మెల్బోర్న్ వేదికగా దాయాదుల మధ్య జరుగుతున్న పోరులో పాక్ జట్టు ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. ఫస్ట్ ఓవర్లలో టీమిండియా బౌలర్లు సత్తా చాటాగా.. మిడిల్ ఓవర్లలో అద్భుతంగా బ్యాటింగ్ చేశారు పాక్ బ్యాటర్లు ఇఫ్తికర్, షాన్ మసూద్. ఆఖర్లో షాహీన్ షా అఫ్రిది మెరుపులు మెరిపించాడు. దీంతో.. పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఇఫ్తికర్ అహ్మద్ (34 బంతుల్లో 51 పరుగులు; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), షాన్ మసూద్ ( 42 బంతుల్లో 52 పరుగులు నాటౌట్ ; 5 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఆఖర్లో అఫ్రిది ( 8 బంతుల్లో 16 పరుగులు ; ఫోర్, సిక్సర్ ) మెరుపులు మెరిపించాడు. హార్దిక్ పాండ్యా మూడు, అర్ష్ దీప్ మూడు వికెట్లతో సత్తా చాటారు. షమీ, భువీ చెరో వికెట్ తీశారు.
అయితే.. పాక్ బ్యాటింగ్ అప్పుడు ఇన్నింగ్స్ 15వ ఓవర్ లో టీమిండియా ఆటగాళ్లు రోహిత్, హార్దిక్ సహనం కోల్పోయారు. బూతులు కూడా తిట్టారు. హార్దిక్ అయితే F**K అంటూ వాడకూడని పదం కూడా వాడాడు. అయితే, అందుకు పెద్ద కారణమే ఉంది. అశ్విన్ వేసిన ఆ ఓవర్ నాలుగో బంతిని మసూద్ గాలిలోకి లేపాడు. క్యాచ్ కు వెళ్లాల్సిన ఆ బాల్.. స్పైడర్ కెమెరా (స్పైడీ) కు తగిలి.. ఫీల్డర్లు లేని ప్లేసులో పడింది. దీంతో.. కాసేపు అంపైర్లుతో వాదించాడు రోహిత్. హార్దిక్ అయితే.. సహనం కోల్పోయి బూతులు తిట్టాడు. ఇక, ఆ బంతిని అంపైర్లు డెడ్ బాల్ గా ప్రకటించారు. ఇక, షాన్ మసూద్ హాఫ్ సెంచరీ తో కీలక పరుగులు చేశాడు. అప్పుడు గానీ షాన్ ఔట్ అయి ఉంటే.. పాక్ ఇంకో పది పరుగులు తక్కువ చేసి ఉండేదని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.
So far Shan Masood has almost run himself out three times, went an inch from being caught by Ashwin (and was given out soft signal), was dropped by Ashwin, and now has been saved by Spider Cam.
— Jarrod Kimber (@ajarrodkimber) October 23, 2022
— Vaishnavi Iyer (@Vaishnaviiyer14) October 23, 2022
ఇక, టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన పాక్ కు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించారు. స్వింగ్ బంతులతో పాక్ ఓపెనర్లను ఇబ్బందిపెట్టారు. టీమిండియా బ్యాటర్ల దెబ్బకి పాక్ కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. పాక్ కెప్టెన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజాం.. అర్ష్ దీప్ బౌలింగ్ లో డకౌటయ్యాడు. అర్ష్ దీప్ బౌలింగ్ లో బాబర్ ఆజాం ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. బాబర్ ఆజామ్ రివ్యూగా వెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో, 1 పరుగుకే తొలి వికెట్ కు కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే మహ్మద్ రిజ్వాన్ కూడా అర్ష్ దీప్ బౌలింగ్ లో భువనేశ్వర్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది పాక్. ఇక, పవర్ ప్లే ముగిసే సరికి ఆరు ఓవర్లలో పాక్ రెండు వికెట్లు కోల్పోయి 32 పరుగులు చేసింది.
అయితే, ఆ తర్వాత పాక్ ఇన్నింగ్స్ ని షాన్ మసూద్, ఇఫ్తికర్ అహ్మద్ చక్కదిద్దారు. షాన్ మసూద్ యాంకరింగ్ ఇన్నింగ్స్ ఆడితే.. ఇఫ్తికర్ అహ్మద్ భారీ సిక్సర్లతో చెలరేగాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, ప్రమాదకరంగా మారుతున్న ఇఫ్తికర్ అహ్మద్ ని షమీ బోల్తా కొట్టించాడు. 34 బంతుల్లో 51 పరుగులు చేసిన ఇఫ్తికర్ షమీ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. అతని ఇన్నింగ్స్ లో రెండు ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఆ తర్వాత హార్దిక్ ఓకే ఓవర్ లో షాదాబ్ ఖాన్ (5), హైదర్ అలీ (2) పరుగులు ఔట్ చేశాడు. దీంతో.. పాక్ 98 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఇక, 15 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది.
ఆ తర్వాత కూడా హార్దిక్ పాండ్యా మహ్మద్ నవాజ్ (9) ను పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో, 115 పరుగులకు ఆరో వికెట్ కోల్పోయింది పాక్. ఆ కాసేపటికే అర్ష్ దీప్ బౌలింగ్ లో అసిఫ్ అలీ దినేష్ కార్తీక్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో, 120 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది దాయాది జట్టు.అయితే, ఆఖర్లో షాన్ మసూద్ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు మసూద్. ఆఖర్లో షాహీన్ షా అఫ్రిది కూడా బ్యాట్ ఝళిపించడంలో పాక్ ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది.
తుది జట్లు
టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, అశ్విన్, షమీ, భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్.
పాకిస్తాన్
బాబర్ ఆజమ్ (కెప్టెన్), రిజ్వాన్, షాన్ మసూద్, హైదర్ అలీ, నవాజ్, షాదాబ్ ఖాన్, అసిఫ్ అలీ, ఇఫ్తికర్, షాహీన్ అఫ్రిది, రవూఫ్, నసీం షా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Hardik Pandya, IND vs PAK, India VS Pakistan, Rohit sharma, T20 World Cup 2022, Virat kohli