Virat Kohli : టీమిండియా (Team India) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి సంబంధించిన ప్రతి విషయంపై అతడి అభిమానులు చాాలా ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. తాగే వాటర్ నుంచి అతడు చేసే కసరత్తుల దాకా.. అలాగే అతడి సంపాదన నుంచి వేసుకునే బట్టల దాకా కోహ్లీకి సంబంధించిన ప్రతి చిన్ని విషయం కూడా అందరినీ ఆకర్షిస్తుంది. ఇక తాజాగా కోహ్లీకి సంబంధించిన విషయం ఒకటి బయటకు వచ్చింది. టి20 ప్రపంచకప్ (T20 World cup) 2022 కోసం ప్రస్తుతం కోహ్లీ ఆస్ట్రేలియాలో ఉన్న విషయం తెలిసిందే. అయితే అతడు అక్కడ ఉన్న హోటల్ రూంకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో కోహ్లీ రూం లోపల ఎలా ఉంటుందో తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక వీడియోలో కోహ్లీకి డ్రెస్సింగ్ కు సంబంధించిన వస్తువులు ఉన్నాయి. అదే సమయంలో కోహ్లీ రూంలో బెడ్ పై దేవుడి విగ్రహాలు కూడా ఉండటం విశేషం. అయితే తన రూంకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో కోహ్లీ కాస్త అసహనానికి గురయ్యాడు. తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన బాధను వ్యక్తం చేశాడు. ‘తన అభిమాన క్రికెటర్లను చూడటం.. వారిని కలవడం అభిమానులకు అనందాన్ని ఇస్తుంది. అభిమానులను కలిసేందుకు తాము (భారత క్రికెటర్లు) కూడా ఆసక్తి చూపుతాం. అయితే ఈ వీడియో (కోహ్లీ రూం) మాత్రం నన్ను బాధ పెట్టేలా ఉంది. నా గదిలో కూడా నాకు ప్రైవసీ లేకుండా పోయింది. నా గదిలోనే నాకు ప్రైవసీ లేకపోతే ఇక ఎక్కడ దొరుకుతుంది. ఇటువంటి అభిమానాన్ని నేను సపోర్ట చేయలేను. ఇతరుల ప్రైవసీని గౌరవించండి వారిని వస్తువులా చూడకండి’ అంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో వీడియోతో పాటు కామెంట్ చేశాడు.
View this post on Instagram
టి20 ప్రపంచకప్ లో కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. తొలి రెండు మ్యాచ్ ల్లో అర్ధ సెంచరీలతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో మాత్రం 12 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. ఈ మ్యాచ్ లో ఆడకపోయినా టి20 ప్రపంచకప్ లలో వెయ్యి పరుగులు చేసిన తొలి టీమిండియా బ్యాటర్ గా కోహ్లీ నిలిచాడు. ప్రస్తుతం కోహ్లీ 1,001 పరుగులు చేశాడు. టి20 ప్రపంచకప్ లలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో శ్రీలంక మాజీ బ్యాటర్ మహేలా జయవర్దనే ఉన్నాడు. అతడు 1,016 పరుగులు చేశాడు. కోహ్లీ మరో 16 పరుగులు చేస్తే జయవర్దనే రికార్డును తన పేరిట లిఖించుకుంటాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Privacy, T20 World Cup 2022, Team India, Virat kohli