టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2022) లో వరుణుడు అంతరాయం కొనసాగుతుంది. టీ20 వరల్డ్ కప్ 2022 సందడికి వరుణుడు బ్రేకులు వేస్తున్నాడు. కీలక సమయంలో ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్స్ తో పాటు అన్ని జట్లకు అడ్డంకిగా మారాడు. టీ20 ప్రపంచకప్ లో అక్టోబర్ 26 అంటే బుధవారం వరుణుడిదే పై చేయి గా మారింది. ఫస్ట్ మ్యాచులో ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లి.. ఐర్లాండ్ కు విజయాన్ని అందించాడు. ఇక, ఇవాళ జరగాల్సిన రెండో మ్యాచ్ కూడా వర్షార్పణం అయింది. అఫ్గానిస్తాన్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు అయింది.
మెల్బోర్న్‌లో ఎడతెగని వర్షం కారణంగా బుధవారం జరగాల్సిన మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇరు జట్లకు చెరో పాయింట్‌ను కేటాయించారు. తొలుత మ్యాచ్ ప్రారంభ సమాయానికి ముందునుంచే వర్షం కురుస్తుంది. టాస్ సమయానికల్లా అంతా సర్దుకుంటుంది అనుకున్నా వాన మాత్రం ఆగలేదు.
దీంతో ఇరు జట్ల కెప్టెన్ లు టాస్ కు కూడా రాలేదు. చివరికి మ్యాచ్ ను ఐదు ఓవర్లకు కుదించైనా నిర్వహిద్దామనుకుంటే అది కూడా సాధ్యపడకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. ఒక బంతి కూడా వేయకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు. ఈ ఫలితంతో మూడు పాయింట్లతో కివీస్ గ్రూప్ -1 లో టాప్ ప్లేసులో నిలిచింది. వారి నెట్ రన్ రేట్ లో కూడా ఎటువంటి మార్పు రాలేదు. +4.450 నెట్ రన్ రేట్ కివీస్ సొంతం. ఆస్ట్రేలియాపై తమ ఫస్ట్ మ్యాచులో భారీ తేడాతో గెలిచి ఈ రన్ రేట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
Rain plays spoilsport at the MCG ????
Afghanistan and New Zealand share points after the match is called off!#T20WorldCup | #NZvAFG pic.twitter.com/2Z8TmuX1gz — ICC (@ICC) October 26, 2022
ఇక, అఫ్గానిస్తాన్ కు ఒక పాయింట్ వచ్చిన ఆ జట్టు మాత్రం గ్రూప్ -1 లో ఆఖరిస్థానంలో నిలిచింది. అఫ్గాన్ తమ మొదటి మ్యాచులో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలతో గ్రూప్ -1లోని జట్ల పరిస్థితి మరింత డేంజరస్ గా మారింది. ప్రతి జట్టు కూడా తమ మిగతా మ్యాచుల్లో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక, ఈ రోజు టీ20 ప్రపంచకప్2022 (T20 World Cup 2022) లో సంచలనం నమోదైంది. ఇంగ్లండ్ (England) జట్టుకు భారీ షాక్ తగిలింది. మెల్బోర్న్ వేదికగా జరిగిన మ్యాచులో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఇంగ్లండ్ పై ఐదు పరుగుల తేడాతో ఐర్లాండ్ జట్టువిజయ కేతనం ఎగురవేసింది.
భారీ వర్షం అంతరాయం కలిగించిన మ్యాచులో ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 14.3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. అయితే డీఎల్ఎస్ ప్రకారం ఆ సమయంలో ఇంగ్లండ్ 110 పరుగులు చేయాల్సి ఉంది. కానీ, భారీ వర్షం ఎంట్రీ ఇవ్వడంతో ఐదు పరుగులు వెనుకబడింది ఇంగ్లీష్ జట్టు. దీంతో.. మ్యాచును ఆపిన అంపైర్లు.. ఐర్లాండ్ జట్టును విజేతగా ప్రకటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Cricket, Kane Williamson, New Zealand, Rashid Khan, T20 World Cup 2022