టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించారు. స్వింగ్ బంతులతో పాక్ ఓపెనర్లను ఇబ్బందిపెట్టారు. టీమిండియా బ్యాటర్ల దెబ్బకి పాక్ కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. పాక్ కెప్టెన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజాం.. అర్ష్ దీప్ బౌలింగ్ లో డకౌటయ్యాడు. అర్ష్ దీప్ బౌలింగ్ లో బాబర్ ఆజాం ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. బాబర్ ఆజామ్ రివ్యూగా వెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో, 1 పరుగుకే తొలి వికెట్ కు కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే మహ్మద్ రిజ్వాన్ కూడా అర్ష్ దీప్ బౌలింగ్ లో భువనేశ్వర్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది పాక్. ఇక, పవర్ ప్లే ముగిసే సరికి ఆరు ఓవర్లలో పాక్ రెండు వికెట్లు కోల్పోయి 32 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో షాన్ మసూద్ ( 19 పరుగులు), ఇఫ్తికర్ అహ్మద్ ( 7 పరుగులు) ఉన్నారు.
గత మూడు రోజులుగా ఎంసీజీ వికెట్ ను కవర్స్ తో కప్పి ఉంచారు. అదే సమయంలో పిచ్ పై పచ్చిక ఎక్కువగా ఉంది. దీంతో.. ఆరంభంలో టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించారు పాకిస్తాన్ బ్యాటర్లకు. అయితే వర్షం పడే అవకాశాలు ఉండటం.. గ్రాస్ ఉండటంతో రోహిత్ ఫీల్డింగ్ కు మొగ్గు చూపాడు.
In the air & taken in the deep by @BhuviOfficial! ???? ????@arshdeepsinghh scalps his 2⃣nd wicket as he dismisses Mohammad Rizwan. ???? ???? Follow the match ▶️ https://t.co/mc9useyHwY #TeamIndia | #T20WorldCup | #INDvPAK pic.twitter.com/fr7MKHFUTE
— BCCI (@BCCI) October 23, 2022
ఇక ఈ మ్యాచ్ కోసం భారత్ ఐదుగురు బ్యాటర్లు, ఒక ఆల్ రౌండర్, ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు సీమర్లతో బరిలోకి దిగనుంది. సీమర్లుగా షమీ, భునేశ్వర్, అర్ష్ దీప్ సింగ్ లను తీసుకుంది. హర్షల్ పటేల్ ను పక్కన పెట్టింది. ఇక స్పిన్నర్ విషయంలో అక్షర్ పటేల్ కు చోటు ఖాయం కాగా.. రెండో స్పిన్నర్ గా అశ్విన్ కు అవకాశం ఇచ్చింది. ఎక్స్ ట్రా బ్యాటర్ తో టీమిండియా బరిలోకి దిగుతుందని భావించినా.. ఇద్దరు స్పిన్నర్లతో ఆడేందుకే కోచ్ ద్రవిడ్ మొగ్గు చూపాడు.
తుది జట్లు
టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, అశ్విన్, షమీ, భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్.
పాకిస్తాన్
బాబర్ ఆజమ్ (కెప్టెన్), రిజ్వాన్, షాన్ మసూద్, హైదర్ అలీ, నవాజ్, షాదాబ్ ఖాన్, అసిఫ్ అలీ, ఇఫ్తికర్, షాహీన్ అఫ్రిది, రవూఫ్, నసీం షా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IND vs PAK, India VS Pakistan, Rohit sharma, T20 World Cup 2022, Virat kohli