హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs PAK : టీమిండియా యంగ్ గన్ అర్ష్ దీప్ కి సినిమా ఛాన్స్ ఇస్తానన్న టాలీవుడ్ డైరెక్టర్..

IND vs PAK : టీమిండియా యంగ్ గన్ అర్ష్ దీప్ కి సినిమా ఛాన్స్ ఇస్తానన్న టాలీవుడ్ డైరెక్టర్..

PC : BCCI

PC : BCCI

IND vs PAK : టీమిండియా బౌలర్ల దెబ్బకి 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది పాక్. ఆ జట్టు స్టార్ ప్లేయర్లు ఇద్దరు పెవిలియన్ బాట పట్టారు. యంగ్ బౌలర్ అర్ష్ దీప్ పాక్ స్టార్ ప్లేయర్స్ ని పెవిలియన్ బాట పట్టించాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. టీ20 ప్రపంచకప్ 2022లో దాయాదుల పోరు ప్రారంభమైంది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన పాక్ కు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించారు. స్వింగ్ బంతులతో పాక్ ఓపెనర్లను ఇబ్బందిపెట్టారు. టీమిండియా బ్యాటర్ల దెబ్బకి పాక్ కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. పాక్ కెప్టెన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజాం.. అర్ష్ దీప్ బౌలింగ్ లో డకౌటయ్యాడు. అర్ష్ దీప్ బౌలింగ్ లో బాబర్ ఆజాం ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. బాబర్ ఆజామ్ రివ్యూగా వెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో, 1 పరుగుకే తొలి వికెట్ కు కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే మహ్మద్ రిజ్వాన్ కూడా అర్ష్ దీప్ బౌలింగ్ లో భువనేశ్వర్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది పాక్. ఇక, పవర్ ప్లే ముగిసే సరికి ఆరు ఓవర్లలో పాక్ రెండు వికెట్లు కోల్పోయి 32 పరుగులు చేసింది.

అయితే, ఈ మెగా ఫైట్ లో పవర్ ప్లేలో అదరగొట్టిన అర్ష్ దీప్ సింగ్ కు సినిమా ఛాన్స్ ఇస్తానని ప్రకటించాడు డైరెక్టర్ కేవీ అనుదీప్, స్టార్ స్పోర్ట్స్ తెలుగు కామెంటరీ బాక్స్ లో ఎంట్రీ ఇచ్చిన అనుదీప్ తన దైన పంచులతో కాసేపు నవ్వించారు. ఈ సందర్భంలో అద్భుతంగా రాణించిన అర్ష్ దీప్ కు సినిమా ఛాన్స్ ఇస్తానని తెలిపాడు. అనుదీప్ అలా అనడంతో కామెంటరీ బాక్స్ నవ్వుల విరిశాయి. ఇక, కేవీ అనుదీప్ జాతిరత్నాలు, ప్రిన్స్ సినిమాలతో మంచి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ మ్యాచ్ కోసం భారత్ ఐదుగురు బ్యాటర్లు, ఒక ఆల్ రౌండర్, ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు సీమర్లతో బరిలోకి దిగనుంది. సీమర్లుగా షమీ, భునేశ్వర్, అర్ష్ దీప్ సింగ్ లను తీసుకుంది. హర్షల్ పటేల్ ను పక్కన పెట్టింది. ఇక స్పిన్నర్ విషయంలో అక్షర్ పటేల్ కు చోటు ఖాయం కాగా.. రెండో స్పిన్నర్ గా అశ్విన్ కు అవకాశం ఇచ్చింది. ఎక్స్ ట్రా బ్యాటర్ తో టీమిండియా బరిలోకి దిగుతుందని భావించినా.. ఇద్దరు స్పిన్నర్లతో ఆడేందుకే కోచ్ ద్రవిడ్ మొగ్గు చూపాడు.

తుది జట్లు

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, అశ్విన్, షమీ, భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్.

పాకిస్తాన్

బాబర్ ఆజమ్ (కెప్టెన్), రిజ్వాన్, షాన్ మసూద్, హైదర్ అలీ, నవాజ్, షాదాబ్ ఖాన్, అసిఫ్ అలీ, ఇఫ్తికర్, షాహీన్ అఫ్రిది, రవూఫ్, నసీం షా

First published:

Tags: Cricket, IND vs PAK, India VS Pakistan, Rohit sharma, T20 World Cup 2022, Virat kohli

ఉత్తమ కథలు