హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs PAK : ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీసిన హార్దిక్.. 15 ఓవర్లలో పాక్ స్కోర్ ఎంతంటే

IND vs PAK : ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీసిన హార్దిక్.. 15 ఓవర్లలో పాక్ స్కోర్ ఎంతంటే

Team India

Team India

IND vs PAK : టీమిండియా బౌలర్ల దెబ్బకి 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది పాక్. ఆ జట్టు స్టార్ ప్లేయర్లు ఇద్దరు పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత హార్దిక్ ఓకే ఓవర్ లో రెండు వికెట్ల తీసి మరింత దెబ్బ కొట్టాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. టీ20 ప్రపంచకప్ 2022లో దాయాదుల పోరు ప్రారంభమైంది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన పాక్ కు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించారు. స్వింగ్ బంతులతో పాక్ ఓపెనర్లను ఇబ్బందిపెట్టారు. టీమిండియా బ్యాటర్ల దెబ్బకి పాక్ కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. పాక్ కెప్టెన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజాం.. అర్ష్ దీప్ బౌలింగ్ లో డకౌటయ్యాడు. అర్ష్ దీప్ బౌలింగ్ లో బాబర్ ఆజాం ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. బాబర్ ఆజామ్ రివ్యూగా వెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో, 1 పరుగుకే తొలి వికెట్ కు కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే మహ్మద్ రిజ్వాన్ కూడా అర్ష్ దీప్ బౌలింగ్ లో భువనేశ్వర్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది పాక్. ఇక, పవర్ ప్లే ముగిసే సరికి ఆరు ఓవర్లలో పాక్ రెండు వికెట్లు కోల్పోయి 32 పరుగులు చేసింది.

అయితే, ఆ తర్వాత పాక్ ఇన్నింగ్స్ ని షాన్ మసూద్, ఇఫ్తికర్ అహ్మద్ చక్కదిద్దారు. షాన్ మసూద్ యాంకరింగ్ ఇన్నింగ్స్ ఆడితే.. ఇఫ్తికర్ అహ్మద్ భారీ సిక్సర్లతో చెలరేగాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, ప్రమాదకరంగా మారుతున్న ఇఫ్తికర్ అహ్మద్ ని షమీ బోల్తా కొట్టించాడు. 34 బంతుల్లో 51 పరుగులు చేసిన ఇఫ్తికర్ షమీ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. అతని ఇన్నింగ్స్ లో రెండు ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఆ తర్వాత హార్దిక్ ఓకే ఓవర్ లో షాదాబ్ ఖాన్ (5), హైదర్ అలీ (2) పరుగులు ఔట్ చేశాడు. దీంతో.. పాక్ 98 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఇక, 15 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది.

ఇక ఈ మ్యాచ్ కోసం భారత్ ఐదుగురు బ్యాటర్లు, ఒక ఆల్ రౌండర్, ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు సీమర్లతో బరిలోకి దిగనుంది. సీమర్లుగా షమీ, భునేశ్వర్, అర్ష్ దీప్ సింగ్ లను తీసుకుంది. హర్షల్ పటేల్ ను పక్కన పెట్టింది. ఇక స్పిన్నర్ విషయంలో అక్షర్ పటేల్ కు చోటు ఖాయం కాగా.. రెండో స్పిన్నర్ గా అశ్విన్ కు అవకాశం ఇచ్చింది. ఎక్స్ ట్రా బ్యాటర్ తో టీమిండియా బరిలోకి దిగుతుందని భావించినా.. ఇద్దరు స్పిన్నర్లతో ఆడేందుకే కోచ్ ద్రవిడ్ మొగ్గు చూపాడు.

తుది జట్లు

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, అశ్విన్, షమీ, భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్.

పాకిస్తాన్

బాబర్ ఆజమ్ (కెప్టెన్), రిజ్వాన్, షాన్ మసూద్, హైదర్ అలీ, నవాజ్, షాదాబ్ ఖాన్, అసిఫ్ అలీ, ఇఫ్తికర్, షాహీన్ అఫ్రిది, రవూఫ్, నసీం షా

First published:

Tags: Cricket, Hardik Pandya, IND vs PAK, India VS Pakistan, Rohit sharma, T20 World Cup 2022

ఉత్తమ కథలు