హోమ్ /వార్తలు /క్రీడలు /

T20 World Cup 2022 : అయ్యో.. డూ ఆర్ డై మ్యాచులో నమీబియా ఓటమి.. సూపర్ -12కి నెదర్లాండ్స్..

T20 World Cup 2022 : అయ్యో.. డూ ఆర్ డై మ్యాచులో నమీబియా ఓటమి.. సూపర్ -12కి నెదర్లాండ్స్..

Photo Credit : ICC Twitter

Photo Credit : ICC Twitter

T20 World Cup 2022 : ఈ ఏడాది మెగాటోర్నీ ఫస్ట్ మ్యాచులోనే సంచలనం సృష్టించిన నమీబియా జట్టు డూ ఆర్ డై మ్యాచులో మాత్రం చతికిలపడింది. గెలవాల్సిన మ్యాచులో ఆ జట్టు యూఏఈ చేతిలో ఏడు పరుగుల తేడాతో ఓడిపోయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ 2022 (T20 World Cup 2022) టోర్నమెంట్‌ రసవత్తరంగా సాగుతోంది. తొలిరోజు నుంచే సంచలనాలు నమోదయ్యాయి. నమీబియా చేతిలో శ్రీలంక మట్టి దారుణ పరాజయాన్ని చవి చూసింది. ఆ తర్వాత స్కాట్లాండ్ చేతిలో రెండు సార్లు ఛాంపియన్ విండీస్ టీం ఖంగుతింది. సూపర్ -12కు క్వాలిఫై అవ్వడం కోసం ప్రతి జట్టు నువ్వా-నేనా అన్నట్టు పోరాడుతున్నాయి. సూపర్-12 దశకు చేరుకునేందుకు జట్లన్నీ చాలా కష్టపడుతున్నాయి. అయితే, ఈ ఏడాది మెగాటోర్నీ ఫస్ట్ మ్యాచులోనే సంచలనం సృష్టించిన నమీబియా జట్టు డూ ఆర్ డై మ్యాచులో చతికిలపడింది. గెలవాల్సిన మ్యాచులో ఆ జట్టు యూఏఈ చేతిలో ఏడు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఉత్కంఠగా చివరి ఓవర్ వరకు సాగిన మ్యాచులో చివరికి విజయం యూఏఈనే వరించింది.

149 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన నమీబియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 రన్స్ మాత్రమే చేసింది. డేవిడ్ వీస్ (36 బంతుల్లో 55 పరుగులు ; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ వృధా అయింది. ఓ దశలో 46 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ నమీబియా ఇన్నింగ్స్ ను వీస్ ముందుండి నడిపించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. అద్భుతమైన హిట్టింగ్ తో జట్టుకు విజయతీరాలకు వరకు తీసుకువచ్చాడు. అయితే, లాస్ట్ ఓవర్ లో భారీ షాట్ కు యత్నించి ఔటవ్వడంతో నమీబియా ఓటమి ఖరారు అయింది. యూఏఈ బౌలర్లలో బాసిల్ హామీద్, జహుర్ ఖాన్ చెరో రెండు వికెట్లతో దుమ్మురేపారు.

ఈ ఓటమితో నమీబియా జట్టుకు వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. క్వాలిఫయర్స్ గ్రూప్ -ఏ నుంచి శ్రీలంక, నెదర్లాండ్స్ జట్టు సూపర్ -12కి క్వాలిఫై అయ్యాయి. ఈ మ్యాచులో గెలిచి ఉంటే నమీబియా సూపర్ -12 కి వెళ్లేది. కానీ, నమీబియా ఓటమితో ఆ అదృష్టం నెదర్లాండ్స్ ని వరించింది.అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 148 పరుగులు చేసింది. మహ్మద్ వసీం (41 బంతుల్లో 50 పరుగులు ; 1 ఫోర్, 3 సిక్సర్లు), రిజ్వాన్ ( 29 బంతుల్లో 43 పరుగులు నాటౌట్ ; 3 ఫోర్లు, 1 సిక్సర్), బాసిల్ హామీద్ (14 బంతుల్లో 25 పరుగులు నాటౌట్ ; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. వీస్, స్కోల్డ్జ్ , బెన్ షికాంగో తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.

టీ20 వరల్డ్ కప్‌లో ప్రస్తుతం తొలి రౌండ్‌ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలు రేపటితో ముగుస్తాయి. జీలాంగ్‌, హోబర్ట్‌లో ఈ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. సూపర్‌-12లో ప్రస్తుతం 8 జట్లున్నాయి. మిగిలిన నాలుగు జట్ల కోసమే ఈ అర్హత మ్యాచ్‌లు. గ్రూప్‌-ఎలో నమీబియా, నెదర్లాండ్స్‌, శ్రీలంక, యూఏఈ ఉండగా.. గ్రూప్‌-బిలో స్కాట్లాండ్‌, ఐర్లాండ్‌, వెస్టిండీస్‌, జింబాబ్వే పోటీపడుతున్నాయి. గ్రూప్‌లో ప్రతీ జట్టు ప్రత్యర్థులతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. రెండు గ్రూప్‌ల్లో నుంచి టాప్‌-2 జట్లు ఈనెల 22 నుంచి జరిగే సూపర్‌-12లో ప్రవేశిస్తాయి. నవంబరు 13న ఫైనల్‌ జరుగుతుంది.

First published:

Tags: Cricket, T20 World Cup 2022, Team India, UAE

ఉత్తమ కథలు