హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs ZIM : టాపర్ గా సెమీస్ లోకి టీమిండియా.. అశ్విన్ తీన్మార్.. చిత్తు చిత్తుగా ఓడిన జింబాబ్వే..

IND vs ZIM : టాపర్ గా సెమీస్ లోకి టీమిండియా.. అశ్విన్ తీన్మార్.. చిత్తు చిత్తుగా ఓడిన జింబాబ్వే..

Photo Credit : ICC Twitter

Photo Credit : ICC Twitter

IND vs ZIM : టీ20 ప్రపంచకప్ 2022లో సెమీస్ లో దర్జాగా అడుగుపెట్టింది టీమిండియా. గ్రూప్ -2 టాపర్ హోదాలో సెమీస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మెల్బోర్న్ వేదికగా జరిగిన పోరులో జింబాబ్వే ను చిత్తు చేసింది రోహిత్ సేన.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టీ20 ప్రపంచకప్ 2022లో సెమీస్ లో దర్జాగా అడుగుపెట్టింది టీమిండియా. గ్రూప్ -2 టాపర్ హోదాలో సెమీస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మెల్బోర్న్ వేదికగా జరిగిన పోరులో జింబాబ్వే ను చిత్తు చేసింది రోహిత్ సేన. 187 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన జింబాబ్వే 17.2 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 71 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఈ విక్టరీతో గ్రూప్ -2 టాపర్ గా నిలిచింది రోహిత్ సేన. జింబాబ్వేలో ర్యాన్ బర్ల్ (22 బంతుల్లో 35 పరుగులు ; 5 ఫోర్లు, 1 సిక్సర్), సికందర్ రజా (24 బంతుల్లో 34 పరుగులు ; 3 ఫోర్లు) ఫర్వాలేదన్పించారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లతో దుమ్మురేపాడు. షమీ, హార్దిక్ పాండ్యా చెరో రెండు వికెట్లు తీశారు. భువనేశ్వర్, అర్ష్ దీప్, అక్షర్ పటేల్ కి తలా ఓ వికెట్ దక్కింది. ఇక, సెమీస్ లో ఈ నెల 10 గురువారం నాడు ఇంగ్లండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది.

187 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన జింబాబ్వేకి ఆదిలోనే షాకుల మీద షాకులు తగిలాయి. ఫస్ట్ బంతికే మదవరేను డకౌట్ గా పెవిలియన్ కు పంపించాడు భువనేశ్వర్ కుమార్. ఆ తర్వాత కాసేపటికే చకబవ కూడా అర్ష్ దీప్ బౌలింగ్ లో డకౌటయ్యాడు. ఆ తర్వాత జట్టు స్కోరు 28 పరుగుల వద్ద సీన్ విలియమ్స్ (11) ను పెవిలియన్ బాట పట్టించాడు షమీ. మరో మూడు పరుగుల తర్వాత కెప్టెన్ క్రెగ్ ఎర్విన్ 13 పరుగులు చేసి హార్దిక్ బౌలింగ్ లో ఔటయ్యాడు.

ఆ తర్వాత వచ్చిన మున్ఎంగో 5 పరుగులు చేసి షమీ బౌలింగ్ లో వెనుదిరిగాడు. దీంతో 36 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, కష్టాల్లో పడ్డ జింబాబ్వే ఇన్నింగ్స్ ను ర్యాన్ బర్ల్, సికిందర్ రజా ఆదుకున్నారు. వీరిద్దరి జోరుకు కాసేపు స్కోరు బోర్డు పరుగలు పెట్టింది. ఈ క్రమంలో ఆరో వికెట్ కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని అశ్విన్ విడదీశాడు. 22 బంతుల్లో 35 పరుగులు చేసిన ర్యాన్ బర్ల్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక, ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి మ్యాచును కోల్పోయింది జింబాబ్వే.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (35 బంతుల్లో 51 పరుగులు ; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో సూర్యకుమార్ యాదవ్ ( 25 బంతుల్లో 61పరుగులు నాటౌట్ ; 6 ఫోర్లు, 4సిక్సర్లు) మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ 25 బంతుల్లో 26 పరుగులు చేశాడు. జింబాబ్వే బౌలర్లలో విలియమ్స్ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. సికందర్ రజా, ఎంగర్వ, ముజార్బానీ తలా ఓ వికెట్ తీశారు.

First published:

Tags: Mohammed Shami, Ravichandran Ashwin, Rohit sharma, Surya Kumar Yadav, T20 World Cup 2022, Team India, Virat kohli, Zimbabwe

ఉత్తమ కథలు