T20 World Cup 2022 : క్రికెట్ లో స్లో ఓవర్ రేట్ (Slow Over Rate) కు ప్రత్యేక స్థానం ఉంది. నిర్ణీత సమయంలోగా ఓవర్ల కోటాను పూర్తి చేయకపోతే ఆ జట్టు కెప్టెన్ మ్యాచ్ ఫీజులో కోత విధించేవారు. అయితే ఈ రూల్ లో ఐసీసీ (ICC) మార్పులు తెచ్చింది. మ్యాచ్ లో ఏ జట్టయినా స్లో ఓవర్ రేట్ ను నమోదు చేస్తే.. ఆ జట్టు కెప్టెన్ పై జరిమానా విధించకుండా వేరే విధంగా సదరు జట్టును పనిష్ చేసేలా కొత్త నిబంధనను తీసుకొచ్చింది. పవర్ ప్లేలో 30 గజాల సర్కిల్ బయట కేవలం ఇద్దరు మాత్రమే ఉంటారు. పవర్ ప్లే ముగిసిన తర్వాత 5 గురు ఉంటారు. అయితే స్లో ఓవర్ రేట్ లో ఈ ఫీల్డింగ్ నిబంధనల్లో ఐసీసీ మార్పులు తెచ్చింది.
ఇది కూడా చదవండి : ‘30 శాతం మాత్రమే’.. టీమిండియాపై వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్
ఒక జట్టు నిర్ణీత సమయానికి రెండు ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేస్తే.. అప్పుడు ఆ రెండు ఓవర్ల పాటు సదరు ఫీల్డింగ్ చేసే జట్టు 30 గజాల సర్కిల్ బయట నలుగురితోనే ఫీల్డింగ్ చేయాల్సి ఉంటుంది. అది బ్యాటర్లకు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే దీనిని తప్పించుకోవడానికి ఆస్ట్రేలియా ఒక ఉపాయాన్ని కనిపెట్టింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పవర్ ప్లేలో బౌండరీ దగ్గర కేవలం 2 మాత్రమే ఫీల్డర్లు ఉంటారు. అటువంటి సమయంలో బంతి బౌండరీకి వెళితే.. దానిని తీసుకునేందుకు కొంచెం సమయం పడుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఆస్ట్రేలియా వినూత్న ఆలోచన చేసింది. అదేంటంటే ఆస్ట్రేలియా జట్టు ప్లేయింగ్ ఎలెవన్ లో లేని ఇతర ప్లేయర్లు.. సపోర్టింగ్ స్టాఫ్ బౌండరీల దగ్గర ఉంటూ.. బంతి బౌండరీ చేరగానే వెంటనే దానిని బౌలర్ కు అందేలా చేస్తారు. దీని వల్ల 10 నుంచి 20 సెకన్ల పాటు సమయం ఆస్ట్రేలియాకు కలిసి వస్తుంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ అగర్ కూడా పేర్కొన్నాడు.
A clever ploy from the Aussies who are keen to avoid the fielding restriction penalty if overs aren't bowled in time during this #T20WorldCup pic.twitter.com/5e73KABQcd
— cricket.com.au (@cricketcomau) October 19, 2022
వాస్తవానికి ఆస్ట్రేలియా జట్టు ఎక్కువగా పేసర్ల మీద ఆధారపడి ఉంటుంది. ఒకే ఒక స్పిన్నర్ బౌలింగ్ చేస్తాడు. దాంతో నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయడంలో ఆస్ట్రేలియాకు ఇబ్బందులు తప్పేలా లేవు. అయితే ఈ ఆలోచనతో స్లో ఓవర్ రేట్ ను తప్పించుకుంటామని ఆస్ట్రేలియా దీమా వ్యక్తం చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, David Warner, England vs Australia, Glenn Maxwell, ICC, Pat cummins, Steve smith, T20 World Cup 2022, Team India