మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచులో టీమిండియా సూపర్ విక్టరీ కొట్టింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో 160 పరుగుల టార్గెట్ ను 20 ఓవర్లలో అందుకుంది. అయితే.. ఆఖరి ఓవర్ లో హై డ్రామా నడిచింది. కానీ, చివరికి కోహ్లీ మెరుపులతో టీమిండియా విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ ( 53 బంతుల్లో 82 పరుగులు నాటౌట్.. 6 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. హార్దిక్ పాండ్యా 37 బంతుల్లో 40 పరుగులు చేశాడు. రౌవూఫ్, నవాజ్ చెరో రెండు వికెట్లు తీశారు. టీమిండియా టాపార్డర్ బ్యాటర్లు చేతులేత్తేసినా.. కోహ్లీ, హార్దిక్ తమ పార్టనర్ షిప్ తో టీమిండియా ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఆ తర్వాత ఆఖర్లో కోహ్లీ తన విశ్వరూపం చూపించాడు. ఆఖరి ఓవర్లలో పరుగులు వరద పారించి టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఇక, మ్యాచ్ గెలిపించిన కోహ్లీని రోహిత్ భుజాలపై ఎత్తుకుని సంతోషంతో తిప్పాడు. మిగతా సహచర ప్లేయర్లు కూడా కోహ్లీని అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రోహిత్ కు కోహ్లీ పట్ల ఉన్న ప్రేమను ఈ వీడియో తెలియజేస్తుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక, 160 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాకుల మీద షాకులు తగిలాయి. ఏడు పరుగుల వద్ద కేఎల్ రాహుల్(4) కేఎల్ రాహుల్ పెవిలియన్ బాట పట్టాడు. పాక్ యంగ్ పేసర్ నసీమ్ షా.. రాహుల్ ని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే.. కెప్టెన్ రోహిత్ శర్మ (4) పరుగులు చేసి హారిస్ రౌవూఫ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో.. 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది టీమిండియా.
View this post on Instagram
ఆ తర్వాత రెండు బౌండరీలతో టచ్ లో కన్పించినా సూర్యకుమార్ యాదవ్ (15 పరుగులు) చేసి హారిస్ రౌవూఫ్ బౌలింగ్ లో మహ్మద్ రిజ్వాన్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో.. 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక, పాక్ బౌలర్లు కట్టదిట్టంగా బౌలింగ్ వేయడంతో టీమిండియా పవర్ ప్లే ఆరు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి కేవలం 31 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత అక్షర్ పటేల్ కూడా రనౌట్ అవ్వడంతో 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.
View this post on Instagram
ఇక, కష్టాల్లో పడ్డ టీమిండియా ఇన్నింగ్స్ ను విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా ఆదుకున్నారు. ఫస్ట్ ఓ నాలుగు ఓవర్లు ఈ ఇద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ఈ క్రమంలో ఈ ఇద్దరూ ఐదో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో టీమిండియా 15 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. దీంతో.. ఆఖరి ఐదు ఓవర్లలో టీమిండియాకు 60 పరుగులు అవసరమయ్యాయి.
అయితే.. 16,17 ఓవర్లు పాక్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో ఆఖరి మూడు ఓవర్లలో 48 పరుగులు అవసరమయ్యాయి. అయితే.. షాహీన్ షా వేసిన 18వ ఓవర్ లో మొదటి బంతికే ఫోర్ కొట్టిన కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. షాహీన్ షా వేసిన 18వ ఓవర్ లో 17 పరుగులు రావడంతో ఆఖరి రెండు ఓవర్లలో టీమిండియా విజయానికి 31 పరుగులు అవసరమయ్యాయి. ఇక, హారీస్ రౌవూఫ్ వేసిన 19వ ఓవర్ లో కోహ్లీ రెండు సిక్సర్లు బాదడంతో ఆఖరి ఓవర్ లో 16 పరుగులు అవసరమయ్యాయి.
అయితే.. మహ్మద్ నవాజ్ వేసిన ఆఖరి ఓవర్ మొదటి బంతికి హార్దిక్ ఔటయ్యాడు. హార్దిక్ 37 బంతుల్లో 40 పరుగులు చేశాడు. అయితే... ఆ తర్వాత సిక్సర్ బాదడంతో టీమిండియా స్కోరు రెండు బంతుల్లో రెండు పరుగులకు చేరింది. అయితే.. రెండు పరుగులు చేయాల్సిన సమయంలో దినేష్ కార్తీక్ ఔటవ్వడంతో ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. అయితే.. నవాజ్ వైడ్ వేయడంతో స్కోరు టై అయింది. ఇక, అశ్విన్ లాస్ట్ బంతి ఫోర్ కొట్టడంతో టీమిండియా విజయాన్ని సాధించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hardik Pandya, IND vs PAK, India VS Pakistan, Rohit sharma, T20 World Cup 2022, Virat kohli