టి20 ప్రపంచకప్ (T20 World cup) 2022లో టీమిండియా (Team India) కీలక పోరుకు సిద్ధమైంది. గ్రూప్ ‘2’ నుంచి టాపర్ గా అడుగుపెట్టాల్సిన మ్యాచులో జింబాబ్వే (Zimbabwe)తో భారత జట్లు అమీతుమీకి సిద్ధమైంది. మెల్ బోర్న్ (Melbourne) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక, టీమిండియా ఒక మార్పుతో ఈ మ్యాచులో బరిలోకి దిగుతుంది. దినేష్ కార్తీక్ ను పక్కన పెట్టి.. అతని స్థానంలో రిషబ్ పంత్ కి చోటు కల్పించింది. ఇక, జింబాబ్వే రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. షుంబా, జాంగ్వేలను పక్కన పెట్టి.. మున్గేంగా, వెల్టింగ్టన్ మసక్జదాల్ని జట్టులోకి తీసుకుంది.
ఇప్పటికే సౌతాఫ్రికా ఓటమితో టీమిండియా సెమీస్ కి చేరింది. అయితే, ఈ మ్యాచు కూడా టీమిండియాకు కీలకమే. టీమిండియా గ్రూప్ -1 టాపర్ గా సెమీస్ లోకి దర్జాగా అడుగుపెట్టడం కీలకం. దీంతో, జింబాబ్వేపై గెలిచి.. ఆత్మవిశ్వాసంతో సెమీస్ ఆడాలని ప్రయత్నిస్తోంది రోహిత్ సేన. అయితే, మరోవైపు.. పాకిస్తాన్ ను ఓడించిన జింబాబ్వే.. టీమిండియాపై కూడా గెలిచి సంచలనం సృష్టించాలని భావిస్తోంది.
ఈ టీ20 ప్రపంచకప్ లో టీమిండియా ప్రధాన సమస్య ఓపెనింగ్. గత నాలుగు మ్యాచ్ ల్లోనూ ఓపెనర్లు రాహుల్, రోహిత్ లు శుభారంభం అందించలేకపోయారు. రాహుల్ గత మ్యాచ్ లో అర్ధ సెంచరీ సాధించి ఫామ్ లోకి రావడం శుభపరిణామం. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ ఫామే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఒక్క నెదర్లాండ్స్ పై మినహా మిగిలిన అన్ని మ్యాచ్ ల్లోనూ దారుణంగా విఫలం అయ్యాడు. నెదర్లాండ్స్ పై హాఫ్ సెంచరీ చేసినా అది రోహిత్ స్థాయి ఆట అయితే కాదు.
ఈ నేపథ్యంలో రోహిత్ ఫామ్ లోకి రావాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. ఇక జట్టు బ్యాటింగ్ భారమంతా కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ లే మోస్తున్నారు. హార్దిక్ కూడా గత రెండు మ్యాచ్ ల్లో పెద్దగా రాణించలేదు. ఈ సమస్యలను భారత్ క్లియర్ చేసుకుంటే ఈ టి20 ప్రపంచకప్ లో భారత్ ను ఆపడం ప్రత్యర్థులకు అంత సులభం కాదు.
మరోవైపు.. జింబాబ్వే కూడా సంచలన ఫలితాలతో ఈ టీ20 ప్రపంచకప్ లో మంచి ప్రదర్శన చేసింది. దీంతో.. టీమిండియాపై కూడా అదే ప్రదర్శన రిపీట్ చేయాలని భావిస్తోంది. జింబాబ్వే సికందర్ రజా, సీన్ విలియమ్స్, క్రెయిగ్ ఎర్విన్ కీలక ఆటగాళ్లు. బౌలింగ్ లో ఎంగర్వ, ముజర్బానీ కీలకం కానున్నారు.
తుది జట్లు :
టీమిండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, అశ్విన్, అక్షర్ పటేల్, షమీ, భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్
జింబాబ్వే : వెస్లే మదవరే, క్రెయిన్ ఎర్విన్ (కెప్టెన్), చకబవ, సీన్ విలియన్స్, సికందర్ రజా, టోని మున్గేంగా , ర్యాన్ బర్ల్, వెల్లింగ్టన్ మసకజ్దా , రిచర్డ్ ఎంగర్వ, తెండాయ చతారా, బ్లెసింగ్ ముజర్బానీ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, KL Rahul, Rohit sharma, Surya Kumar Yadav, T20 World Cup 2022, Team India, Virat kohli, Zimbabwe