హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs PAK : నో బాల్ రచ్చ.. టీమిండియా విజయంపై ఏడుపు షురూ.. ఆ మూడు పరుగులు ఎలా ఇస్తారంటే!

IND vs PAK : నో బాల్ రచ్చ.. టీమిండియా విజయంపై ఏడుపు షురూ.. ఆ మూడు పరుగులు ఎలా ఇస్తారంటే!

Photo Credit : Twitter

Photo Credit : Twitter

IND vs PAK : ఈ మ్యాచ్ చివరి ఓవర్‌లో పాక్ బౌలర్ మహ్మద్ నవాజ్ వేసిన నాలుగో బాల్‌ను అంపైర్లు ‘నో బాల్’గా ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహ్మద్ నవాజ్ ఈ బాల్‌ను ఫుల్ టాస్ వేశాడు. దీన్ని కోహ్లీ సిక్సర్‌గా మలిచాడు. అయితే, ఈ బాల్ నడుము ఎత్తులో రావడంతో అంపైర్లు దీన్ని ‘నో బాల్’గా ప్రకటించాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచులో టీమిండియా సూపర్ విక్టరీ కొట్టింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో 160 పరుగుల టార్గెట్ ను 20 ఓవర్లలో అందుకుంది. నాలుగు వికెట్ల తేడాతో గెలిచి టీ20 ప్రపంచకప్ లో బోణీ కొట్టింది. గతేడాది వరల్డ్ కప్ లో ఎదురైన పరాభవానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. విరాట్ కోహ్లీ ( 53 బంతుల్లో 82 పరుగులు నాటౌట్.. 6 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. హార్దిక్ పాండ్యా 37 బంతుల్లో 40 పరుగులు చేశాడు. రౌవూఫ్, నవాజ్ చెరో రెండు వికెట్లు తీశారు. టీమిండియా టాపార్డర్ బ్యాటర్లు చేతులేత్తేసినా.. కోహ్లీ, హార్దిక్ తమ పార్టనర్ షిప్ తో టీమిండియా ఇన్నింగ్స్ చక్కదిద్దారు.

అయితే, ఈ మ్యాచ్ చివరి ఓవర్‌లో పాక్ బౌలర్ మహ్మద్ నవాజ్ వేసిన నాలుగో బాల్‌ను అంపైర్లు ‘నో బాల్’గా ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహ్మద్ నవాజ్ ఈ బాల్‌ను ఫుల్ టాస్ వేశాడు. దీన్ని కోహ్లీ సిక్సర్‌గా మలిచాడు. అయితే, ఈ బాల్ నడుము ఎత్తులో రావడంతో అంపైర్లు దీన్ని ‘నో బాల్’గా ప్రకటించాడు. దీనిపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అప్పుడే పాక్ క్రీడాకారులు దీన్ని వ్యతిరేకించారు. పాక్ టీం సభ్యులంతా ఈ నిర్ణయంపై అంపైర్‌ను ప్రశ్నించారు. కానీ, అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. నో బాల్ తర్వాతి బంతి ఫ్రీ హిట్‌గా ఉంటుంది. ఈ బంతికి బ్యాటర్ బౌల్డ్ అయినా, అది ఔట్ కిందకు రాదు. దీన్ని కోహ్లీ చక్కగా వినియోగించుకున్నాడు.

ఫ్రీ హిట్ బంతికి కోహ్లీ బౌల్డ్ అయినా, ఆ బంతి బౌండరీ వైపు దూసుకెళ్లింది. దీంతో కోహ్లీ మూడు పరుగులు తీశాడు. ఈ రెండు బంతులే భారత విజయంలో కీలక పాత్ర పోషించాయి. అయితే, నడుము ఎత్తులో బంతి వచ్చినప్పుడు అంపైర్లు రివ్యూ తీసుకోకుండా, నో బాల్ అని ఎలా ప్రకటిస్తారని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హాగ్ ట్విట్టర్లో ప్రశ్నించాడు. అలాగే ఫ్రీ హిట్ బంతికి కోహ్లీ బౌల్డ్ అయితే, దాన్ని డెడ్ బాల్‌గా ఎందుకు ప్రకటించలేదని బ్రాడ్ హాగ్ అన్నాడు. కాగా, బాల్ నడుముకంటే ఎక్కువ ఎత్తులో వస్తేనే దాన్ని నో బాల్ అంటారని కొందరు అంటుంటే, అంపైర్లదే తుది నిర్ణయం అని ఇంకొందరు అంటున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై క్రికెట్ విశ్లేషకుల్లో చర్చ జరుగుతోంది.

అయితే, ఐసీసీ నిబంధనల ప్రకారం ఫ్రీ హిట్ గా స్టంప్స్ కి తగిలి పరుగులు ఇస్తే వాటి 'బై' స్ గా ప్రకటిస్తారు. ఒకవేళ బ్యాటర్ బ్యాట్ కి తగిలి బౌల్డ్ అయ్యి.. ఆ తర్వాత బౌండరికీ వెళితే.. ఆ పరుగులు బ్యాటర్ ఖాతాలోకి వెళతాయి. ఈ రూల్స్ తెలుసుకోకుంటే టీమిండియా మీద పడి ఏడుస్తున్నారంటూ  క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.

First published:

Tags: Bcci, India VS Pakistan, T20 World Cup 2022, Team India, Virat kohli

ఉత్తమ కథలు