IND vs ZIM : టి20 ప్రపంచకప్ (T20 World cup) 2022లో టీమిండియా (Team India) కీలక పోరుకు సిద్ధమైంది. గ్రూప్ ‘2’ నుంచి సెమీఫైనల్ కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన పోరులో జింబాబ్వే (Zimbabwe)తో రోహిత్ శర్మ (Rohit Sharma) సేన అమీతుమీకి సిద్ధమైంది. మెల్ బోర్న్ (Melbourne) వేదికగా ఆదివారం మధ్యాహ్నం గం. 1.30 లకు ఆరంభమయ్యే ఈ మ్యాచ్ లో భారత్ నెగ్గితే ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా సెమీస్ చేరుతుంది. అంతేా కాదు గ్రూప్ టాపర్ గా కూడా నిలుస్తుంది. ఒకవేళ ఓడితే మాత్రం అప్పుడు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. దాంతో ఈ మ్యాచ్ లో విజయమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగనుంది.
డీకే, అక్షర్ పై వేటు!
ఇక టి20 ప్రపంచకప్ లో ఇప్పటికే భారత్ నాలుగు మ్యాచ్ లు ఆడింది. అయితే ఈ నాలుగు మ్యాచ్ ల్లోనూ వికెట్ కీపర్ గా ఉన్న దినేశ్ కార్తీక్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఫినిషర్ గా తనమీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. దాంతో దినేశ్ కార్తీక్ ను పక్కనపెట్టి అతడి స్థానంలో రిషభ్ పంత్ కు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. అదే సమయంలో బౌలర్ గా బ్యాటర్ గా విఫలం అవుతున్న అక్షర్ పటేల్ ను కూడా ఈ మ్యాచ్ నుంచి తప్పించే అవకాశం ఉంది. అతడి స్థానంలో యుజువేంద్ర చహల్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
భారత్ ను కలవర పెడుతున్న రోహిత్ ఫామ్
ఈ టి20 ప్రపంచకప్ లో టీమిండియా ప్రధాన సమస్య ఓపెనింగ్. గత నాలుగు మ్యాచ్ ల్లోనూ ఓపెనర్లు రాహుల్, రోహిత్ లు శుభారంభం అందించలేకపోయారు. రాహుల్ గత మ్యాచ్ లో అర్ధ సెంచరీ సాధించి ఫామ్ లోకి రావడం శుభపరిణామం. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ ఫామే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఒక్క నెదర్లాండ్స్ పై మినహా మిగిలిన అన్ని మ్యాచ్ ల్లోనూ దారుణంగా విఫలం అయ్యాడు. నెదర్లాండ్స్ పై హాఫ్ సెంచరీ చేసినా అది రోహిత్ స్థాయి ఆట అయితే కాదు. ఈ నేపథ్యంలో రోహిత్ ఫామ్ లోకి రావాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. ఇక జట్టు బ్యాటింగ్ భారమంతా కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ లే మోస్తున్నారు. హార్దిక్ కూడా గత రెండు మ్యాచ్ ల్లో పెద్దగా రాణించలేదు. ఈ సమస్యలను భారత్ క్లియర్ చేసుకుంటే ఈ టి20 ప్రపంచకప్ లో భారత్ ను ఆపడం ప్రత్యర్థులకు అంత సులభం కాదు.
టీమిండియా తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, అశ్విన్, అక్షర్ పటేల్/చహల్, షమీ, భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Axar Patel, Dinesh Karthik, Hardik Pandya, Mohammed Shami, Rishabh Pant, Rohit sharma, Surya Kumar Yadav, T20 World Cup 2022, Team India, Virat kohli, Zimbabwe