IRE vs SCO : గతంలో పాకిస్తాన్ (Pakistan), ఇంగ్లండ్ (England) లాంటి జట్లకు షాకిచ్చింది. తనదైన రోజున ఎంతటి పటిష్ట జట్టునైనా ఓడించగల సత్తా ఉన్న టీంగా అందరిచేత మన్నలను అందుకుంది. ఈ టి20 ప్రపంచకప్ (T20 World Cup)లో కూడా సూపర్ 12 వరకు ఖచ్చితంగా చేరుకుంటుందని అంతా అనుకున్నారు. అయితే జింబాబ్వే (Zimbabwe)తో జరిగిన పోరులో ఊహించని విధంగా ఓడిన ఐర్లాండ్ జట్టు అందరినీ షాక్ కు గురి చేసింది. ఇక స్కాట్లాండ్ (Scotland)తో డూ ఆర్ డై మ్యాచ్ లో 177 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది. ఒక దశలో 61 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే కర్టీస్ క్యాంపెర్ (32 బంతుల్లో 72 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచిత పోరాటంతో ఐర్లాండ్ ను గెలిపించాడు. జార్జ్ డాక్ రెల్ (27 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి అజేయమైన ఐదో వికెట్ కు 119 పరుగులు జోడించి టీంను గెలిపించాడు. 19 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 180 పరుగులు చేసి ఐర్లాండ్ నెగ్గింది. ఈ మ్యాచ్ లో విజయం సాధిండచంతో ఐర్లాండ్ తన సూపర్ 12 ఆశలను సజీవంగా ఉంచుకుంది.
సూపర్ క్యాంపెర్
గీలాంగ్ పిచ్ రెండోసారి బ్యాటింగ్ కు చాలా కష్టంగా ఉంటుంది. అందులోనూ 177 పరుగుల లక్ష్యం ఉండటంతో ఐర్లాండ్ ఓడిపోతుందని అంతా అనుకున్నారు. అదే నిజయం అన్నట్లు పాల్ స్టిర్లింగ్ (8), కెప్టెన్ ఆండీ (14), టక్కర్ (20), హ్యారీ టెక్టార్ (14) వికెట్లను వెంట వెంటే కోల్పోయింది. దాంతో 61 పరుగులకే 4 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఈ దశలో క్రీజులో జత కలిసిన క్యాంపెర్, డాక్ రెల్ అద్భుత బ్యాటింగ్ తో అదరగొట్టారు. మొదట్లో సింగిల్స్ తో పాటు డబుల్స్ తీస్తూ స్కోరు బోర్డు వేగం తగ్గకుండా జాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత భారీ షాట్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. దాదాపు ఓటమి ఖాయం అనుకున్న స్థితిలో వీరి వీరోచిత పోరాటం స్కాట్లాండ్ ను ఓడించేలా చేసింది. ఈ మ్యాచ్ లో గెలిచి ఉంటే స్కాట్లాండ్ దాదాపుగా సూపర్ 12కు చేరిండేది.
Curtis Campher and George Dockrell, take a bow!
Their extraordinary partnership helps Ireland to a crucial win ????#T20WorldCup | #SCOvIRE | ???? https://t.co/HAdDN37wJH pic.twitter.com/25bD0Rg5Hb — ICC (@ICC) October 19, 2022
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఓపెనర్ మైకెల్ జోన్స్ (55 బంతుల్లో 86; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ శతకంతో అదరగొట్టాడు. కెప్టెన్ రిచీ (27 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించడంతో స్కాట్లాండ్ భారీ స్కోరును అందుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: England, Pakistan, Scotland, T20 World Cup 2022