ఏడుస్తున్నారు.. పాకిస్తాన్ అభిమానులూ.. మీరు మారరా?

PC : TWITTER

PC : TWITTER

T20 World Cup 2022 : టి20 ప్రపంచకప్ (T20 World Cup)లో అందరిదీ ఒక బాధ అయితే పాకిస్తాన్ (Pakistan) జట్టుది.. వాళ్ల అభిమానులది మరో బాధ. తమ ఆటగాళ్ల చెత్త ప్రదర్శనను విమర్శించడం కంటే కూడా భారత (India) క్రికెట్ జట్టుపై పడి ఏడుస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

T20 World Cup 2022 : టి20 ప్రపంచకప్ (T20 World Cup)లో అందరిదీ ఒక బాధ అయితే పాకిస్తాన్ (Pakistan) జట్టుది.. వాళ్ల అభిమానులది మరో బాధ. తమ ఆటగాళ్ల చెత్త ప్రదర్శనను విమర్శించడం కంటే కూడా భారత (India) క్రికెట్ జట్టుపై పడి ఏడుస్తున్నారు. మొన్న పాకిస్తాన్ పై భారత్ గెలవగానే తొండి ఆట ఆడి గెలిచారంటూ పెడబొబ్బలు పెట్టారు. రూల్స్ విషయంలో కనీసం అవగాహన లేకుండానే టీమిండియాపై పాక్ మాజీ క్రికెటర్లు, అభిమానులు కారు కూతలు కూశారు. ఇక తాజాగా మరోసారి టీమిండియాపై పడి ఏడుపులు స్టార్ట్ చేశారు. అయితే ఈసారి గెలిచినందుకు కాదు.. ఓడినందుకు. సౌతాఫ్రికాపై భారత్ కావాలనే ఓడిందంటూ గుండెలు బాదుకుంటున్నారు. తమ జట్టు సెమీఫైనల్ చేరే అవకాశాలను దెబ్బ తీసేందుకే భారత్ ఓడిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

భారత్ పై పడి ఏడ్వడం తప్ప వారికేం తెలుసు

టీమిండియాపై పడి ఏడ్వడం పాకిస్తాన్ కు ఇది కొత్తేం కాదు. గతంలోనూ ఎన్నో సార్లు ఏడ్చారు. తమ ఓటములను హుందాగా ఓప్పుకోవడం మాని ఏవోవే కారణాలు చెబుతూ తమను తామే చులకన చేసుకుంటున్నారు. ఈ టి20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ టైటిల్ ఫేవరెట్స్ గా బరిలోకి దిగింది. అయితే తొలి మ్యాచ్ లో భారత్ చేతిలో పోరాడి ఓడింది. ఆ తర్వాత బలహీన జట్టు జింబాబ్వేపై ఓడి తన సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇక ఈ టోర్నీలో పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ పేలవ ఫామ్ లో ఉన్నాడు. వారి ఫీల్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తొలి రెండు మ్యాచ్ ల్లో ఓడటంతో పాక్ సెమీస్ అవకాశాలు భారత్ చేతిలో పడ్డాయి. భారత్ సూపర్ 12లో అన్ని మ్యాచ్ ల్లో నెగ్గి.. అదే సమయంలో పాకిస్తాన్ తన చివరి మూడు మ్యాచ్ ల్లో గెలిస్తే అప్పుడు గ్రూప్ టాపర్ గా భారత్.. రెండో స్థానంలో పాకిస్తాన్ సెమీస్ చేరుతుంది.  అయితే ఇప్పుడు భారత్ సౌతాఫ్రికా చేతిలో ఓడటంతో పాకిస్తాన్ సెమీస్ ఆశలు మరింత సంక్లిష్టం అయ్యాయి. పాకిస్తాన్ తన తదుపరి మ్యాచ్ ల్లో నెగ్గినా ఆ జట్టుకు 6 పాయింట్లు లభిస్తాయి. భారత్ బంగ్లాదేశ్, జింబాబ్వేపై గెలిస్తే 8 పాయింట్లు వస్తాయి. ఇక సౌతాఫ్రికా పాక్ చేతిలో ఓడి నెదర్లాండ్స్ పై నెగ్గినా 7 పాయింట్లతో సెమీస్ చేరుతుంది.

భారత్ కావాలనే ఓడిందా?

సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో భారత్ పేలవ ప్రదర్శన చేసిందనేది ముమ్మాటికి వాస్తవం. అలా అని భారత్ కావాలనే ఓడిందనడం మాత్రం సమంజసం కాదు. ఎందుకంటే టి20 ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో ప్రతి మ్యాచ్ కూడా ముఖ్యమే. భారత్ ఇంకా సెమీస్ చేరలేదు. సెమీస్ చేరాలంటే తదుపరి రెండు మ్యాచ్ ల్లోనూ తప్పక గెలవాల్సిన పరిస్థితి. టి20 ఫార్మాట్ లో ఏ జట్టును కూడా తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు. అలాంటి స్థితిలో భారత్ ప్రతి మ్యాచ్ ను గెలవాలనే బరిలోకి దిగుతుందే కానీ.. పాకిస్తాన్ ను ఇంటికి పంపేందుకు ఓడేందుకు ఎందుకు బరిలోకి దిగుతుంది. ముందు భారత్ పై పడి ఏడ్వడం మాని తమ జట్టును ప్రక్షాళన చేయాలని పాక్ అభిమానులు ఉద్యమిస్తే మంచిది. అదే సమయంలో ఆస్ట్రేలియా గడ్డపై పాక్ రికార్డు కూడా ఏ మాత్రమ బాగాలేదు. నెదర్లాండ్స్ పై నెగ్గి ఆసీస్ గడ్డపై తొలి టి20 విజయాన్ని అందుకుంది.

First published:

Tags: India VS Pakistan, India vs South Africa, Pakistan, Rohit sharma, T20 World Cup 2022, Team India, Virat kohli

ఉత్తమ కథలు