టీ20 ప్రపంచకప్ 2022 (T20 World Cup 2022) రంగం సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియా (Australia) వేదికగా జరుగుతున్న ఈ మెగా ఈవెంట్ కోసం ఐసీసీ ఏర్పాట్లన్నీ వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్ టికెట్లు అమ్మకానికి ఉంచినట్లు (ICC) తెలిపింది. ఈ టికెట్ ధరలను పిల్లలకు 5 డాలర్లు(రూ.374), పెద్దలకు 20 డాలర్లుగా (దాదాపు రూ.1495) నిర్ణయించినట్లు పేర్కొంది. t20worldcup.com వైబ్సైట్లో సోమవారం నుంచి టికెట్లు అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. టీ 20 ప్రపంచకప్‌నకు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి.అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు సూపర్ 12లో ఉన్నాయి. నమీబియా, స్కాట్లాండ్, శ్రీలంక, వెస్టిండీస్ క్వాలిఫయర్స్ ఆడనున్నాయి.
ఇక, ఈ మెగా టోర్నీలో టీమిండియా మళ్లీ పాకిస్థాన్‌తో తమ టైటిల్ వేటను ప్రారంభించనుంది. ఒకే గ్రూప్‌లో ఉన్న భారత్, పాక్ జట్లు అక్టోబర్ 23న తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లన్నీ అప్పుడే అమ్ముడయ్యాయి. టోర్నీకి ఇంకా 8 నెలల సమయం ఉన్నా.. దాయాదీ పోరును తిలకించేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఆన్లైన్ వేదికగా టికెట్లన్నీ కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ విషయం హాట్‌టాపిక్‌గా మారింది.
భారత్ xపాక్ పోరు క్రికెట్‌కు బ్రాండ్ అంబాసిడర్ లాంటిదని, దాయాదీల సమరాన్ని మించినది ఏదీ లేదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఐసీసీ కూడా ఇదే విషయాన్ని క్యాష్ చేసుకుంటుందని, ప్రతీ మెగా టోర్నీల్లో భారత్, పాక్ మ్యాచ్ ఉండేలా షెడ్యూల్ చేస్తుందని ట్వీట్ చేస్తున్నారు.
𝙏𝙃𝙄𝙎 𝙄𝙎 𝙏𝙃𝙀 𝘽𝙄𝙂 𝙏𝙄𝙈𝙀 !
Tickets are on sale now for the ICC Men's T20 World Cup Australia 2022! 🎟️
ఇక దుబాయ్ వేదికగా జరిగిన 2021 టీ20 ప్రపంచకప్‌లోనూ భారత్.. పాక్‌తోనే తొలి మ్యాచ్ ఆడింది. ఎన్నడూ లేని విధంగా ఈ మ్యాచ్‌లో చిత్తుగా ఓడి.. టోర్నీలో కనీసం సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. ఈ సారైనా గత ఓటమికి రివేంజ్ తీసుకోవాలని భావిస్తోంది.
ఎప్పటిలానే ఈ వరల్డ్‌కప్ కూడా నాకౌట్ స్టేజ్ పద్దతిలో జరగనుంది. సూపర్ 12లో ఫార్మాట్లో లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందు కోసం ఇప్పటికే 8 జట్లు టీ20 ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా సూపర్ 12కు అర్హత సాధించాయి.
మిగిలిన 4 స్థానాల కోసం తొలి రౌండ్లో ఆయా జట్లను రెండు గ్రూప్‌లుగా విడదీసి క్వాలిఫైయర్ మ్యాచ్‌లు ఆడించనున్నారు. అక్టోబర్ 16 నుంచి 21 మధ్య తొలి రౌండ్ పోటీలు జరగనుండగా.. 22 నుంచి సూపర్ 12 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. నవంబర్ 6న ముగుస్తాయి. నవంబర్ 9, 10న సెమీ ఫైనల్ మ్యాచ్‌లు, 13న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
గ్రూప్ 1లో ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్‌తోపాటు తొలి రౌండ్‌లోని గ్రూప్ A విజేత, గ్రూప్ B రన్నరప్ ఉండనున్నాయి. ఇక గ్రూపు 2లో భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తోపాటు తొలి రౌండ్‌లోని గ్రూప్ B విజేత, గ్రూప్ A రన్నరఫ్ ఉండనున్నాయి. తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. మెల్బోర్న్ వేదికగా అక్టోబర్ 23న ఈ మ్యాచ్ జరగనుంది. దీంతో, ఈ హై ఓల్టేజ్ పోరు కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.