హోమ్ /వార్తలు /క్రీడలు /

T20 World Cup 2022 : టీమిండియా ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. ఇక, థియేటర్లు దద్దరిల్లి పోవాల్సిందే!

T20 World Cup 2022 : టీమిండియా ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. ఇక, థియేటర్లు దద్దరిల్లి పోవాల్సిందే!

T20 World Cup 2022 : టీమిండియా ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. ఇక, థియేటర్లు దద్దరిల్లి పోవాల్సిందే!

T20 World Cup 2022 : టీమిండియా ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. ఇక, థియేటర్లు దద్దరిల్లి పోవాల్సిందే!

T20 World Cup 2022 : అయితే, ఆస్ట్రేలియా వెళ్లి మ్యాచ్ చూడలేని క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఇప్పటి వరకు మొబైల్​, టీవీ స్క్రీన్లకే పరిమితమైన క్రికెట్ మ్యాచ్​లను భారీ తెరలపై చూసే అవకాశం కల్పించనుంది ఐనాక్స్ సంస్థ.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

క్రికెట్ ప్రేమికులకు అసలు సిసలు మజా అందించడానికి మరి కొద్ది రోజుల్లో టీ20 మహాసంగ్రామం మొదలు కానుంది. ఆస్ట్రేలియా వేదికగా ధనాధన్ టోర్నీ టీ20 వరల్డ్ కప్ 2022 (T20 World Cup 2022)ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం ఇప్పటికే అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. కొన్ని జట్లు ప్రాక్టీస్ లో నిమగ్నమైతే.. మరికొన్ని టీమ్స్.. ఇతర జట్లతో సిరీస్ లు ఆడుతూ కావాల్సినంత ప్రాక్టీస్ సంపాదించుకుంటున్నాయి. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియా (Australia) వేదికగా టి20 ప్రపంచకప్ (T20 World Cup) జరగనుంది. 15 ఏళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న టి20 ప్రపంచకప్ ను ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలగా టీమిండియా (Team India) ఉంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో ఈ నెల 23న జరిగే మ్యాచ్ తో భారత్ తన ప్రపంచకప్ టైటిల్ వేటను ఆరంభిస్తుంది. ఈ సూపర్ ఫైట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే, ఆస్ట్రేలియా వెళ్లి మ్యాచ్ చూడలేని క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఇప్పటి వరకు మొబైల్​, టీవీ స్క్రీన్లకే పరిమితమైన క్రికెట్ మ్యాచ్​లను భారీ తెరలపై చూసే అవకాశం కల్పించనుంది ఐనాక్స్ సంస్థ. ఈ మేరకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఐనాక్స్ లీజర్ ఒక ప్రకటనలో తెలిపింది.

టీమిండియా ఆడబోయే అన్ని గ్రూప్ మ్యాచ్‌లను ఐనాక్స్ ప్రదర్శిస్తుంది, అక్టోబరు 23న దాయాది పాకిస్తాన్ తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ నుంచే ఐనాక్స్ స్ట్రీమింగ్ ప్రారంభిస్తుంది. ఈ లైవ్ మ్యాచ్స్ 25 కంటే ఎక్కువ నగరాల్లో ఉన్న ఐనాక్స్ మల్టీప్లెక్స్‌లలో ప్రసారం కానున్నాయి. దేశవ్యాప్తంగా 74 నగరాల్లో ఐనాక్స్ కు 165 మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. అవి 705 స్క్రీన్‌లతో 1.57 లక్షల సీటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

ఇది కూడా చదవండి : ఒకప్పుడు ఐపీఎల్‌లో 10 లక్షలకు అమ్ముడుపోని ఆటగాడు.. ఇప్పుడు కోట్లకు అధిపతి!

దేశంలోనే అతిపెద్ద మల్టీఫెక్స్ చైన్ ను ఈ ఏడాది మార్చిలో పీవీఆర్ సంస్థతో కలిసి ఏర్పాటు చేసింది ఐనాక్స్. ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ యొక్క ఎనిమిదవ ఎడిషన్ అక్టోబర్ 16 నుండి ప్రారంభం కానుంది. సూపర్ 12 దశ అక్టోబర్ 22 న మొదలవుతుంది. ఫైనల్ నవంబర్ 13న మెల్బోర్న్‌లో జరుగనుంది. ఇలా మ్యాచ్ లను థియేటర్ లో పెద్ద పెద్ద స్క్రీన్ పై చూస్తే.. క్రికెట్ మైదానంలో మ్యాచులను చూస్తున్న అనుభూతి కలుగుతుందని ఐనాక్స్ సంస్థ చెబుతోంది. మ్యాచ్ వీక్షించడానికి టికెట్ ధర.. నగరాన్ని బట్టి ఒకొక్క విధంగా ఉండవచ్చునని.. రూ.200 నుంచి రూ.500 వరకు ఉంటుందని చెబుతున్నారు.

First published:

Tags: India VS Pakistan, Multiplex, T20 World Cup 2022, Team India, Theaters

ఉత్తమ కథలు