ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2022) క్వాలిఫయర్ మ్యాచులు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా గ్రూప్ -ఏలోని జట్లు నువ్వా-నేనా అన్నట్టు తలపడతున్నాయి. ఇక, లేటెస్ట్ గా శ్రీలంకను ఓడించిన నమీబియాను మట్టికరిపించింది నెదర్లాండ్స్ జట్టు (Namibia vs Netherlands). 122 పరుగులతో టార్గెట్ తో ఛేజింగ్ కు దిగిన నెదర్లాండ్స్ జట్టు 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. ఫస్ట్ టార్గెట్ ను అలవోకగా ఛేజ్ చేసేలా కన్పించిన నెదర్లాండ్స్ కు ఆఖరి ఓవర్లలో నమీబియా బౌలర్లు చుక్కలు చూపించారు.
కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో పరుగులు రావడం కష్టమైంది. అయితే, తుదివరకు పోరాడిన నెదర్లాండ్స్ నే విజయం వరించింది. నెదర్లాండ్స్ బ్యాటర్లలో విక్రమ జీత్ సింగ్ 39 పరుగులు, మ్యాక్స్ ఓడ్వ్ 35 పరుగులు, బ్యాస్ డి లీడ్ 30 పరుగులతో సత్తా చాటారు. నమీబియా బౌలర్లలో జేజే స్మిత్ రెండు వికెట్లతో సత్తా చాటగా.. బెర్నార్డ్, జాన్ ఫ్రైలింక్ చెరో వికెట్ తీశారు.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది నమీబియా. అయితే.. నెదర్లాండ్స్ బౌలర్లు ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించారు. దీంతో.. నమీబియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. 122 పరుగుల లక్ష్యంతో నెదర్లాండ్స్ బరిలోకి దిగింది. నమీబియా ఓపెనర్లు మైఖేల్ వాన్ లింగేన్, డివాన్ లా కాక్ తక్కువ పరుగులకే ఔట్ అయ్యారు. లింగేన్ 20 పరుగులు మాత్రమే చేయగా, డివాన్ లా కాక్ అయితే టిమ్ ప్రింగ్ల్ బౌలింగ్‌లో బాస్ డీ లీడ్‌కు క్యాచ్‌గా దొరికిపోయి డకౌట్‌గా వెనుదిరిగాడు.
Netherlands clinch yet another last-over thriller and go on top of Group A in First Round ???? ???? Scorecard: https://t.co/P8VXjFvCXX Head to our app and website to follow #T20WorldCup action ???? https://t.co/wGiqb2epBe pic.twitter.com/RizWq7BEUA
— T20 World Cup (@T20WorldCup) October 18, 2022
జాన్ ఫ్రైలింక్ 43 పరుగులతో రాణించాడు. బార్డ్ 19 పరుగులు, ఎరస్మస్ 16 పరుగులు, వైస్ 11, స్మిత్ 5 పరుగులు చేశారు. ఫలితంగా తక్కువ పరుగులకే నెదర్లాండ్స్ నమీబియాను కట్టడి చేయగలిగింది. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడ్ 2 వికెట్లతో రాణించగా.. టిమ్ ప్రింగిల్, అకర్మన్, వాన్ మికెరెన్, వాన్ డెర్ మెర్వేకు తలో వికెట్ దక్కింది. నమీబియా ఇప్పటికే శ్రీలంకను ఓడించి ఔరా అనిపించింది. నెదర్లాండ్స్ కూడా ఉత్కంఠభరిత మ్యాచ్‌లో యూఏఈని ఓడించింది. ఈ రెండు జట్లు తలపడటంతో ఏ టీం గెలుస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.
టీ20 వరల్డ్ కప్‌లో ప్రస్తుతం తొలి రౌండ్ పోటీలు జరుగబోతున్నాయి. ఇందులో 8 జట్లు పాల్గొంటాయి. జీలాంగ్, హోబర్ట్‌లో ఈ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. సూపర్-12లో ప్రస్తుతం 8 జట్లున్నాయి. మిగిలిన నాలుగు జట్ల కోసమే ఈ అర్హత మ్యాచ్‌లు. గ్రూప్-ఎలో నమీబియా, నెదర్లాండ్స్, శ్రీలంక, యూఏఈ ఉండగా.. గ్రూప్-బిలో స్కాట్లాండ్, ఐర్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వే పోటీపడుతున్నాయి. గ్రూప్‌లో ప్రతీ జట్టు ప్రత్యర్థులతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. రెండు గ్రూప్‌ల్లో నుంచి టాప్-2 జట్లు ఈనెల 22 నుంచి జరిగే సూపర్-12లో ప్రవేశిస్తాయి. నవంబరు 13న ఫైనల్ జరుగుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Sports, Sri Lanka, T20 World Cup 2022