హోమ్ /వార్తలు /క్రీడలు /

NZ vs PAK 1st Semi Final : పాకిస్తాన్ అదుర్స్.. న్యూజిలాండ్ బెదుర్స్.. ఫైనల్లో అడుగు పెట్టిన దాయాది దేశం

NZ vs PAK 1st Semi Final : పాకిస్తాన్ అదుర్స్.. న్యూజిలాండ్ బెదుర్స్.. ఫైనల్లో అడుగు పెట్టిన దాయాది దేశం

PC : ICC

PC : ICC

NZ vs PAK 1st Semi Final : తొలి మ్యాచ్ లో భారత్ (India) చేతిలో ఆఖరి బంతికి ఓటమి.. ఆ తర్వాత జింబాబ్వే (Zimbabwe) లాంటి బలహీన జట్టు చేతిలో అనూహ్య ఓటమి.. టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022 ఆరంభంలో పాకిస్తాన్ (Pakistan) ఆటతీరు ఇది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

NZ vs PAK 1st Semi Final : తొలి మ్యాచ్ లో భారత్ (India) చేతిలో ఆఖరి బంతికి ఓటమి.. ఆ తర్వాత జింబాబ్వే (Zimbabwe) లాంటి బలహీన జట్టు చేతిలో అనూహ్య ఓటమి.. టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022 ఆరంభంలో పాకిస్తాన్ (Pakistan) ఆటతీరు ఇది. ఆ సమయంలో ఎవరూ కూడా మన దాయాది దేశం ఫైనల్ కు చేరుతుందని అనుకోలేదు. సొంత ప్రేక్షకులే పాకిస్తాన్ జట్టుపై దుర్భాషలు ఆడారు. ఆడింది చాలు తట్టా బుట్టా సర్దుకొని ఇంటికి వచ్చేసేయండి అంటూ ఆ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కామెంట్స్ కూడా చేశాడు. అయితే అక్కడి నుంచి అనూహ్యంగా పుంజుకున్న పాక్.. వరుస విజయాలతో దూసుకొచ్చింది. సౌతాఫ్రికాపై నెదర్లాండ్స్ గెలవడంతో లక్ కూడా పాక్ పక్షాన నిలిచింది. దాంతో సెమీస్ లో అడుగుపెట్టింది. తాజాగా సెమీఫైనల్లో న్యూజిలాండ్ (New Zealand)పై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి ఫైనల్లో ప్రవేశించింది. 153 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన పాక్.. 19.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే నష్టపోయి 153 పరుగులు చేసి ఫైనల్ కు అర్హత సాధించింది.

పాకిస్తాన్ ఓపెనర్లు మొహ్మద్ రిజ్వాన్ (43 బంతుల్లో 57; 5 ఫోర్లు), బాబర్ ఆజమ్ (42 బంతుల్లో 53; 7 ఫోర్లు) అర్ధ శతకాలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరు తొలి వికెట్ కు 105 పరుగులు జోడించారు. మొహమ్మద్ హరీస్ (26 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) తన వంతు పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో ఏ మాత్రం ఫామ్ లో లేని బాబర్ ఆజమ్ సరైన సమయంలో ఫామ్ లోకి వచ్చి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఇక 13 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ మళ్లీ టి20 ప్రపంచకప్ ఫైనల్లో ప్రవేశించింది. 2009లో చివరిసారిగా పాక్ ఫైనల్ ఆడింది. ఇక న్యూజిలాండ్ కు నిరాశ తప్పలేదు. ఫైనల్ చేరాలని కలలుగన్న కేన్ మామ టీంపై రిజ్వాన్, బాబర్ నీళ్లు చల్లారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 152 పరుగులు చేసింది. బిగ్ మ్యాచ్ ప్లేయర్ డారిల్ మిచెల్ (35 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) అద్భుత అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (42 బంతుల్లో 46; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనపించాడు. చివర్లో జేమ్స్ నీషమ్ (12 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్) భారీ షాట్లు ఆడటంలో విఫలం అయ్యాడు. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది రెండు వికెట్లతో సత్తా చాటాడు. మొహమ్మద్ నవాజ్ ఒక వికెట్ తీశాడు.

First published:

Tags: Babar Azam, Kane Williamson, New Zealand, Pakistan, T20 World Cup 2022

ఉత్తమ కథలు