160 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాకుల మీద షాకులు తగిలాయి. ఏడు పరుగుల వద్ద కేఎల్ రాహుల్(4) కేఎల్ రాహుల్ పెవిలియన్ బాట పట్టాడు. పాక్ యంగ్ పేసర్ నసీమ్ షా.. రాహుల్ ని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే.. కెప్టెన్ రోహిత్ శర్మ (4) పరుగులు చేసి హారిస్ రౌవూఫ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో.. 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఆ తర్వాత రెండు బౌండరీలతో టచ్ లో కన్పించినా సూర్యకుమార్ యాదవ్ (15 పరుగులు) చేసి హారిస్ రౌవూఫ్ బౌలింగ్ లో మహ్మద్ రిజ్వాన్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో.. 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఇక, పాక్ బౌలర్లు కట్టదిట్టంగా బౌలింగ్ వేయడంతో టీమిండియా పవర్ ప్లే ఆరు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి కేవలం 31 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత అక్షర్ పటేల్ కూడా రనౌట్ అవ్వడంతో 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.
T20 WC 2022. WICKET! 6.1: Axar Patel 2(3) Run Out Babar Azam, India 31/4 https://t.co/mc9useyHwY #INDvPAK #T20WorldCup
— BCCI (@BCCI) October 23, 2022
అంతకుముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన పాక్ జట్టు ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. ఫస్ట్ ఓవర్లలో టీమిండియా బౌలర్లు సత్తా చాటాగా.. మిడిల్ ఓవర్లలో అద్భుతంగా బ్యాటింగ్ చేశారు పాక్ బ్యాటర్లు ఇఫ్తికర్, షాన్ మసూద్. ఆఖర్లో షాహీన్ షా అఫ్రిది మెరుపులు మెరిపించాడు. దీంతో.. పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఇఫ్తికర్ అహ్మద్ (34 బంతుల్లో 51 పరుగులు; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), షాన్ మసూద్ ( 42 బంతుల్లో 52 పరుగులు నాటౌట్ ; 5 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఆఖర్లో అఫ్రిది ( 8 బంతుల్లో 16 పరుగులు ; ఫోర్, సిక్సర్ ) మెరుపులు మెరిపించాడు. హార్దిక్ పాండ్యా మూడు, అర్ష్ దీప్ మూడు వికెట్లతో సత్తా చాటారు. షమీ, భువీ చెరో వికెట్ తీశారు.
తుది జట్లు
టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, అశ్విన్, షమీ, భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్.
పాకిస్తాన్
బాబర్ ఆజమ్ (కెప్టెన్), రిజ్వాన్, షాన్ మసూద్, హైదర్ అలీ, నవాజ్, షాదాబ్ ఖాన్, అసిఫ్ అలీ, ఇఫ్తికర్, షాహీన్ అఫ్రిది, రవూఫ్, నసీం షా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, India VS Pakistan, KL Rahul, Rohit sharma, T20 World Cup 2022